“ THY SHALL MAKE WAR BY DECEPTION” యూదుల బైబిల్ లోని వాక్యం!
మోస్సాద్ ఇరాన్ లో తన ఏజెంట్ల ను రహస్యంగా రిక్రూట్ చేసుకుంటూ వస్తున్నది దశాబ్ద కాలంగా!
హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనీయా హత్యకు గురయ్యాడు!
మోస్సాద్ నిర్వహించిన ఆపరేషన్స్ అన్నింటిలో ఇదే అత్యుత్తమ ఆపరేషన్!
జులై 31,2024 తెల్లవారుఝామున 2 గంటలకి ఇస్మాయిల్ హనీయ హత్యకు గురయ్యాడు!
********
Ads
హత్య ఎలా జరిగింది?
ఇస్మాయిల్ హానీయ (Ismail Haniyeh) ఇరాన్ నూతన అద్యక్షుడు మసూద్ పెజెష్కియన్( Masoud Pezeshkian) ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టెహ్రాన్ వచ్చాడు!
ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఉత్తర భాగంలో IRGC ( Iran Revolutionary Guards Corps ) కి చెందిన గెస్ట్ హౌస్ ఉంది!
ఇరాన్ కి వచ్చిన VIP ల కోసమే ఈ గెస్ట్ హౌస్ లో ఆతిథ్యం ఇస్తుంది.
ఈ గెస్ట్ హౌస్ కి పటిష్టమైన భద్రత కల్పిస్తుంది IRGC.
CCTV కెమెరాలతో పాటు సిగ్నల్ జామర్ కూడా ఉంది.
ఏకంగా ఇరాన్ రివోల్యోషనరి గార్డ్స్ రక్షణలో ఉన్న గెస్ట్ హౌస్ లోనే ఇస్మాయిల్ హనేయా హత్యకు గురయ్యాడు.
********
ఎలా సాధ్యమైంది?
ఏకంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో కి మోస్సాద్ ఎలా హత్యకు ప్లాన్ చేయగలిగింది?
రెండు నెలల క్రితమే ఇస్మాయిల్ హానియా ను హత్య చేయాలని చూసింది మోస్సాద్!
గుర్తుందా?
గత మే నెలలో ఇరాన్ అద్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత రైసి అంత్యక్రియలకు హాజరైన ఇస్మాయిల్ హనేయ ను హత్య చేయాలని అనుకుంది మోస్సాద్!
ఎవరు సహకరించారు మోస్సాద్ కి?
IRGC లో పని చేస్తున్న వారే మోస్సాద్ ఏజెంట్లుగా మారారు!
ఆశ్చర్యంగా ఉంది కదూ?
కానీ ఇది నిజం!
మే నెలలో రైసీ అంత్యక్రియలకు హాజరైన ఇస్మాయిల్ హనియను హత్య చేయాలని అంతా సిద్ధం చేసింది మోస్సాద్ కానీ అంత్యక్రియలకు భారీగా ప్రజలు హాజరవడంతో ఇస్మాయిల్ హనీయా తో పాటు సామాన్య జనం కూడా మరణిస్తారని భావించి చివరి క్షణంలో మిషన్ అబోర్ట్ కి ఆదేశాలు ఇచ్చింది మోస్సాద్!
కానీ అదే రోజు మరో ప్లాన్ ను అమలుచేసింది మోస్సాద్!
అది IRGC గెస్ట్ హౌస్ లో మూడు రూములలో హై ఎక్స్ప్లోజీవ్ బాంబులను అమర్చింది తన ఎజెంట్ల ద్వారా!
అఫ్కోర్స్! ఆ బాంబులు రిమోట్ ద్వారా పేలేట్లుగా డిజైన్ చేశారు!
ఇస్మాయిల్ హనేయా ఇరాన్ ఎప్పుడు వచ్చినా IRGC గెస్ట్ హౌస్ లోనే బస చేస్తాడు అనేకంటే ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆ గెస్ట్ హౌస్ పటిష్టమైన భద్రతలో ఉంటుంది కాబట్టి హమాస్ తమకి అత్యంత కీలకమైన భాగస్వామి కాబట్టి అదే గెస్ట్ హౌస్ లో ఉంచుతూ వస్తున్నది!
ఇదే అతి పెద్ద తప్పు!
యధా ప్రకారం ఇస్మాయిల్ హానేయా జులై 31 న అదే గెస్ట్ హౌస్ లో బస చేశాడు!
అర్ధరాత్రి 2.00 గంటలు.
Bird in Cage ( పక్షి పంజరం లో ఉంది) అనే సందేశం వెళ్ళింది మోస్సాద్ కి వెంటనే రిమోట్ కంట్రోల్ ఆపరేట్ చేయడానికి కావాల్సిన సీక్రెట్ కోడ్స్ ను రిలీజ్ చేసింది మోస్సాద్!
రిమోట్ కంట్రోల్ తో బాంబులను పేల్చేసారు మోస్సాద్ ఏజెంట్లు!
ఒక్కసారిగా మూడు రూములలో ఉన్న బాంబులు పేలడంతో గెస్ట్ హౌస్ కొద్ది క్షణాలు వణికిపోయింది.
అన్ని కిటికీల అద్దాలు పగిలిపోయాయి! కొన్ని ఫ్లాట్ల బాల్కనీలు ముందుకు వొరిగి పోయాయి!
గెస్ట్ హౌస్ కి రక్షణగా ఉన్న IRGC గార్డ్స్ బిల్డింగ్ లో కి వెళ్ళడానికి కొద్దిసేపు తటపటాయించారు! చివరికి లోపలికి వెళ్లి చూడగా ఇస్మాయిల్ హానియ తో పాటు అదే గదిలో ఉన్న ఒక బాడీ గార్డ్ కూడా మరణించారు!
మరో రూములో ఉన్న 8 మంది ఇస్మాయిల్ హనియా
బాడీ గార్డ్ లు కూడా మరణించారు!
ఈ కథనం మొత్తం మోస్సాద్ ఏజెంట్లుగా వ్యవహరించిన IRGC గార్డులు తమ గుర్తింపు తెలియకుండా బయటపెట్టారు! లేకపోతే మిడిల్ ఈస్ట్ కి చెందిన పలు వెబ్ న్యూస్ చానల్స్ ఎలా చెప్పగలిగాయి?
మిషన్ ఏకాంప్లిష్డ్!
*******
సిగ్నల్ జామర్లు ఉన్నా రిమోట్ కంట్రోల్ ద్వారా ఎలా పేల్చగలిగింది అనే సందేహం రావొచ్చు.
సిగ్నల్ జామర్లు ఉన్నా కూడా ఒక పర్టిక్యులర్ ఫ్రీకెన్సీ ను లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇస్తారు. ఇది లోపల ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి !
అయితే ఆ ఫ్రీక్వెన్సీ ని రోజూ మారుస్తూ ఉంటారు భద్రత కోసం! ఫ్రీక్వెన్సీ ను రహస్యంగా ఉంచుతారు!
మోస్సాద్ కి ఈ విషయం తెలుసు కాబట్టి సిగ్నల్ జామర్ ను బై పాస్ చేసి వెళ్లగలిగిన టెక్నాజీతో రిమోట్ ను డిజైన్ చేసింది మోస్సాద్!
********
ఈ ఘటనతో ఖంగుతిన్న ఇరాన్ ఎలా సమర్ధించుకోవాలో తికమకపడి చివరికి ఇజ్రాయేల్ డ్రోన్ ద్వారా SPIKE మిసైల్ తో దాడి చేసింది అని ప్రకటించింది!
మరో కథనం ప్రకారం F-35 తో మిసైల్ దాడి చేసింది అని ప్రకటించింది ఇరాన్!
*********
ఇజ్రాయెల్ ఇస్మాయిల్ హనియ హత్యతో మాకు సంబంధం లేదు అని ప్రకటించింది!
