.
Pardha Saradhi Potluri … స్పెయిన్ లో నేషనల్ ఎమర్జెన్సీ విధించారు! ఇల్యూమినాటి లక్ష్యం చాలా స్పష్టంగా తెలుసుస్తున్నది! యూరోపులో క్రైస్తవ ప్రాబల్యం తగ్గించేసి ఇస్లాం డామినేషన్ పెంచడం!
ఉన్నట్లుండి మోరాకో నుండి స్పెయిన్ లోకి ముస్లిమ్స్ ప్రవేశిస్తున్నారు వేల సంఖ్యలో! గంటకి 12,000 వేల మంది చొప్పున ఇప్పటి వరకూ 60,000 మంది స్పెయిన్ లోకి చొరబడ్డారు! మోరాకో నుండి స్పెయిన్ లోకి చొరబడుతున్న వారు అందరూ యువకులే అంటే మిలిటరీలో పనిచేసే అర్హత ఉన్నవారే!
Ads
స్పెయిన్ లోకి చొరబడిన మోరాకో యువకులు ఇళ్లలోకి చొరబడి ఆక్రమించుకుంటున్నారు! స్పెయిన్ ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ విధించి సైన్యాన్ని రంగంలోకి దించింది పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి!

మోరాకో స్పెయిన్ భౌగోళిక స్వరూపం!
మోరాకో ఉత్తర ఆఫ్రికాలో చివరగా ఉంటుంది. స్పెయిన్ యూరోపులో భాగం కానీ మోరాకోతో సంబంధం ఉంది. ఎలాగంటే మోరాకోని స్పెయిన్ ని విడదీస్తూ జీబ్రాల్టర్ జలసంధి ఉంటుంది! ఈ జీబ్రాల్టర్ జలసంధి మధ్యధరా సముద్రంని అట్లాంటిక్ సముద్రాన్ని కలుపుతుంది. ప్రపంచ సముద్ర రవాణాలో జీబ్రాల్టర్ జలసంధి ముఖ్య పాత్ర వహిస్తుంది!
జీబ్రాల్టర్ జలసంధి ఒక చోట 13 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటూ మోరాకో, స్పెయిన్ మధ్య అతి దగ్గర సరిహద్దుగా ఉంటుంది జస్ట్ రామేశ్వరం శ్రీలంక మాదిరిగా!
చొరబాట్లు ఎక్కడ నుండి ఎక్కడికి జరిగాయి?
మోరాకో సముద్రతీర పట్టణ ప్రాంతం అయిన ఫ్నిదెక్ ( Fnideq ) నుండి స్పెయిన్ తీర పట్టణాలు అయిన సియుట ( Ceuta ), మెలిల్లా ( Melilla ) లోకి చొరబడ్డారు. చిన్న చిన్న బోట్లలో మోరాకో నుండి స్పెయిన్ సరిహద్దుల దగ్గరికి చేరుకొని కంచె ఎక్కి చొరబడ్డారు.
మోరాకో బోర్డర్ పోలీస్ సరిహద్దు గేట్లు తెరిచి యువకులని స్పెయిన్ వెళ్ళడానికి సహకరించారు.
కనీసం వెయ్యి మంది యువకులు 13 కిలోమీటర్లు జీబ్రాల్టర్ జలసంధిలో ఈదుకుంటూ స్పెయిన్ చేరుకున్నారు!
భారతమా బహుపరాక్!
ఇటీవలే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సముద్ర మార్గం ద్వారా ఈదుకుంటూ తమ ఉగ్రవాదులని గుజరాత్ లోకి పంపిస్తామని ప్రకటించింది! నిన్న జీబ్రాల్టర్ ఈదుకుంటూ స్పెయిన్ చేరుకున్న ఘటనతో లష్కరే తోయిబా ప్రకటనతో పోల్చుకోవాల్సిందే!
రాత్రిపూట ఈదుతూ, వెలుతురు రాగానే సముద్రంలోనే చిన్నపాటి లైఫ్ జాకెట్ ని ఉపయోగించి విశ్రాంతి తీసుకొని, చీకటి పడగానే మళ్ళీ ఈదుతూ తీరానికి చేరుకునే విధంగా శిక్షణ ఇస్తున్నది లష్కరే తోయిబా! బహుశా పాకిస్తాన్ నేవీ అరేబియా సముద్రంలో శిక్షణ ఇస్తుండవచ్చు!
మొరాకో చొరబాట్లకి కారణం? అమెరికా కన్నెర్ర!
ఇంత అకస్మాత్తుగా మోరాకో చొరబాట్లకి కారణం స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ ( Pedro Sanchez ). స్పెయిన్ రాచరిక వ్యవస్థతో కూడిన రాజ్యాంగం అమలుచేస్తుంది!
స్పెయిన్ లో రాజు ఫెలిప్ VI ( King Felipe VI) సుప్రీం లీడర్ జస్ట్ డేన్మార్క్ లాగా!
స్పెయిన్ నాటో సభ్యదేశం. ఇరాన్ మీద దాడి చేయడం కోసం స్పెయిన్ లోని నాటో స్థావరాలని వాడుకోవాలని అమెరికా కోరగా స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ తీవ్రంగా వ్యతిరేకించాడు! రెండు నెలల క్రితం అమెరికన్ మిలిటరీ రవాణా విమానం ఇంధనం కోసం స్పెయిన్ చేరుకున్నప్పుడు పెడ్రో శాంచెజ్ లాండింగ్ కోసం అనుమతి ఇవ్వలేదు. దాంతో అమెరికా సెక్రటరీ అఫ్ స్టేట్ మార్కో రుబియో పెడ్రో శాంచెజ్ మధ్య మాటల యుద్ధం జరిగింది! దాని పర్యవసానమే మోరాకో నుండి స్పెయిన్ లోకి చొరబాట్లు జరిగాయి!
మార్కో రుబియో వైట్ హౌస్ నుండే వ్యవహారాలు నడిపిస్తున్నాడు!
మార్కో రుబీయోతో పాటు అమెరికా రక్షణ మంత్రి హెగ్ సెత్ లకి ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలు ఇస్తున్నాడు!
ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయేల్ చేస్తున్న దాడికి మద్దతు ఇవ్వని దేశాలని ఎలా దెబ్బతీస్తారో స్పెయిన్ ఒక ఉదాహరణ.
భారత ఉపఖండంలోని ముస్లిమ్స్ కళ్ళు తెరవాలి!
స్పెయిన్ క్రైస్తవ దేశం, మోరాకో ముస్లిం మెజారిటీ దేశం! ఇరాన్ మీద దాడిని వ్యతిరేకిస్తున్న స్పెయిన్ కి మోరాకో ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు?
ముస్లిం బ్రదర్ హుడ్ ( Muslim Brotherhood ) అనేది కీలకమైన సంస్థ అన్ని ముస్లిం దేశాలకి!
ISIS, అల్ ఖైదా, ముస్లిం బ్రదర్ హుడ్ అనేవి ముస్లిమ్స్ కి చెందినవి కావు! అమెరికా, ఇజ్రాయేల్ కోసం పనిచేస్తాయి. అఫ్కోర్స్! ఈజీప్ట్, టర్కీ, ఖతార్, ఇతర ముస్లిం దేశాలు ముస్లిం బ్రదర్ హుడ్ కి నిధులు సమకూరుస్తూ ఉంటాయి!
పేరుకే ముస్లిం బ్రదర్ హుడ్! కానీ అమెరికా ఇజ్రాయేల్ ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది!
