Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…

May 12, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. జంధ్యాల దర్శకత్వంలో ఫుల్ లేడీస్ సెంటిమెంట్ సినిమా 1983 సెప్టెంబరులో విడుదలయిన ఈ మూడు ముళ్ళు సినిమా . టైటిల్లోనే మూడు ముళ్ళు , తాళి , ముక్కుపుడక సెంటిమెంట్ పెట్టేసారు .

ఈ సినిమా రాధిక సినిమా . రాధిక , చంద్రమోహన్ , రాజ్యలక్ష్మి , గీతలు ముఖ్య పాత్రలు పోషించారు . కమర్షియల్ గా సక్సెస్ అయింది . తమిళంలో భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ముంధనై ముడిచు (Mundhanai Muddhu) ఆధారంగా మన తెలుగు సినిమా రీమేక్ చేసారు .

Ads

తమిళంలో భాగ్యరాజా , ఊర్వశి , పూర్ణిమా జయరాం , దీప ప్రధాన పాత్రల్లో నటించారు . తమిళంలో పాటల చిత్రీకరణ చాలా బాగుంటుంది .

భార్యను పోగొట్టుకున్న ఒక స్కూల్ మాస్టారు తన బిడ్డను చంకలో ఎత్తుకుని ఓ గ్రామానికి ఉద్యోగానికి వస్తాడు . ఆ ఊరి ప్రెసిడెంట్ కూతురు ఓ ముగ్గురి పిల్లల సైన్యంతో సున్నప్పిడత పనులన్నీ చేస్తుంటుంది ఊళ్ళో . కొత్తగా వచ్చిన మాస్టార్ని గోలగోల చేస్తుంది . ఆ క్రమంలో మాస్టారి సంస్కారం నచ్చి అతనినే పెళ్లి చేసుకునేందుకు డిసైడ్ అయిపోతుంది .

పంచాయతీలో మాస్టారు వలన తాను గర్భవతిని అయ్యానని అబధ్ధం చెప్పి , బిడ్డ మీద కూడా ఒట్టేసి మూడు ముళ్ళు కట్టించుకుంటుంది . మూడు ముళ్ళయితే వేయించుకుంటుంది కానీ , కాపురం అయితే చేయించుకోలేక పోతుంది . క్రమంగా రాధిక నిబధ్ధతకు మెచ్చి ప్రేమించటం మొదలుపెడతాడు మాస్టారు . టూకీగా ఇదీ కధ .

కధ బాగానే ఉంది . కధ కూడా భాగ్యరాజాదే . తెలుగు నేటివిటీ కొరకు కొన్ని మార్పులు చేసుకున్నారు . అమలాపురం చుట్టుపక్కల నలభై రోజుల్లో షూటింగ్ చేసారు . కోనసీమ అందాలను చక్కగా వినియోగించుకున్నారు .

రాధిక , చంద్రమోహన్లతో పాటు రాజ్యలక్ష్మి , గీత , కాంతారావు , డబ్బింగ్ జానకి , నళినీకాంత్ , సుత్తి జంట , ప్రభృతులు నటించారు . రాధిక పిల్ల సైన్యంలో ఆలీ ఉంటాడు . బాగా అల్లరిగా నటించాడు . కోటా శ్రీనివాసరావు ఓ అతిధి పాత్రలో కనిపిస్తాడు . ప్రాణం ఖరీదు , అమరజీవి సినిమాల తర్వాత కోటాకు ఇది మూడో సినిమా . అలాగే తెలంగాణ శకుంతలకు కూడా మా భూమి , కుక్క సినిమాల తర్వాత మూడో సినిమా ఇది .

రాజన్ నాగేంద్ర సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి . స్వాగతం స్వాగతం అంటూ సాగుతుంది చంద్రమోహన్ని టీజ్ చేసే రాధిక & పిల్ల సైన్యం పాట . నీకోసం యవ్వనమంతా దాచాను వెన్నెలలో మ్యూజిక్ బాగుంటుంది . ఆలీ , మరగుజ్జు వీరయ్య అల్లరి బాగుంటుంది .

మరో శ్రావ్యమైన పాట లేత చలిగాలులు పాట చిత్రీకరణ రాధిక , చంద్రమోహన్ల మీద చాలా బాగుంటుంది . బజ్జోరా నా కన్నా లాలీ జో జోల పాట హృద్యంగా ఉంటుంది . రాజన్ నాగేంద్ర BGM కూడా చాలా బాగుంటుంది .

డైలాగులు వినపడకుండా ఢాం ఢాం BGM తో ప్రేక్షకులను హింసించే దర్శకులు , సంగీత దర్శకులు ఇలాంటి పాత సినిమాలను చూస్తే BGM ఎలా ఉండాలో అర్థం అవుతుంది . ప్రేక్షకులకు డైలాగులు అర్థం అవుతాయి .

ఈ సినిమాలో ఒక సీన్ మాత్రం జనం మరచిపోలేరు . గీత వయోజన పాఠశాలలో టీచర్ . ఆమె అందాన్ని ఆస్వాదిస్తానికి ఊళ్ళోని ముసలోళ్ళు అందరూ స్కూలుకు వస్తుంటారు . రక్షాబంధన్ నాడు అందరికీ రాఖీ కట్టుతుంది . ఇంకేముంది ! శోకాలు , మూర్ఛలు , వగైరా . సరదాగా ఉంటుంది ఆ సీన్ .

It’s a neat , ladies sentiment , feel good , hilarious movie . చూడతగ్గ జంధ్యాల సినిమా . యూట్యూబులో ఉంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?
  • ‘రా’ కొత్త చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్ మాస్టర్ మైండ్..!!
  • చిరంజీవే హీరో అయినాసరే… మాధవి పాత్రదే అల్టిమేట్ డామినేషన్…
  • ప్రధానిపై క్షుద్ర పూజల ప్రయోగం… విరుగుడుగా ప్రత్యేక పూజలు…
  • బీఆర్ఎస్ పంథాలో ఏమిటీ మార్పు… KCR ఉద్యమ ధోరణికి వ్యతిరేకం…
  • అక్షయ్, శరత్‌కుమార్, మోహన్‌లాల్ ఫెయిల్… విష్ణు, ప్రభాస్ పాస్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions