Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ముగ్గురు కొడుకులు… కాదు, కాదు… ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ…

November 27, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……. విధి వంచితులై, ప్రకృతి విపత్తులో విడిపోయి, తర్వాత కాలంలో కలిసిన కధతో చాలా సినిమాలే వచ్చాయి . 1965 లో వచ్చిన వఖ్త్ సూపర్ హిట్టయింది . బలరాజ్ సాహ్ని , రాజ్ కుమార్ , సునీల్ దత్ , శశికపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు .

దాని ఆధారంగా తెలుగులో 1969 లో భలే అబ్బాయిలు వచ్చారు . కృష్ణంరాజు , కృష్ణ , రామ్మోహన్ ముగ్గురు కొడుకులుగా నటించారు . హిందీలో మరలా ఇలాంటి కధాంశంతో వచ్చింది 1973 లో యాదోం కి బారాత్ . అదీ వీర హిట్టే . ధర్మేంద్ర , విజయ్ అరోరా , తారిఖ్ ఖాన్ , జీనత్ అమన్ , నీతూ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు .

Ads

దీనికి రీమేక్ 1975 లో వచ్చిన అన్నదమ్ముల అనుబంధం . యన్టీఆర్ , మురళీమోహన్ , బాలకృష్ణ , లత , కాంచన , జయమాలిని ప్రధాన పాత్రల్లో నటించారు . ఇలాంటి కధాంశంతో ఎన్ని సినిమాలు వచ్చాయో ! ఆల్మోస్ట్ అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు .

కృష్ణ స్వంత బేనరుపై ఆయన స్వీయ దర్శకత్వంలో ఆయన తల్లి నాగరత్నమ్మ గారి కోరికగా ఆమే నిర్మాతగా ఈ ముగ్గురు కొడుకులు సినిమా తీయబడింది .‌ 1988 అక్టోబరులో వచ్చిన ఈ సినిమా కూడా హిట్టయింది .
మూలకధ పి చంద్రశేఖరరెడ్డిది అయితే సినిమాకు అనుకూలంగా భీశెట్టి కధను నేస్తే పరుచూరి బ్రదర్స్ డైలాగులను వ్రాసారు .‌

వఖ్త్ సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా ముగ్గురు అన్నదమ్ములు ఒకే తేదీన జన్మిస్తారు . ముగ్గురి పుట్టినరోజు ఫంక్షన్ ఒకే రోజు జరుపుకుంటారు . అలా జరుపుకుంటున్న ఒక రోజు తుఫాన్ రావడంతో చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతారు .

ముగ్గురు మూడు చోట్ల పెరుగుతారు . కాలక్రమంలో ముగ్గురూ ఒకరికి ఒకరు దగ్గరవుతుంటారు . చివరకు అన్ని సినిమాలలో లాగానే ఈ సినిమాలో కూడా ఫేమిలీ సాంగే కలుపుతుంది . ప్రత్యేకత ఏమిటంటే కృష్ణ ఇద్దరు కొడుకులు రమేష్ బాబు , మహేష్ బాబు , కూతురు ప్రియదర్శిని నటించారు .

మహేష్ బాబు అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయంలో డైలాగులను బ్రహ్మాండంగా ప్రేక్షకులకు వినపడేలా చెప్పాడు . పెద్దయ్యాక ఎందుకనో అంత pitch లో చెప్పడు మరి !

  • ముగ్గురు కొడుకుల తల్లిదండ్రులుగా గుమ్మడి , అన్నపూర్ణలు నటించారు . ఓ ఇంటర్వ్యూలో అన్నపూర్ణ చెప్పింది . అన్నపూర్ణను మరి ఏ ఇతర నటుడికి భార్యగా నటించవద్దనో గుమ్మడి చెపుతుండేవాడట . మరి ఆ possessiveness ఏంటో ! ఎవరి గోల వారిది . ఆ గొణుగుడేదో సత్యనారాయణ గొణిగితే అర్థం ఉంటుంది .‌ వదిలేద్దాం .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి లిరిక్సుకు బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ , లలితాసాగర్ , సునంద బాగా పాడారు . మొదటగా మెచ్చుకోవలసింది ఫేమిలీ సాంగ్ సంసారమే బృందావనం పాట . సినిమాలో రెండు మూడు చోట్ల రిపీట్ అవుతుంది . ఆ తర్వాత ముగ్గురు కొడుకులు , ఇద్దరు కాబోయే కోడళ్ళు అంతా సామూహికంగా క్లబ్బులో డాన్సించే పాట హుషారుగా సాగుతుంది .

ఎవరూ లేని చోట మదిలో ఉన్న మాట అంటూ సాగే డ్యూయెట్ కృష్ణ , రాధల మీద బాగుంటుంది. రమేష్ బాబు , హిందీ నటి సోనంల మీద రెండు డ్యూయెట్లు ఉన్నాయి . టింగురంగడో , చూపిస్తవా అంటూ సాగుతాయి ఆ రెండు డ్యూయెట్లు . మహేష్ బాబు వీధి పాట తోక తెగిన గాలిపటంరా ఉంటుంది . పాటలన్నీ దర్శకుడు కృష్ణ బాగా చిత్రీకరించారు .

ఇతర ప్రధాన పాత్రల్లో సత్యనారాయణ , గుమ్మడి , కోట , నూతన్ ప్రసాద్ , గిరిబాబు , అల్లు రామలింగయ్య , మురళీమోహన్ , ప్రభ , చలపతిరావు , ఓ పాము , తదితరులు నటించారు . విజయన్ ఫైట్లను బాగా కంపోజ్ చేసారు . క్లైమాక్స్ ఫైట్లు కృష్ణ అభిమానులకు బాగా నచ్చుతాయి . సినిమా షూటింగ్ అంతా ఊటీలోనే జరిగింది .

నేను పరిచయం చేస్తున్న 1178 వ సినిమా ఇది . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బురద… బూడిద..! ఆలు లేదు, చూలు లేదు… అప్పుడే వేల కోట్ల స్కాములట..!!
  • ముగ్గురు కొడుకులు… కాదు, కాదు… ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ…
  • 26/11 …. మరిచిపోలేని ఒక నిజ భారత రత్నం… కొన్ని బొగ్గు కేరక్టర్లు…
  • బీసీ సీట్లపై బీఆర్ఎస్ ఫేక్ ప్రాపగాండా..! నిజాలేమిటో ఓసారి చూద్దాం..!!
  • ఒకటే చెట్టు… పది పక్షులు… ఒక తుపాకీ గుండు… తర్వాత మీరే చదవండి…
  • బాబోయ్ విలేకర్స్..! సొసైటీకి బెడదగా న్యూస్ కంట్రిబ్యూటర్ల వ్యవస్థ..!!
  • ఈ విశ్వసుందరి కిరీటం ధగధగల వెనుక కొన్ని చీకటి నీడలు…!!
  • అసలు తండ్రిని నేనేనా..?! కుటుంబ వ్యవస్థనే కూల్చేసే ‘పితృత్వపరీక్షలు’..!!
  • నచ్చిన వార్త..! ఓ ఉచిత ఇంజక్షన్‌తో రోజూ ఆరు ప్రాణాలు కాపాడారు..!!
  • పవర్ పాలసీ..! కేసీయార్ నష్టకారకాలు Vs రేవంత్ రెడ్డి కొత్త టెక్నాలజీలు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions