.
నిన్న ఫేస్‌బుక్‌లో ఎవరిదో పోస్టు… ఓ మహిళ జానీవాకర్ మందు కొడుతూ ఉంది, ముందు మాంసాహారం ఎట్సెట్రా పార్టీ ఛాయలు… ‘ఈమె గుర్తుందా’ అని ప్రశ్న… చాలామంది గుర్తుపట్టి నెగెటివ్ కామెంట్లతో తిట్టిపోశారు, సరే, అది వేరే కథ…
అది చూశాక మెదిలిన ప్రశ్న ఒకటే… ఆమె జెండర్ ఈక్వాలిటీ, ఫెమినిజం, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్, సోషల్ ప్రొటెస్ట్, ఇతరత్రా ఏవేవే పేర్లతో బోలెడు వికృత చేష్టలు, ప్రదర్శనలు చేసింది కదా… కోర్టుల్లో కేసులు, కోట్లాది మంది మనోభావాలకు గాయాలు, ఆమె ఇంటిపై దాడి, కొలువు పీకేసిన ఉద్యోగసంస్థ, సమాజం బహిష్కరణ…
Ads
బహుశా ఇలాంటి కేరక్టర్ మరొకరు కనిపించరేమో… మరి ఇవన్నీ జరిగాక కూడా ఇప్పుడు ఆమె ఏం చేస్తోంది..? అదీ మెదిలిన ప్రశ్న… ఆమె పేరు చెప్పలేదు కదూ… రెహనా ఫాతిమా… కేరళ… గతంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి…
విశృంఖలత… ఈ పదానికి అర్థం ఆమే… మచ్చుకు కొన్ని చెప్పుకుందాం… పేరుకు ఆమె మోడల్, బాడీ ఆర్టిస్టు, సోషల్ యాక్టివిస్టు, నటి… అనేకం…

1) 2018లో అయ్యప్ప భక్తురాలి వేషంలో ఇరుముడి పేరిట ఏవేవో నిషిద్ధాలను నెత్తిన పెట్టుకుని శబరిమల ప్రవేశానికి ప్రయత్నించింది… హిందూ వ్యతిరేక సీపీఎం ప్రభుత్వం ఆమెకు పోలీసు బందోబస్తును ఇచ్చింది… కానీ హిందూ భక్తగణం అడ్డుకోవడంతో ఆమె ప్రయత్నం సఫలం కాలేదు, కానీ ఆమె కోరుకున్న పబ్లిసిటీ వచ్చేసింది… ఆమె ఇంటిపై దాడి కూడా జరిగింది…
ఫలితం… ఆమెపై మత మనోభావాలను దెబ్బతీసినందుకు (IPC సెక్షన్ 295A) కేసు నమోదైంది, అరెస్ట్ కూడా చేశారు… తరువాత బెయిల్…

2) అర్ధ నగ్న దేహంపై బాడీ పెయింటింగ్ వీడియో…: 2020లో, ‘శరీరం గురించి లైంగికంగా కాకుండా, కళగా పిల్లలకు నేర్పాలి’ అనే ఉద్దేశంతో, తన శరీర పైభాగాన నగ్నంగా ఉండి, తన పిల్లల చేత పెయింటింగ్ చేయించుకున్న వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది…
పర్యవసానం… ఈ చర్య పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు కావడానికి దారితీసింది… ఆమె ముందస్తు బెయిల్‌కు ప్రయత్నించినప్పటికీ దొరకలేదు, సుప్రీంకోర్టు కూడా నిరాకరించడంతో లొంగిపోయి జైలుకు వెళ్లింది…
3) కిస్ ఆఫ్ లవ్’ నిరసన (2014)… నైతిక పోలీసుగిరి (Moral Policing)కి వ్యతిరేకంగా కొచ్చిలో జరిగిన ఈ నిరసనలో ఆమె చురుకుగా పాల్గొంది… అదొక పిచ్చి ప్రదర్శన…
4) పులి కాళి (Puli Kali) ప్రదర్శన… సాధారణంగా మగవారు మాత్రమే పాల్గొనే కేరళలోని ‘పులి కాళి’ నృత్యంలో పులి వేషంలో పాల్గొని లింగ వివక్షను సవాలు చేసింది… జెండర్ ఈక్వాలిటీ పోరాటరూపం అట…
5) పుచ్చకాయల ప్రదర్శన… మహిళల వక్షోజాలను ఉద్దేశిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఒక ప్రొఫెసర్‌కు నిరసనగా, పుచ్చకాయలతో తన రొమ్ములను కప్పి ఉంచిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నిరసన తెలిపింది…