ఇస్మాయిల్ హనీయ ను ఖతార్ దేశంలోనే ఎందుకు చంపలేక పోయింది ఇజ్రాయెల్?
ఖతార్ న్యూట్రల్ దేశం!
రెండు నెలల క్రితం అన్ని దేశాల నుండి ఖతార్ మీద ఒత్తిడి వచ్చింది! హమాస్ ఉగ్రవాద సంస్థ నాయకులకి మీ దేశంలో ఆశ్రయం కల్పించి తప్పు చేస్తున్నారు అంటూ!
దాంతో ఖతార్ ఇస్మాయిల్ హానేయ మీద ఒత్తిడి తేవడంతో టర్కీ లో కొన్నాళ్ళు, ఇరాన్ లో కొన్నాళ్ళు ఉండడానికి నిర్ణయించుకున్నాడు!
ఇక ఇజ్రాయేల్ ఖతార్ లో ఇస్మాయిల్ హనేయా ను హత్య చేస్తే దానికి అంత ప్రాధాన్యత ఉండదు!
అదే ఇరాన్ లో హత్య చేస్తే హమాస్ కి మద్దతు ఇస్తున్నది ఎవరో ప్రపంచానికి తెలిసిపోతుంది!
ఇరాన్, రష్యా, చైనా లు కలిసి నడిపిస్తున్న నాటకం బహిరంగమవుతుంది!
********
భయం ఎలా ఉంటుంది?
నిన్న ఇస్మాయిల్ హానేయా అంత్యక్రియల సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతొల్లా అలీ ఖోమెనీ కూడా హాజరయ్యాడు కానీ మాటి మాటికీ తల ఎత్తి ఆకాశం కేసి చూసి భయంగా చూడడం జరిగింది!
ఎందుకూ భయం భయంగా ఆకాశం కేసి చూసాడు అంటే ఇజ్రాయేల్ డ్రోన్ తో తనని ఎక్కడ చంపేస్తుందో అనే భయంతో!
*********
So! భయం ఎలా ఉంటుందో మొదటిసారిగా అలీ ఖోమేనీ కి తెలిసి వచ్చింది!
కానీ అనవసర భేషజానికి పోతున్నాడు అలీ ఖోమేనీ.
హెజ్బొల్ల, హమాస్ తో పాటు IRGC ను కూడా యుద్ధానికి సిద్దం అవమని ఆదేశాలు ఇచ్చాడు.
ఇరాన్ దగ్గర 20 ఏళ్ళ పాతవి అయిన రష్యన్ S-300 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మాత్రమే ఆధునికమైనది!
రష్యా, చైనా, భారత్ ల తో పాటు టర్కీ దేశాలకి ఒక తీపి వార్త!
అదేమిటంటే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క మొత్తం డాటాను ఉక్రెయిన్ బయట పెట్టింది!
SO! S- 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ PROS AND CONS ఏమిటో అమెరికా తో పాటు ఇజ్రాయేల్ దగ్గరకి చేరిపోయింది!
అంచేత ప్రస్తుతానికి ఇరాన్ S – 300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి ఇజ్రాయేల్ భయపడదు!
********
రాబోయే రోజుల్లో ఇజ్రాయేల్ Vs ఇరాన్, లెబనాన్, సిరియా, లిబియా, యెమెన్ లతో యుద్ధ వార్తలని తెలుసుకోబోతున్నాము అన్నమాట!
ఇప్పటికే బీరూట్ మీద రెండు సార్లు దాడి చేసింది ఇజ్రాయేల్!
సిరియా మీద కూడా దాడి చేసింది ఇజ్రాయేల్!
11 మంది IRGC గార్డులని అరెస్ట్ చేసింది ఇరాన్ గూఢచర్య ఆరోపణలతో. అంటే సమాచారం ఖచ్చితమైనదే ! దటీజ్ మొస్సాద్..!!
Share this Article