Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ముద్దాయిల సంస్కరణ సగటు తెలుగు సినిమా తీసినంత వీజీయా…!!

October 18, 2025 by M S R

.

Subramanyam Dogiparthi.... సినీ జగత్తులో కొన్ని made for each other కాంబినేషన్లు ఉంటాయి . అవి హీరో హీరోయిన్లు కావచ్చు , హీరో నిర్మాతలు కావచ్చు , హీరో దర్శకులు కావచ్చు . అలాంటి వాటిల్లో కృష్ణ కె. యస్. ఆర్. దాస్ కాంబినేషన్ ఒకటి .

కృష్ణ హీరోగా దాస్ సుమారు 30 సినిమాలకు దర్శకత్వం వహించారు . వాటిల్లో ఒకటి 1987 లో వచ్చిన ఈ ముద్దాయి . 26 కేంద్రాలలో వంద రోజుల పోస్టర్ పడింది . శత దినోత్సవ వేడుకలు మద్రాసులో జరిగాయి .

Ads

కన్నడంలో బాగా ఆడని జిమ్మీ గల్లు అనే సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . కన్నడంలో విష్ణువర్ధన్ , శ్రీప్రియ , హేమా చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు . కన్నడ సినిమాకు కృష్ణకు , తెలుగు నేటివిటీకి అనుకూలంగా మార్పులు చేసారు పరుచూరి బ్రదర్స్ .

తెలుగులో సక్సెస్ అయ్యాక దాస్ గారి దర్శకత్వంలో కృష్ణే హిందీలో రీమేక్ చేసారు . హిందీలో జితేంద్ర , శతృఘ్న సిన్హా , హేమమాలిని , అమృతా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు .

1+2 కధే . అయితే ఒకరి తర్వాత ఒకరు తెర మీదకు వస్తారు . పోలీస్ ఇనస్పెక్టర్ , లాయర్ అయిన బావామరదళ్ళు వృత్తి రీత్యా కీచులాడుకుంటూ ఉంటారు . ఆ క్రమంలో ఎంత కరుడుగట్టిన నేరస్తుడిని అయినా సంస్కరించవచ్చు అని మరదలు అంటే బావ అసాధ్యం అనటం , ఆ సవాలుని తీసుకుని నిశ్చయ తాంబూలాలను కూడా వాయిదా వేసుకుంటారు .

జైలర్ సహకారంతో జైల్లో ఉన్న కరడుగట్టిన ఒక నేరస్తుడిని తన ప్రయోగానికి తీసుకుని హీరోయిన్ లాయర్ సక్సెస్ కావటమే ఈ సినిమా కధ . ఈ క్రమంలో లాయర్ నేరస్తుడిని లవ్వాడటం కూడా జరిగిపోతుంది . పందెం కాసిన బావకు ఉత్త విస్తరి మిగులుతుంది .

కరడుగట్టిన నేరస్తుడిగా కృష్ణ బాగా నటించారు . ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండే . ఇద్దరు హీరోయిన్లుగా రాధ , విజయశాంతి చెరో రెండు డ్యూయెట్లతో ప్రేక్షకులకు సందడి చేస్తారు . ఇద్దరూ గ్లామర్ స్పేసుని బ్రహ్మాండంగా ఫిల్ చేసారు . జైలరుగా ఊర్వశి శారదకు కూడా ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . బాగా నటించింది .

విలనుగా కన్నడ ప్రభాకర్ , తోటి విలనుగా గిరిబాబు , విజయశాంతి ఇనస్పెక్టర్ బావగా శరత్ బాబు , హీరో చెల్లెలుగా ముచ్చెర్ల అరుణ , ఇతర పాత్రల్లో భీమేశ్వరరావు , చిట్టిబాబు , సుత్తి వేలు , మాడా , తదితరులు నటించారు .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి , సిరివెన్నెల సీతారామ శాస్త్రి , జాలాది పాటల్ని వ్రాయగా జేసుదాస్ , రాజ్ సీతారాం , సుశీలమ్మలు పాడారు . (ఇంకా బాలు, కృష్ణ సయోధ్య కుదరలేదు అప్పటికి…) విజయశాంతితో జాజి పూల పందిట్లో , పెట్టు పెట్టు అంటూ రెండు డ్యూయెట్లు బాగుంటాయి . రాధతో ముందు నువ్వు ముందు నువ్వు , చీరాల చిలక చేబ్రోలు పలక అంటూ రెండు డ్యూయెట్లు బాగుంటాయి .

అల్లారుముద్దుగా బంగారు తల్లిగా అంటూ సాగే శారద కూతురి పుట్టిన రోజు పాట కూడా శ్రావ్యంగా ఉంటుంది . దేవాలయాన్నే విడనాడె దైవము అంటూ సాగే పాటను జేసుదాస్ చాలా శ్రావ్యంగా పాడారు . వెరశి పాటలనన్నీ దర్శకుడు బాగా చిత్రీకరించారు . సినిమా సక్సెస్ అవటానికి పాటలు కూడా దోహదపడ్డాయి . పరుచూరి బ్రదర్స్ డైలాగులు ఘట్టిగానే వినిపిస్తాయి .

డాన్సుల్ని అందంగా కంపోజ్ చేసిన సలీంను మెచ్చుకోవలసిందే . సినిమా యూట్యూబులో ఉంది . కృష్ణ అభిమానులు చూడకుండా ఉండరు . ఎవరయినా ఒకరూ అరా ఉంటే చూసేయండి . ఇతరులు కూడా చూడొచ్చు . విజయశాంతి , రాధలు అందంగా కనిపిస్తారు . It’s an action-oriented , feel good , romantic , Krishna-mark movie . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ ధనపిశాచి కనీసం సినిమా థియేటర్ ఖర్చులైనా ఇప్పించేట్టు లేదు..!!
  • అక్కడ శ్రీచరణికి ఘన సత్కారం… ఇక్కడ అరుంధతిరెడ్డికి ఏది మరి..?!
  • ఏదీ పవన్ కల్యాణ్ ఫోటో..? ఏదీ ఆటల మంత్రి ఫోటో..? ఏం యాడ్స్ ఇవి..?!
  • ది గరల్ ఫ్రెండ్..! ఓ టాక్సిక్ లవ్ స్టోరీ… రష్మికను మరో మెట్టు ఎక్కించింది..!!
  • ఇప్పటి నగర ప్రణాళికలన్నా… త్రేతాయుగపు అయోధ్య ఎంతో నయం…
  • నా డెత్ సర్టిఫికెట్ పోయింది… దొరికినవారు దయచేసి సంప్రదించగలరు…
  • బంగారు బల్లి… వెండి బల్లి… కంచిలో వాటి తాపడాలూ మార్చేసేశారు…
  • స్టార్ల సినిమాలు కాదు… ఇదుగో ఇవి కదా రీరిలీజ్ చేయాల్సింది..!!
  • బండి రాకతో జుబ్లీ హిల్స్ ప్రచార చిత్రంలో హఠాత్ మార్పు… ఎలాగంటే..?
  • జుబ్లీ ఇరకాటంలో కేటీయార్..! మాగంటి తల్లి పేల్చిన కొత్త బాంబులు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions