మొత్తం 19 మంది… అందులో 10 మందీ లేడీ కంటెస్టెంట్లే… ఒకరు ఎక్కువో తక్కువో నిష్పత్తి సరిగ్గా మెయింటెయిన్ చేశారు అనుకుందాం… కానీ ఇప్పుడు ఏం జరిగింది… ఏడు వారాలు గడిచేసరికి, సగం షో పూర్తయ్యేసరికి… ఏడుగురు ఎలిమినేట్ అయిపోతే అందులో ఆరుగురు ఆడ లేడీసే… ఫటాఫట్ వికెట్లు పడిపోయాయి… జస్ట్, ఒకటే మగ వికెట్ పడిపోయింది… ఒక్కసారి ఆ హౌజు వైపు చూస్తే ఇప్పుడు ఎనిమిది మంది మగపురుషులు… నలుగురు స్త్రీలు… అరేయ్, ఏంట్రా ఇది..? బయట యూట్యూబ్ ప్రోగ్రాముల్లో పచ్చి బూతులతో అదరగొట్టే సరయు మొదట్లోనే ఔట్… అలాగే నోరు పారేసుకున్న ఉమాదేవి ఔట్… బూతులు కావు గానీ ఓ వైల్డ్ కేరక్టర్ శ్వేత ఔట్… ఒర్లుడు, పీకుడు, మగాడు, చెంపపగులుద్ది భాషలో బాగా వ్యతిరేకత తెచ్చుకున్న ప్రియ ఔట్… పాపం, షోలో ఉండాల్సిన లహరి, హమీదాలను కూడా అనవసరంగా బయటికి పంపించేశారు…
మిగిలిన ఆడ లేడీస్లో యానీ మాస్టర్ పర్లేదు… కాజల్ తెలివైన ప్లేయర్… ప్రియాంక సోసో… సిరి ఎంతసేపూ ఆ షణ్ముఖ్, జెస్సీ మాయలో పడి ఆట మరిచిపోతోంది… నిజానికి వీళ్లే కాస్త బెటర్… మగ పురుషులే హోప్లెస్… షణ్ముఖ్ ఫిట్ ఫర్ నథింగ్… ఐనా సరే, నాగార్జున, బిగ్బాస్ టీం దండె కొడుతోంది… అంటే, అనవసరంగా మొగ్గు కనబరుస్తున్నారు… బయటి నుంచి వోట్లూ బాగానే పడుతున్నయ్… ఇదేం కథో అర్థం కాదు… అందరూ ఆ మేక గడ్డాలు పెంచేసుకుని, కడుపులో చల్లకదలని మర్యాద రామన్నలు… కాస్తోకూస్తో రవి, సన్నీ నయం… అసలు గత సీజన్లాగా లవ్ ట్రాకుల్లేవు, కనీసం ఒక్క త్రికోణ ప్రేమకథ కూడా లేదు… కాస్త అక్కరకొచ్చే వాళ్లను బయటికి గెంటేశారు… ఇప్పుడిక 8ః4 నిష్పత్తితో అసలు మజా ఏముంది..? ఆ పిచ్చి టాస్కులతో థ్రిల్లేముంది..? అసలు ఈసారి సీజన్ మొదట్లో కంటెస్టెంట్ల ఎంపిక దగ్గరే దారితప్పింది… అది ఇప్పటికీ సెట్ కాలేదు…
Ads
రేటింగులు చూస్తే ఘోరం… ఈ స్థితిలో ఇక ఈ షోను మళ్లీ కాస్త పైకి లేపాలంటే ఇప్పుడున్న కంటెస్టెంట్లతో ఏ ఉపయోగమూ లేదు… అలాగని పోయిన వాళ్లకు రీఎంట్రీ కూడా వేస్ట్.., చేస్తే గీస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీలే బెటర్… అదీ మాంచి తకడా కేరక్టర్లు కావాలి… ఈ మగపురుషుల్ని ఓ ఆట ఆడించగల లేడీ కేరక్టరయితే బెటర్… ఎందుకో బిగ్బాస్ టీంకు ఆ సోయి కూడా లేనట్టుంది… వెళ్లిపోయే కంటెస్టెంట్లు హౌజులో ఉన్నవాళ్లపై బాంబులు వేసే ఫార్ములాను ఎత్తిపారేశారు… అసలు హౌజులో ఎమోషన్సే లేవు… ఏదో తింటున్నారు, పడుకుంటున్నారు, గొంగళిపురుగుల్లా అక్కడక్కడే పాకుతూ, దేకుతూ సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం… గత సీజన్లలో కనీసం సినిమా ప్రమోషన్ టీమ్స్ హౌజులోకి వచ్చి సందడి చేసేవి… కరోనా ప్రికాషన్స్ వల్ల ఇప్పుడు అదీ అవాయిడ్ చేస్తున్నారు… దీంతో ఏదో షో నడిపిస్తున్నారంటే నడిపిస్తున్నారు… అంతే…!!
Share this Article