తెలంగాణలో కాస్త తక్కువే… ఏపీలో బురద, వరద రాజకీయం పెచ్చరిల్లింది… వైరివర్గాలుగా బరిలోకి దిగిన మీడియా కంపు కంపు చేస్తోంది వరద బురదలాగే..! (బురద రాజకీయాలు చేయబోయిన బీఆర్ఎస్ టీమ్‌కు ఖమ్మంలో స్థానికులు, కాంగ్రెస్ కేడర్ తిరగబడటంతో తలబొప్పి కట్టింది… అధికారంలో ఉన్నప్పుడు వందల కోట్లు దోచుకుని, ఖమ్మం మొత్తం కబ్జా చేసి ఇప్పుడు రాజకీయం చేయడానికి వచ్చారా అంటూ రాళ్ల దాడి చేశారు… ఇది రాసింది నమస్తే సాక్షి…)
నిజానికి ప్రకృతి విపత్తులు, ప్రమాదాల సందర్భాల్లో చంద్రబాబు వేగం, చొరవ, సమీక్షలు, పనితీరు బాగుంటాయని పేరు… గతంలో ఒడిశా వరదల దగ్గర్నుంచి విశాఖ హుద్‌హుద్ తుఫాన్ దాకా చూశాం, సరే, కొంత తన మీడియా ఓవర్ పబ్లిసిటీ ఉన్నా సరే… తను రంగంలోకి దిగుతాడు, ఇంట్లో పడుకోడు… అదొక సుగుణం…
ఐతే ఈసారి చంద్రబాబు అంతగా సక్సెస్ అయినట్టు కనిపించడం లేదు… ఇది సాక్షి అభిప్రాయం కాదు, బాబు గారి మౌత్ పీస్ ఆంధ్రజ్యోతిలో కూడా కొన్ని కథనాలు అదే చెబుతున్నాయి… ప్రభుత్వ శాఖల నడుమ సమన్వయం లేదు, వేగం లేదు, సహాయక సామగ్రి ఉన్నా పంచేవాడు లేడంటూ అధికారులపై, మంత్రులపై చంద్రబాబే కసురుకుంటున్నాడు…
Ads
ఆకలి కేకలు, ఆక్రోశం, బాధితుల ఆగ్రహం కనిపిస్తూనే ఉన్నాయి… ఒక్కడే తెగ తిరుగుతున్నాడు… డ్రోన్లు ఆహారం అందిస్తున్నాయి… ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ తిరుగుతున్నాయి… తనే ఓ పొక్లెయిన్‌లో కిలోమీటర్ల కొద్దీ తిరుగుతూ అధికార యంత్రాంగాన్ని నడిపించడానికి, బాధితులకు సాయం చేరడానికి విశ్వప్రయత్నమైతే చేశాడు గానీ… ఎక్కడికక్కడ లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి… చంద్రబాబు ఆపద్బాంధవుడు, ఆపన్నహస్తం అంటూ ఈనాడు ఎంతగా జోకుతున్నా సరే… ఆంధ్రజ్యోతి కథనాలు ఫీల్డ్ రియాలిటీని పట్టిస్తున్నాయి…
ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎలా స్పందించాలో అధికార గణానికి ప్రిపేర్డ్‌నెస్ అవసరం… కానీ బుడమేరు ఉధృతిని ఊహించలేదు కదా, ఎవరూ సన్నద్ధంగా లేరు… తీరా సమయానికి స్పందించి, వేగంగా సహాయక చర్యల్లోకి దిగే ఉన్నతాధికారులే లేకుండా పోయారు… పవన్ కల్యాణ్ జాడ లేదు… ఇతర మంత్రులు కూడా పెద్దగా సహాయక చర్యల్లో కనిపించడం లేదు, ఒకటీరెండుచోట్ల అచ్చెన్నాయుడు, లోకేష్ తప్ప…
బురద ఎత్తిపోసుకోవడంలో… నువ్వు థూ అంటే నువ్వు థూ అని ఎత్తిపొడుచుకోవడానికి మాత్రం అధికార, ప్రతిపక్షాలు కత్తులు దూస్తున్నాయి… కావాలనే ప్రకాశం బ్యారేజీ గేట్లకు వైసీపీ వాళ్లే పడవల్ని అడ్డం వేశారని చంద్రబాబు సందేహం… గట్లు తెంపి కృత్రిమంగా జనానికి ప్రమాదం తీసుకొస్తారనే భయంతో పోలీసులను గట్ల మీద కాపలా పెడుతున్నానని తనే చెబుతున్నాడు… తన అసహనమంతా జగన్ మీద చూపిస్తున్నాడు…
‘చాపర్‌లో అయిదు నిమిషాలు షో చేసి వెళ్లిపోయాడు జగన్… ఒక్క అన్నం పొట్లమైనా పంచాడా’ అని కస్సుమంటున్నాడు… అసలు బుడమేరు పాపమంతా జగన్ గత ప్రభుత్వానిదే అని అధికార కూటమి ఆడిపోసుకుంటోంది… మరోవైపు సాక్షి మీడియా గ్రౌండ్ రిపోర్ట్ పేరిట చంద్రబాబూ అట్టర్ ఫ్లాప్ అని ప్రచారానికి దిగింది… ఏమిటయ్యా అంటే, మృతుల సంఖ్యను సర్కారు దాచిపెడుతోందట, బయటపడుతున్నా అంతిమ సంస్కారాలు లేవట… చంద్రబాబు ప్రచారాస్త్రం జగన్ ఆపన్నహస్తం అని ఇప్పుడు భజనలు, కీర్తనలు దేనికో దానికే తెలియాలి…
రిటెయినింగ్ వాల్ కట్టడం వల్లే విజయవాడ విధ్వంసం నుంచి తప్పించుకుందని సూత్రీకరణలు… పనిలోపనిగా అమరావతి రాజధానిగా అస్సలు పనికిరాదని మరోసారి తేలిపోయిందంటూ తీర్పులు… ఇంకా ఇప్పుడు స్టార్టవుతాయి… ఈ వరదలు ఎలా మానవతప్పిదాలో రకరకాల విశ్లేషణలు, కథనాలు మీడియాలో కనిపిస్తాయి… నాలుగు రోజులకు మరో అంశం మీదకు డైవర్షన్… రాజకీయ నాయకులు కొత్త బురదను ఎత్తిపోసుకోవడానికి రెడీ అయిపోతారు…!!
Share this Article