Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనుపమ..! ఫాఫం, ఏమైందో ఏమిటో గానీ… ఏమేమో మాట్లాడేస్తోంది…

March 27, 2024 by M S R

‘‘అనుపమ పరమేశ్వరన్ గురించే అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు… అనుపమ, నేను ముందుగానే ఊహించాం ఇది… కానీ ఒక్కసారి సినిమా రిలీజ్ కానివ్వండి, సినిమాలో ఆమె పాత్ర గురించే మాట్లాడతారు ఇక’’ అంటున్నాడు రాబోయే టిల్లూ స్క్వేర్ సినిమా హీరో జొన్నలగడ్డ సిద్ధూ… ఏమో, అదేమో గానీ ఇప్పుడు అనుపమ అయోమయం కూతల గురించైతే అందరూ మాట్లాడుకుంటున్నారు… అది నిజం…

నిజానికి డీజే టిల్లూ సక్సెస్ తరువాత ఈ సీక్వెల్ తీయాలని నిర్ణయించుకున్నారు… సిద్ధూ సినిమా విషయంలో అనేక అంశాల్లో కాళ్లూ వేళ్లూ పెట్టాడు కదా, సీక్వెల్ కథ విషయంలోనూ ఇన్వాల్వ్ అయ్యాడు… కానీ ఫస్ట్ పార్ట్ తీసిన దర్శకుడు విమల్‌ కృష్ణకు కథ నచ్చలేదు, అన్నింటికీ మించి దర్శకుడు తనో, సిద్ధూయో అర్థం కాలేదు… అందుకని సైలెంటుగా తప్పుకున్నాడు… తప్పనిసరై మరో దర్శకుడు మల్లిక్ రామ్‌ను పెట్టుకున్నారు…

tillu

Ads

చాన్నాళ్లు లేటయింది నిర్మాణం… ఇక ఇప్పుడు రిలీజ్ కాబోతోంది, అది వేరే విషయం… డీజే టిల్లూలో నటించిన నేహా శెట్టినే తీసుకోవాలని అనుకున్నా ఆమె మరేదో సినిమాకు డేట్స్ ఇచ్చేసింది… దాంతో అనుపమను తీసుకున్నారు… తరువాత ఆమె ఎంపిక తీరు బాగాలేదనే వార్తలు, ఆమె వెళ్లిపోవడం, తరువాత మళ్లీ జాయినవడం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటోంది సినిమా…

ట్రెయిలర్లు చూశాక ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు… కాస్త పద్ధతయిన వేషాలు వేసుకునే అనుపమ ఏమిటి..? ఇలా బోల్డ్‌గా సిద్ధూ మీద పడిపోయిందేమిటి అని..! ట్రెయిలర్‌లోనే దాదాపు 16 సెకండ్లు లిప్ లాకే… పైగా పొట్టి దుస్తులు…

tillu

‘‘ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేసీ చేసీ బోర్ వచ్చేసింది… అందుకే ఈ పాత్రను అంగీకరించాను… ఇది అంగీకరించకపోతే తప్పు చేసినట్టు అయ్యేదాన్ని… ఎప్పుడూ బిర్యానీ పాత్రలే కావాలంటే ఎలా..? అప్పుడప్పుడూ పులిహోర పాత్రలు కూడా చేయాలి కదా’’ అంటూ ఏదో బిర్యానీ, పులిహోర కబుర్లు చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేసింది… పద్దతిగా ఉంటే బిర్యానీ అట, బోల్డ్‌గా చేస్తే పులిహోర అట… ఏమైంది ఈమెకు అనుకున్నారందరూ…

anupama

అఫ్‌కోర్స్, మరిన్ని అవకాశాల వేటలో ఆమె కొన్ని హద్దులను చెరిపేసుకుందట, రౌడీ బాయ్స్‌లో కూడా అంతేకదా… అసలు ఇది కాదు… తరువాత ఎక్కడో మాట్లాడుతూ… ‘‘స్క్రీన్ పై  ఒక అమ్మాయి హాట్‌గా కనిపించడం ఎంత కష్టమో మీకు తెలుసా? నాకు ఈ సినిమాతో అది ఎంత కష్టమో అర్థమైంది. చూసిన వాళ్లందరూ గ్లామర్‌గా ఉండే పాత్రలు  చేస్తుందని సింపుల్‌గా కామెంట్స్‌ మాట వదిలేస్తున్నారు. అలాంటి పాత్ర చేయడం చాలా ఇబ్బంది…

కొన్ని కాస్ట్యూమ్స్‌ స్క్రీన్ పై చూడడానికి కలర్‌ఫుల్‌గా ఉంటాయి. కానీ, అవి వేసుకుని సెట్‌లో అంతమంది ఎదుట ఉండాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మాకు మాత్రమే తెలుస్తుంది… మరికొన్ని కాస్ట్యూమ్స్‌కు మొత్తం అద్దాలతో చేసిన వర్క్‌ ఉంటుంది… అవి చర్మానికి గీసుకుపోతుంటాయి… ఇలాంటివన్నీ భరిస్తేనే తెరపై గ్లామర్‌గా కనిపిస్తారు. ఇలాంటి ఇబ్బందులు పడుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న నటీమణులందరినీ మెచ్చుకోవాలి… అని చెప్పుకొచ్చింది…

anupama

అవును, ఆ బోల్డ్ పాత్ర అంగీకరించాక అన్నీ చేయాల్సిందే కదా… ఫాపం, ప్రేక్షకుల కోసం అన్నేసి త్యాగాలు చేసినట్టు మాట్లాడితే ఎలా..? పాత్ర నాకు నచ్చింది, పాత్రకు తగ్గట్టుగా చేశాను అని ఒక్కమాట చెబితే అయిపోయేది కదా… (బరిబాతల నటించినవాళ్లు కూడా కథ డిమాండ్ చేసింది అంటూ ఏవో కబుర్లు చెబుతారు కదా…) ఏదో చెప్పబోయి, తనేదో ప్రేక్షకుల వినోదం కోసం బాగా కష్టపడిపోతున్నట్టు బిల్డప్, కవరింగు, కలరింగు దేనికి..? (సిద్ధూ నాటి గుంటూరు టాకీస్ సినిమా దగ్గర్నుంచీ కాస్త బోల్డిస్టే కదా… డీజే టిల్లూలో కూడా…)

పైగా టిల్లు స్క్వేర్ సినిమాలో ఇష్టం లేకుండానే నటించిందట… షూటింగ్ స్టార్టయ్యాక సిద్ధూ ప్రతి విషయంలోనూ సలహాలు ఇచ్చేవాడట… (తను అనుకున్నట్టే సినిమా రావాలనేది సిద్ధూ ప్రయత్నం…) అదేమో నాకు నచ్చేది కాదుట… కానీ తరువాత సిద్ధూను అర్థం చేసుకున్నదట… ఫాపం, అనుపమ ఏదేదో మాట్లాడేస్తోంది… ఆమె ఏదైనా నోరు విప్పితే ఆమెకూ, సినిమాకు నష్టం… నోరు మూసుకోవమ్మా తల్లీ…! ఇజ్జత్ నిలబడతది..!! ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియనప్పుడు ‘‘ఊరుకున్నంత అత్తమం, మూసుకున్నంత లాభం’’ మరొకటి లేదు..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాన్ ఇండియా కాదు.. ! తెలుగులో మాత్రమే అఖండ తాండవం.. !!
  • యూదులు ఎక్కడున్నా ప్రాణభయమే…! అసలు ఏమిటీ హనుఖ్క..!?
  • …. అలా ఈనాడుపై ఉదయం, ఆంధ్రజ్యోతి ‘పగ తీర్చుకున్నాయి’…
  • సీఎం జనంలో ఉంటే… అపహసించే ప్రతిపక్షం చరిత్రలో ఇదే తొలిసారి…
  • కీలక డాక్యుమెంట్… సాయుధ పోరాట దుస్థితిపై ఐదేళ్లుగా అంతర్గత చర్చ..!!
  • వావ్… తొలిసారిగా ఓ ‘ప్రెస్‌’టీజియస్ పోస్టులోకి లేడీ జర్నలిస్ట్..!
  • స్క్రిప్టెడ్ లవ్‌ట్రాక్ కాదు… సైలెంటుగా చిగురించి పెనవేసుకున్న బంధం..!
  • జుహీ చావ్లా తొలి తెలుగు సినిమా… అదీ సూపర్ స్టార్ డైరెక్షన్‌లో…
  • మెస్సీ పట్ల ఈ ‘ఫస్ట్ లేడీ’ అమర్యాదకర ప్రవర్తన..! నెటిజనం తిట్టిపోతలు..!!
  • ఎవరూ అడుగుమోపని… ఆ మార్మిక కైలాస పర్వతం ఎక్కిన ఏకైక వ్యక్తి..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions