.
( గోపు విజయకుమార్ రెడ్డి
) …… నో డౌట్… నిస్సందేహంగా… మన దేశంలో అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్…
ఇక్కడ విలువైన అంటే… డబ్బు కోణంలో మాత్రమే కాదు… విశ్వసనీయత, నిజాయితీ, సమాజహితం వంటి విలువలు కూడా… దశాబ్దాలుగా… అదే వాల్యూ… అదే యూనిక్ కేరక్టర్… దటీజ్ అమితాబ్…
Ads
అమితాబ్ బచ్చన్ 83 ఏండ్ల వయసులో కూడా భారతీయ బ్రాండ్లకు ఓ నమ్మకం…
మీరు ఒక కంపెనీ ఓనరో లేదా బ్రాండ్ మేనేజర్ అనుకొండి… మీకో నమ్మకమైన బ్రాండ్ అంబాసిడర్ కావాలి… అతను చెప్పితే దేశం అంతా నమ్మాలి… వెంటనే స్ఫురించే పేరు అమితాబ్… అంటే అతనికి ఎంత క్రెడిబులిటీ ఉండాలి..?
ఈ వయసులో కూడా ఇప్పటికీ కంపెనీల బ్రాండ్స్ కి అతనే ఫస్టు ఛాయిస్… మనందరికి అమితాబ్ భారత దేశపు మొట్టమొదటి సూపర్ స్టార్ అని తెలుసు కానీ, ఇప్పడతను అన్ని బ్రాండ్లకి అత్యంత కావలసిన వ్యక్తి,..
ఏబీసీల్ కార్పొరేషన్ ద్వారా ఇండియాలో మొట్టమొదటి ప్రపంచ అందగత్తెల పోటీలు నిర్వహించి… డబ్బులు, పేరు, ఆస్తులు అన్నీ పోగొట్టుకొని… ఇక జీవితం మీదే ఆశలు వదిలేసుకొని, ఎన్నడూ ఎవ్వరినీ చెయ్యి చాచి ఒక సహాయం అడగని స్థితి నుంచి… యాష్ చోప్రా (యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ) కి ఫోన్ చేసి, యాష్ జీ “మేరేకు కర్నేకేలియే కుచ్ కామ్ చాహియే” అని అడుక్కోవడం… అంతే హుందాగా యాష్ చోప్రా కూడా మొహాబితిన్ సినిమాలో ఒక ప్రిన్సిపుల్ రోల్ ఆఫర్ చెయ్యడం… అమితాబ్ ఉజ్వలమైన సెకండ్ ఇన్నింగ్స్ కి పునాది…
ప్రస్తుత రోజుల్లో వేల కోట్ల మేర బ్యాంకులకి, పబ్లిక్ కి టోపీలు పెట్టి, IP లు పెట్టి దేశదేశాలు తప్పించుకొని తిరుగుతున్న సో కాల్డ్ ఫ్రాడ్ బిజినెస్ మెన్లకి అమితాబ్ జీవితం ఒక టెక్స్ట్ బుక్… ఓ ఇన్‌స్పిరేషనల్ లెసన్…
తరువాత KBC తో మళ్ళీ పాత సూపర్ స్టార్ ఫామ్ లోకి రావడం మరో సమాంతర కథ… (ఇప్పటికి దాదాపు 17 సీజన్ల తరువాత కూడా అమితాబే హోస్ట్… మధ్యలో షారుఖ్ వచ్చినా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యలేకపోయాడు )
సీజన్ 3 కి షారుఖ్ ఖాన్ హోస్ట్ చేస్తే రేటింగ్స్ రాక … దాదాపు 4 సంవత్సరాలు ఆ షోకు బ్రేక్… అమితాబ్ వస్తేనే మళ్లీ గాడిన పడింది… స్టార్ ప్లస్ నుంచి సోనీకి మారినా షో హోస్ట్ మాత్రం అమితాబే… తను లేక కేబీసీ లేదు… అదీ అతని క్రెడిబులిటీ అండ్ మెరిట్…
- చిల్లి గవ్వ లేని స్థితి నుంచి ఇవ్వాళ అతని నెట్ వర్త్ దాదాపు 2500 కోట్లు, అలాగే లాస్ట్ FY ఇయర్లో 350 కోట్ల సంపాదనతో వన్ అఫ్ ది హైయెస్ట్ ఇండివిడ్యుయల్ టాక్స్ పేయర్ ఇన్ ది కంట్రీ… ఈ స్టేటస్ మెయింటైన్ చెయ్యడం మాములు విషయం కాదు, ఈ వయసులో కూడా ఒక అడ్వర్టయిజ్‌మెంట్‌కు దాదాపు 8 కోట్లు ఛార్జ్ చేస్తాడు అంటే అమితాబ్ అంటే బ్రాండ్లకి ఎంత నమ్మకమో చూడండి…
(అమితాబ్ కంటే ఎక్కువ ఛార్జ్ చేసే సెలబ్రిటీలు ఈ దేశంలో ఒక్కరో ఇద్దరో ఉంటారు… షారుక్ అండ్ కోహ్లీ )
- ఇప్పటి దాాాకా దాదాపు 35 బ్రాండ్స్ కి advertisments చేసిన బచ్చన్ సాబ్ మొత్తం కెరీర్ లో ఒక చిన్న మచ్చ పాన్ మసాలా యాడ్స్ చెయ్యడం (గుట్కా సరోగేట్ యాడ్స్)…, కానీ తన తప్పు తెలుసుకొని మధ్యలోనే అగ్రిమెంట్ కాన్సిల్ చేసుకొని, తన రెమ్యూనరేషన్ మొత్తం వాపస్ చేసి, ఇంకా తన నేమ్ వాడుకోవద్దని కోర్ట్‌కెక్కిన మొట్టమొదటి సెలబ్రిటీ కూడా మన అమితాబే…
ఇప్పుడు ప్రతి ఒక సూపర్ స్టార్ (మన మహేష్ బాబుతో సహా ) షారూక్, అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, నిన్న మొన్న వచ్చిన విక్కీ కౌశల్, టైగర్ ష్రాఫ్ తో సహా అందరూ ప్రమోట్ చేస్తూనే ఉన్నారు ఈ యాడ్స్…
( పాన్ మసాలా వాళ్ళు మార్కెట్ రేట్ కంటే 3- 4 రెట్లు ఎక్కువ డబ్బులు ఇస్తారు, ఉదాహరణకి మీరు ఒక యాడ్ కి 5 కోట్లు ఛార్జ్ చేస్తే, అదే పాన్ మసాలా క్లయింట్ 15- 20కోట్లు ఇస్తాడు. అందుకే ఏ స్టార్ కూడా ఈ అవకాశాన్ని వదులుకోడు… ఒక్కరోజు కాల్ షీట్ 8 గంటలు కేటాయిస్తే కోట్లకి కోట్లు వస్తాయి… అలాంటిది అమితాబ్ స్వచ్ఛందంగా కాంట్రాక్టు వదులుకోవడం నిజంగా గ్రేట్… అందుకే అందరు అమితాబ్ లు కాలేరు…
- రోజుకో ట్రెండు మారే advertising రంగంలో రెండు దశాబ్దాలకి పైగా ఒక నమ్మకం, నిజాయితీ, పెద్దరికంతో, ఒక కల్చరల్ ఐడెంటిటీతో పాటు… మార్కెటర్స్ డ్రీం ఐకాన్ గా నిలబడటం నీకే చెల్లింది బచ్చన్ సాబ్… నమ్మకం, నాణ్యత, నీతి, నిజాయితీకి ఒకరోజు ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు సార్….
మచ్చుకి కొన్ని అమితాబ్ యాడ్స్ మీకోసం
Share this Article