.
గుంటూరు
: కన్నప్ప సినిమా పై బ్రహ్మణ చైతన్య వేదిక పోరాట విజయం…
కన్నప్ప సినిమా సెన్సార్ కు అడ్డంకులు.. 13 సీన్లు పై అభ్యంతరం వ్యక్తం చేసిన 11 మంది సభ్యుల కమిటీ…
Ads
అభ్యంతరకర సీన్లు తొలగించి మరల ప్రివ్యూ ఇవ్వాలన్న కమిటీ…
13 సీన్లు తొలగింపు తర్వాతే కన్నప్ప సినిమాకు సెన్సార్ అనుమతి…
సెన్సార్ బోర్డుకు కృతజ్ఞతలు తెలిపిన బ్రహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ…
…….. ఇదీ వాట్సపు న్యూస్ గ్రూపుల్లో కనిపించిన ఓ వార్త… ఇంట్రస్టింగు… ఎందుకంటే..?
మంచు మోహన్‌బాబు, మంచు విష్ణుకు విపరీతమైన ధీమా… మేం ఏం చేసినా, ఏ సినిమా తీసినా, ఎవరిని వెక్కిరించినా, ఏం గేలి చేసినా… మమ్మల్ని ఎవడు ఆపేది అనే ధీమా…
గతంలో జిన్నా పేరిట ఓ సినిమా రిలీజ్ చేశారు, అసలు జిన్నా ఎవడో, వాడి నేపథ్యం ఏమిటో తెలుసా ఈ అద్భుత సినిమా క్రియేటర్లకు… అంతకుముందు ఏదో సినిమాలో బ్రాహ్మణులను కించపరిచారని తెలంగాణ బ్రాహ్మణ సంఘాలు పోరాడాయి…
మోహన్‌బాబు గురించి తెలిసిందే కదా… టీవీ9 రిపోర్టర్ కమ్ కెమెరామన్‌తో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లేదాకా కొట్టాడు… తనంతే…
కానీ ఈసారి పిలక, గిలక అంటూ ఓ సామాజిక వర్గాన్ని కించపరిచే సీన్లు పెట్టిన కన్పప్పపై కాస్త ధాటిగానే పోరాడింది బ్రాహ్మణ సమాజం… దాని ఫలితమే ప్రస్తుతం ఈ సెన్సార్ ఆంక్షలు, పరిమితులు, ఆదేశాలు గట్రా…
గుడ్… ఎవడైనా సరే, సమాజం పట్ల, సామాజిక వర్గాల పట్ల, ఆ మనోభావాల పట్ల కాస్త గౌరవం, కాస్త మర్యాద చూపించాలి… ఎస్, క్రియేటివ్ ఫ్రీడం వేరు, సోషల్ రెస్పాన్సిబులిటీ వేరు, అన్నింటికీ మంచి హుందాతనం, సంస్కారం, మర్యాద, మన్నన వేరు…
అఫ్‌కోర్స్, చంద్రబాబు మా బంధువే, జగన్ ఇంకాస్త దగ్గర బంధువే అనే ధీమా ఉంటే ఇకపై చెల్లదేమో… అన్నింటికీ మించి ఏ శ్రీధర్ బాబో తెలంగాణలో అడ్డుపుల్ల వేస్తే అసలు ఆ సినిమా రిలీజ్ కావడమే కష్టమేమో… కాకపోతే ఆ శ్రీధర్ బాబుకు ఇంకా పట్టినట్టు లేదు…
ఆ మంథని బ్రాహ్మణులు అంత త్వరగా అర్థం కారు… అవునూ, దిల్ రాజు గారూ, మీరేమంటారు..? ఈ సినిమాలో బ్రాహ్మణ వ్యతిరేక సీన్లు మీకు వోకేనా..? కప్పదాటు వైఖరి వద్దు, ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పెబ్బ మీరు… సూటిగా చెప్పాలి, మోహన్‌బాబు అంటే భయపడనక్కర్లేదు… తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏమిటి..?!
Share this Article