.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి… రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ చూసేది ఈయనే… పుష్ప2 సినిమాలకు అడ్డగోలు రేట్లు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చింది ఈయన నేతృత్వంలోని ఉన్నతాధికారులే…
ఆ బెనిఫిట్ షో కాస్త సంధ్య థియేటర్‌లో ఓ మహిళ మృతికి, ఓ పిల్లాడి చావుబతుకుల దుస్థితికి, అల్లు అర్జున్ అరెస్టుకు, రేవంత్ ఢిల్లీ వివరణకూ, జాతీయ స్థాయి చర్చకూ దారితీసిన సంగతీ తెలిసిందే కదా…
Ads
ఇదే మంత్రి ఏమన్నాడు..? నో, నాటెటాల్, నెవ్వర్… ఇకపై నో బెనిఫిట్ షోస్ అని ఖండితంగా ప్రకటించాడు కదా… తనకు గుర్తుందో లేదో నాకు తెలియదు… ఆ మంత్రిత్వ శాఖ అధికారులకూ గుర్తుండి ఉండకపోవచ్చు మంత్రి భీషణ ప్రకటన…
సరే, విషయం ఏమిటంటే,..? ముఫాసా ది లయన్ కింగ్ అని ఓ సినిమా… ఇంగ్లిషు సినిమా లెండి, రిలీజై చాన్నాళ్లయింది… వాళ్లు ఇండియాలో పలు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు… జస్ట్, ఓ యానిమేటెడ్ పిల్లల సినిమా… కాకపోతే ఆధునాతన టెక్నాలజీతో బొమ్మల సినిమాగా గాకుండా రియల్ సినిమాను తలపించే రీతిలో ఉంటుంది…
సింపుల్‌గా డైలాగులను తెలుగులోకి డబ్ చేసి ఇక్కడా రిలీజ్ చేయబోతున్నారు… అందులో ఓ ప్రధాన పాత్రకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడు… పర్లేదు, డబ్బు వస్తుంది కదా… చేశాడు, గుట్కా సరోగేట్ యాడ్స్ చేసిన మహేష్ బాబు ఈ ‘డబ్బిం’గ్ చెప్పడంలో పెద్ద ఆశ్చర్యం లేదు…
దీనికి సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌లో 20న ఉదయం 8.30 గంటలకు బెనిఫిట్ షో వేస్తారట… ఇక్కడ కూడా ఓ స్టార్ సీనిమా రిలీజ్ తరహాలో ఏర్పాట్లు చేస్తారట… ముఫాసా రెగ్యులర్ వెర్షన్లతో పాటు ఐమాక్స్, త్రీడి, ఫోర్డిఎక్స్ తదితర అన్ని ఫార్మాట్లలో రిలీజ్ కానుంది. స్పెషల్ షో వేసేది మాత్రం నార్మల్ 2డిలోనేనట…
ఇప్పటికే ఈ బెనిఫిట్ షోకు ఫుల్ డిమాండ్ వచ్చేసిందని బోలెడు సైట్లు, యూట్యూబ్ చానెళ్లు వార్తలు గుప్పిస్తున్నాయి… గుడ్, పర్లేదు… మహేష్ బాబు- రాజమౌళి సినిమా రావడానికి ఇంకా కనీసం ఏడాదిన్నర పట్టొచ్చు… ఈలోపు వేరే ఏ సినిమా కూడా లేదు… సో, మహేష్ ఫ్యాన్స్‌కు ఈ సినిమాలో తన వాయిస్ వినడం ఓ ఆనందం…
ఐతే తొక్కిసలాట జరిగి, దేశవ్యాప్తంగా చర్చ జరిగిన అదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సంధ్య థియేటర్ పక్కనే ఈ సుదర్శన్ థియేటర్ కూడా… ఫుల్ ట్రాఫిక్ ఉండే చౌరస్తా అది… సేమ్, సంధ్య థియేటర్ దగ్గర పరిస్థితులే అక్కడ కూడా… ఐనా మంత్రి కోమటిరెడ్డి వెలువరించిన భీషణ ప్రకటన నేపథ్యంలో… ఈ బెనిఫిట్ షోకు పోలీసులు, ప్రభుత్వం అనుమతిస్తుందా..?
అవును, ఇదే ప్రశ్న… ఆల్రెడీ, నాగార్జున, బన్నీ, మోహన్‌బాబు ఇష్యూస్ వేర్వేరు అయినా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది… మరిప్పుడు మహేష్ బాబు బాపతు ముఫాసా సినిమాకు ప్రత్యేక సడలింపులు, మినహాయింపులు ఉంటాయా..?!
Share this Article