Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ ‘సీతాకోకచిలుక’ చాన్నాళ్ల తరువాత మళ్లీ తెరపై… అదే నవ్వుతో…

April 9, 2026 by M S R

.

సీతాకోకచిలుక సినిమాలో ఓ పాట గుర్తుందా… మాటేమంత్రమూ… అసలే భారతీరాజా కదా… బాలప్రేమికులను అడవిలో బరిబాతల పడుకోబెట్టి, అసభ్యంగా కనిపించకుండా కీలక దేహభాగాలపై పూలు కప్పి చూపిస్తాడు… అప్పట్లో ఆ సీన్ భలే హిట్… 1981 నాటి సినిమా… 40 ఏళ్ల క్రితం సినిమా…

సరే, ఇప్పుడంటే మరీ ఈ బడి ప్రేమికుల కథను చూపిస్తే సోషల్ మీడియా ఆ దర్శకుడితో ఆడుకునేదేమో… కానీ అప్పట్లో ఆ సినిమాలు పాటలు సంచలనం… అంత బాగా చిత్రీకరించడం ఒకెత్తు… పైగా స్మిత ఉండనే ఉందాయె… ఏదో షోలో ఆలీ చెబుతున్నాడు… అప్పుడు తనకు 4 ఏళ్లట… కథానాయిక ముచ్చర్ల అరుణకు మరీ పదకొండేళ్లేనట… (వెస్ట్ గోదావరికి చెందిన కుటుంబంలో కొత్తగూడెంలో పుట్టింది, చెన్నై- హైదరాబాదుల్లో పెరిగింది)…

Ads

సినిమావాళ్లు మరీ అంత అందంగా ఏమీ ఉండరు, అలా చూపించబడతారు, అంతే… ఈ మాట చాలామంది అంటారు… టీన్స్ కూడా రాని ఓ అమ్మాయిని మరీ అలా చూపించడం ఎలా ఉన్నా… అరుణ దాంతో చాలా బిజీ ఆర్టిస్టు అయిపోయింది… తన ఛాయ తనకు తెలుసు… ఇండస్ట్రీలో ఛాయ తక్కువ అమ్మాయిలకు దొరికే చాన్సుల పరిమితులు కూడా తెలుసు… అందుకని హీరోయిన్ల పాత్రలే కాదు, అన్నీ అంగీకరించింది, చేసింది… ఎక్స్‌పోజింగు గట్రా గాకుండా హోమ్లీ పాత్రలే ప్రధానంగా…

మహా అంటే పదేళ్ల కెరీర్ ఆమెది… 80 సినిమాలు… సౌత్ నాలుగు భాషల్లోనూ… కన్నడం మరీ తక్కువ… నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మా అనే పాట మీద కూడా ఆమెపైనే ఆ సీతాకోకచిలుక సినిమాలో… అంత అందంగా చూపించాడు దర్శకుడు… ఐతే చాలామంది సినిమాలు మానేయగానో లావు అయిపోవడం చూస్తుంటాం కదా… దేహంపై శ్రద్ధ తగ్గిపోతుంది…

కానీ నలుగురు ఆడపిల్లల్ని (మగ వారసుడి కోసం ప్రయాస కావచ్చు బహుశా) కన్నాక, ఇన్నేళ్లయ్యాక కూడా అరుణ ఫిట్‌గా కనిపిస్తుంది… హలో గుడ్ మార్నింగ్ యా అని ఓ డిఫరెంట్ స్లాంగ్ ఇంగ్లిషులో బోలెడు వంటల వీడియోలతో సోషల్ మీడియాలో పలకరిస్తూ ఉంటుంది… సరదాగా నవ్వుతూ, ఛలాకీగా…

అరుణ

ఇప్పుడు ఎందుకు ఇదంతా గుర్తొచ్చిందీ అంటే… స్టార్‌మా చానెల్ కావచ్చు, కుక్కూ జాతిరత్నాలు అని ఓ సరదా షోకు జడ్జిగా వచ్చింది… కాకపోతే ఆమె ఛామనఛాయే మరింత ఎక్కువగా కనిపిస్తోంది… (అది పేరుకే వంటల షో… కానీ ఆ పేరుతో వంటల్ని, వంటల పోటీల్ని అపహాస్యం చేసే షో)… ఫస్ట్ సీజన్ సక్సెసైంది అంటూ సెకండ్ సీజన్ స్టార్ట్ చేశారు రీసెంటుగా… కాకపోతే ఈసారి ప్రదీప్ స్పాంటేనిటీ, హోస్టింగ్ అదనపు ఆకర్షణ)…

https://www.facebook.com/reel/799165406578504

ఆమె విదేశాల్లో ఎక్కడో ఉంటుందేమో… కానీ రెగ్యులర్‌గా కొన్ని వారాలపాటు జడ్జిగా చేయగలదా..? డేట్స్, టైమ్ అడ్జస్ట్ అవుతుందానేది పక్కన పెడితే… చాలామంది పాత తారలు టీవీ షోలతో రీ ఎంట్రీ ఇచ్చి, మళ్లీ జనంలోకి వచ్చి, పాపులారిటీని ఎంజాయ్ చేయడం చూస్తున్నదే కదా… ఇంద్రజ, సదా, శ్రీదేవి, పూర్ణ ఎట్సెట్రా… కొందరేమో అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు టీవీ షోలలో ఇమడలేక..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ ‘సీతాకోకచిలుక’ చాన్నాళ్ల తరువాత మళ్లీ తెరపై… అదే నవ్వుతో…
  • లెఫ్ట్, రైట్, సెంట్రల్, రీజనల్… ప్రతి పార్టీ నాదే… లాటరీ మార్టిన్ కథ…
  • భార్య… అల్లుడు… కొడుకు… మరి ‘లాటరీ మామ గారా… మజాకా…’
  • ఈ అభ్యర్థి దగ్గర 19 కిలోల బంగారం… 13 కిలోల వెండి… ఎవరీమె..?
  • విజయ్ పార్టీకి రథసారథి… తను తమిళ ప్రశాంత్ కిషోర్… కింగ్ మేకర్…
  • మహానగరంలో మాయగాడు… 39 ఏళ్లుగా మిస్టరీ వీడని ‘నగల చోరీ’…
  • అసలు సినిమా కథకన్నా… కోట- బాబూమోహన్ కామెడీయే హైలైట్…
  • కేసీయార్ గడీలోకి జీవన్‌రెడ్డి..!? ఓ మానసిక విశ్లేషణ ఇదుగో..!!
  • ఎరుపు లోలాకు కులికెను కులికెను… ఆమె గుర్తుందా మీకు..?!
  • ఆ పాట చరణాల సొగసు చూడతరమా…? వేటూరి మేథోమథనం కథ..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions