.
గూట్లో ఉంది బెల్లం ముక్క గుట్టుగుట్టుగా… నోట్లో పెడితే నానుతుంది మెత్తమెత్తగా…. అని ఏదో పాత తెలుగు సినిమాలోని ఓ వెగటు పాట… రాసిన మగానుభావుడెవడో… స్వరపరిచిన వాడెవడో తెలియదు గానీ… మనవాళ్లకే తెలిసిన ఓ జానర్ బూతు అది…
సరే, అలాంటివి బోలెడు పాటలు మన తెలుగు సినిమాల్లో, ప్రత్యేకించి పాత ఎన్టీయార్ సినిమాల్లో సైతం… కానీ దాన్ని జబర్దస్త్ షోలోకి తీసుకొచ్చి ఓ స్కిట్ చేశారు… ఫాఫం, రాఘవ అని కాస్త పద్దతిగానే స్కిట్స్ చేస్తాడు… ఈటీవీ, మల్లెమాల క్రియేటివ్ టీమ్స్ టేస్టంటే మరి పాతాళం రేంజు కదా… రాఘవను కూడా చేస్తే ఫుల్లు వెగటు స్కిట్స్ చేస్తే చేయి లేకపోతే పో అన్నట్టున్నారు…
Ads
ఆ పాటతో తాజాగా ఓ స్కిట్ చేశాడు… జబర్దస్త్ తరిమేస్తే, మళ్లీ ఈమధ్య రీఎంట్రీ ఇచ్చిన చలాకీ చంటి కూడా అందులో పాల్గొని తెగ ఎంజాయ్ చేశాడు… అల్లమపిస్తా పిస్తా అంటూ… ఇదంతా వోకే… సోకాల్డ్ వెకిలి శివాజీ జడ్జి అట… దానికి బల్లపై చప్పట్లు మోదుతూ అభినందనలు, నవ్వులు… మీరెక్కడ తయారయ్యార్రా బాబూ…
అప్పట్లో రోజాకు ఇదే వ్యాధి ఉండేది… (అఫ్‌కోర్స్ నాగబాబుకు కూడా…) కమెడియన్ చెప్పే పంచ్ డైలాగులు వాళ్లే ముందుగా చెప్పేసి స్కిట్స్ కంపు పట్టించేవాళ్లు… దాన్ని మల్లెమాలవాడు గొప్ప క్రియేషన్ అన్నట్టుగా యథాతథంగా భయభక్తులతో ప్రేక్షకులకు సమర్పించేవాడు… ఇప్పుడు శివాజీ వాళ్లకు తాత…
నిజానికి ఆ షోయే ఎవడూ చూడటం లేదు, దారుణమైన రేటింగ్స్… దానికితోడు శివాజీ వచ్చాక పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయింది… అతిగా నవ్వు, స్కిట్ మధ్యలోనే వెకిలిగా నవ్వుతూ కామెంట్లు, పక్కన సేమ్ సేమ్ ఖుష్బూ… ఇంద్రజ చాలా చాలా బెటర్…
అసలు సద్దాం, పండు వంటి కొత్త కేరక్టర్లు వచ్చాక షోలో కాస్త నాణ్యత పెరిగి ఉండాలి… కానీ మరింత దిగజారిపోయింది… ఇమ్మూ, నూకరాజు, ఫైమా తదితరులే కాదు, చివరకు ఆటో రాంప్రసాద్ కూడా చిల్లరగా తయారైపోయాడు… టీవీ వాడు కోరుకున్నదే ఇవ్వాలి కదా… అలా ఫుల్లు చెడగొట్టేస్తున్నారు అందరూ కలిసి…
దరిద్రం ఏమిటంటే..? వేరే తెలుగు చానెల్స్‌లో కామెడీ షోలు లేవు… ఉన్నదేమో ఈ చిల్లర కామెడీ… అదీ వెగటు… రోత… తెలుగు భాష, సంస్కృతి, సంస్కారం, ప్రమాణాలు మన్నూమశానం అని సుద్దులు మాట్లాడే ఈనాడు- ఈటీవీ వారి ప్రజెంటేషన్ ఘనత ఇది… యూట్యూబ్ ట్యూన్ చేస్తే సరి, ఇవే స్కిట్లు…
చేయండిరా… ఇంకా చేయండి… లేలేలే లేలే నారాజా, గుగ్గు గుగ్గు గుడిసుంది, చల్లగా లేస్తుంది పాటలూ తీసుకుని జాతి గర్వపడే స్కిట్లు చేయండర్రా… మీకేం హద్దు, మీకేం అదుపు… పైగా ప్రశంసలు, సోకాల్డ్ శివాజీ వంటి జడ్జిల చప్పట్లు…
Share this Article