ముస్లిం బ్రదర్ హుడ్ నాయకులు రహస్యంగా వాటికన్ వెళ్లి పోప్ ని కలిసి చర్చలు జరుపుతారు కానీ వాటి వివరాలు బయటికి చెప్పరు! వీళ్ళకంటే ఒకరోజు ముందే డీప్ స్టేట్ వ్యక్తులు పోప్ ని కలిసి ముస్లిం బ్రదర్ హుడ్ నాయకులకి ఏం చెప్పాలో డిక్టేట్ చేసి వెళ్ళిపోతారు!
ఈ విషయం అరబ్ దేశాలకి తెలియదా? తెలుసు కానీ అది స్నేహపూర్వక సమావేశం అని బయటికి చెప్తాయి ఒకవేళ ఎవరన్నా ప్రశ్నిస్తే! ఇంతవరకూ ఏ విలేఖరి అరబ్ నాయకులని ప్రశ్నించలేదు కూడా ఎందుకంటే, ప్రశ్నిస్తే వాళ్ళు తరువాతి రోజు సూర్యోదయాన్ని చూడలేరు!
So! ముస్లిం బ్రదర్ హుడ్ అనేది ఆగ్నేయాసియాలోని ముస్లిమ్స్ కి ఏం చేయాలో ఏం చేయకూడదో శాసిస్తుంది! మోరాకో యువకులు ఆకస్మాత్తుగా స్పెయిన్ లోకి చొరబడడానికి ముస్లిం బ్రదర్ హుడ్ కారణం! ముస్లిం బ్రదర్ హుడ్ కి రహస్యంగా ఆదేశాలు వచ్చాయి ఎలా చొరబడాలో అని.

మోరాకో 1912 నుండి 1956 వరకూ స్పెయిన్ వలస పాలనలో ఉండేది! మోరాకోని స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలు ఆక్రమించాయి.
1912 లో స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలు మోరాకోని విభజించి పాలించడానికిగాను ‘ఫెజ్ అనే ఒప్పందం ‘ ( Treaty of Fez ) చేసుకొని మోరాకోని రెండు బాగాలుగా చేసి పరిపాలించాయి. స్పెయిన్ మోరాకోలోని ఉత్తర భాగం ( northern strip ) అయిన రిఫ్ ప్రాంతం, దక్షిణ మోరాకోలోని కేప్ జుబి ( Cape Juby ) ప్రాంతం తమ అధీనంలో ఉంచుకొని మిగతా మోరాకోని ఫ్రాన్స్ కి అప్పచెప్పింది.
మోరాకో ఉత్తర భాగానికి 1956 లో స్వాతంత్య్రం రాగా దక్షిణ మోరాకోకి 1958 లో స్వాతంత్య్రం వచ్చింది!
ఇదే ట్రిక్ పాయింట్!
మోరాకో నుండి స్పెయిన్ వైదొలిగినా మోరాకోకి చెందిన రెండు నగరలాని స్పెయిన్ తన అధీనంలోనే ఉంచుకున్నది అవి : సియుట ( Ceuta ), మెలిల్లా ( Melilla )…
So! అవి మావే అని ఈ రెండు నగరాలలోకి చొరబడ్డారు! అనధికారకంగా ఈ రెండు నగరాలు ఒకప్పుడు మోరాకోలో భాగంగా ఉండేవి కానీ 1956 లో స్పెయిన్ ఈ రెండు నగరాలని మోరాకోకి అప్పచెప్పలేదు!
అమెరికా, ఇజ్రాయేల్ దేశాలు తమకి ఎదురు చెప్పే దేశాలని ఎలా ఇరుకున పెట్టగలవో ఈ ఘటన ఒక ఉదాహరణ!
ఇరాన్ విషయంలో అమెరికా, ఇజ్రాయేల్ ని వ్యతిరేకస్తున్న యూరోపు దేశాలకి స్పెయిన్ దేశపు ఘటన ఒక హెచ్చరిక! మాట వింటే సరి! లేకపోతే ఇదే ముస్లిం బ్రదర్ హుడ్ చేత యూరోప్ మొత్తం తగలపెట్టించేస్తాం అని చెప్పకనే చెప్పినట్లయింది!
Share this Article