మొరార్డీ దేశాయ్… 81 ఏళ్ల వయస్సులో ప్రధానమంత్రి పదవి చేపట్టిన ఈ నాయకుడి మీద విమర్శలూ ఉన్నాయి, వివాదాలూ ఉన్నాయి… ప్రశంసలూ ఉన్నాయి… జాతీయ రాజకీయాల్లో తన పేరు ప్రముఖంగానే లిఖించబడే ఉంటుంది…
జైలు నుంచి బయటకొచ్చిన వెంటనే ఇందిరాగాంధీని ఓ స్పాయిలర్ గర్ల్ గా తూర్పారబట్టాడు… ప్రజలతో మమేకమయ్యాడు… అధికారం తనకు తప్పకుండా వస్తుందన్న విశ్వాసంతో ఉన్న ఆయన ఇందిరను తల్లిగా అభివర్ణించడంపై మండిపడేవాడు… అది ముమ్మాటికీ తప్పుడు భావన. ఆమెకు ఆ మాత్రం గౌరవం దొరకడానికి ఆమెకున్న అధికారం, పదవి మాత్రమే కారణమనేవాడు…
Ads
మొరార్జీ దేశాయ్ 1995, ఏప్రిల్ 10వ తేదీన తన 99 ఏళ్ల వయస్సులో పూర్ణాయుష్కుడిగా కన్నుమూశాడు… అసలు తనకు మంత్రి పదవి రావడమే యాక్సిడెంటల్… తనకు ఆ కుర్చీపై బాగా మనసుంది… 1966లో తాష్కెంట్‌లో లాల్ బహదూర్ శాస్త్రి మరణించాక, తదుపరి ప్రధాని ఎవరు అనే ప్రశ్న తలెత్తింది…
తనకే అనుకున్నాడు… కానీ ఇందిర రూపంలో అడ్డంకి… ఉపప్రధాని పదవి ఇచ్చి కళ్లు తుడిచారు అప్పట్లో… 1969లో ఇందిర వ్యతిరేకులందరితో జట్టుకట్టాడు… పార్టీ చీలింది… అప్పటికే ఇందిరతో విభేదాలు… తరుావత 1974లో గుజరాత్‌లో అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని లీడ్ చేశాడు… జయప్రకాష్ నారాయణ ఉద్యమమూ అప్పుడే…
ఇందిర ప్రభుత్వ అవినీతిపై సంపూర్ణ క్రాంతి పేరిట పెద్ద ఉద్యమం… 1975లో ఇందిర ఎన్నికను కోర్టు కొట్టేయడం, ఆమె ఎమర్జన్సీ పెట్టడం చకచకా జరిగిపోయాయి… తరువాత 1977లో ప్రధానిగా పగ్గాలు… కల నెరవేరింది… సరే, తన విదేశాంగ విధానం, RAW ను దారుణంగా దెబ్బతీసిన తీరు వంటి చాలా వివాదాలున్నాయి… విమర్శలున్నాయి… చివరకు రెండేళ్లకే అతుకుల బొంత వంటి జనతా పార్టీ అధికారం కోల్పోయింది, దాంతో మొరార్జీ పదవుల కెరీర్ ముగిసింది…
నిజానికి తను బ్రిటిష్ ప్రభుత్వంలో 12 ఏళ్లపాటు సివిల్ సర్వెంటు… బాంబే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా చేశాడు… తను పూర్తిగా శాకాహారి, తన పక్కన ఎవరైనా మాంసాహారం తింటున్నా సహించేవాడు కాదు… స్వమూత్రపానంతోనూ ప్రసిద్ధుడు…
సరే, ఓ ఇంట్రస్టింగు విషయానికొద్దాం… మొరార్జీ దేశాయ్‌కు మద్యం అంటే పడదు… తన చుట్టూ ఉన్నవారు ఎవరైనా సరే మద్యం సేవిస్తే సహించేవాడు కాదు… మొరార్జీ దేశాయ్ కేబినెట్‌లో వాజపేయి విదేశాంగ మంత్రి… ఓసారి వాజపేయి జపాన్ రాయబార కార్యాలయానికి వెళ్లి మద్యం సేవించాడని ఎవరో మొరార్జీకి మోశారు…
తరువాత తనను వాజపేయి కలిసినప్పుడు ఓసారి మొరార్జీ తనను మందలించాడు… ఏమిటీ ఈ పని అంటూ ఆక్షేపించాడు… తన కేబినెట్ మంత్రి అయినా సరే… నిజానికి వాజపేయి పెద్ద తాగుబోతు కాదు… అకేషనల్ డ్రింకర్… తను స్వతహాగా భావుకుడు, కవి… తనతో శృతి కలిసేవాళ్లు, సంగీతమో, సాహిత్యమో అభిరుచులుగా ఉన్నవారు కలిస్తే… కాసింత పుచ్చుకుని పాటలు, కవితాగానాల్లో తేలిపోయేవాడు…
మొరార్జీ దేశాయ్ వాజపేయిని మందలించిన విషయం ఆమధ్య చెప్పుకొచ్చి సుబ్రహ్మణ్యస్వామి, మరి వాజపేయి మొరార్జీకి ఏం బదులిచ్చాడో మాత్రం చెప్పలేదు… తన అభిరుచుల్ని, తన ఆలోచనల్ని, తన నిర్ణయాల్ని తప్పుపట్టే వాళ్లను వాజపేయి కూడా సహించడు… సో, ఆ కోణంలోనే మొరార్జీకి బదులిచ్చి ఉంటాడు..!!
తరువాత కాలంలో జనతా పార్టీ ముక్కలు చెక్కలైపోయింది… కానీ పాత జనసంఘ్‌ను భారతీయ జనతా పార్టీగా మార్చి వాజపేయి లీడ్ చేశాడు, ప్రధాని అయ్యాడు… ఇప్పుడు అదే పార్టీ అధికారంలో ఉంది…!
Share this Article