చాలా ఉన్నాయి… నగ్న, బికినీ ఫోటో షూట్లు, అదేదో సినిమాలోనూ అసభ్య ఫోజులు ఎట్సెట్రా అనేకం… ఆమె వికృతమైన లేదా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యలు తీసుకుందనే విమర్శల నేపథ్యంలో, ఆమె తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొన్నది కూడా…

శబరిమల వివాదం తర్వాత, ఆమె పనిచేస్తున్న బీఎస్ఎన్ఎల్ (BSNL) సంస్థ ఆమెపై అంతర్గత విచారణ జరిపి, ఆమె సోషల్ మీడియా పోస్టులు మత మనోభావాలను దెబ్బతీస్తున్నాయని నిర్ధారించి, ఆమెను కంపల్సరీ రిటైర్మెంట్ (Compulsory Retirement)పై ఇంటికి పంపింది…
మత మనోభావాలను దెబ్బతీయడం (IPC 295A), పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదయ్యాయి… ఈ కేసుల వల్ల ఆమె జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది…
కేరళ ముస్లిం జమాయత్ కౌన్సిల్ (Kerala Muslim Jama’ath Council) ఆమెను, ఆమె కుటుంబాన్ని ముస్లిం సమాజం నుండి బహిష్కరించింది (Expelled from the Muslim community)…

అదే టెంపర్‌మెంట్, అదే ధోరణి… హైందవంపై ఆ స్థాయిలో ఆమె దాడి చేసినా… చివరకు ఏం జరిగింది..? ఏమీ కాలేదు… ఇన్ని దెబ్బలు తగిలినా ఆమె అదృశ్యం కాలేదు… దీనికి కారణాలు ఆమె నిలకడ (Resilience), ఆధునిక సోషల్ మీడియా వేదికల శక్తి…
-
యూట్యూబ్ ఛానెల్…: రెహానా ఫాతిమా ప్రస్తుతం ‘Rehana Fathima Official’ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతున్నది… దీనికి లక్షకు పైగా సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు…
-
కంటెంట్ (విషయం)…: ఆమె తన ఛానెల్‌లో ఆర్ట్, టూర్ బ్లాగులు, కుకరీ షోలు, ఫ్యాషన్ ఫోటోషూట్‌లు (ముఖ్యంగా బికినీ షూట్‌లు), అలాగే తన కార్యకలాపాలు, సామాజిక సమస్యలపై చర్చలను ప్రచురిస్తూ ఉంటుంది…

ఫెమినిజం vs రెచ్చగొట్టే చర్యలు
రెహానా ఫాతిమా కథ వాక్ స్వాతంత్య్రం సరిహద్దులు, సామాజిక నిరసన పద్ధతులపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతుంది…
-
కొంతమంది ఆమెను ధైర్యవంతురాలైన కార్యకర్తగా, మగవారి ఆధిపత్యం ఉన్న వ్యవస్థలను సవాలు చేస్తున్న వ్యక్తిగా చూస్తారేమో కానీ… ఆమె చర్యలను విపరీతమైన, ప్రజాదరణ కోసం చేసే (Gimmicky), ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యలుగా (Deliberate Provocation)నే చాలామంది చూస్తారు, అవి లింగ సమానత్వం అనే ప్రధాన అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శిస్తారు…

Share this Article