మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడి మృతి, అతని వయసు 26 సంవత్సరాలు. సెరిబ్రల్ పల్సీ జబ్బుతో పుట్టిన జయన్….. ఇదీ రెండేళ్ల క్రితం దాదాపు ఇవే తేదీల్లో వచ్చిన వార్తలు…
.
.
.
Destiny…. Our world range posts, our unlimited wealth, our super knowledge, our countless assets, our high level Circle, our abilities all are nothing… RIP…
.
నిజంగానే ఇన్ని రోజులు ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ బయట తెలియదు… బయటికి తెలియాల్సిన అవసరం లేదు అనుకున్నారు ఆ దంపతులు… వాళ్ల కొడుకు బాధపడిన వ్యాధి మస్తిష్క పక్షవాతం… పిల్లలకు భూమిపై నరకం చూపే ఒక జన్యు వ్యాధి… అది పుట్టుకతో వస్తుంది… ఇదీ కారణం అని చెప్పలేము… చికిత్స కూడా లేదు… కొన్ని రకాల పద్ధతుల్లో దాన్ని కంట్రోల్ లో మాత్రమే ఉంచవచ్చు…
కడుపులో పుట్టిన బిడ్డ సరిగా నడవలేడు… తినలేడు… టాయిలెట్ కు వెళ్లినా సాయం అవసరం… … తల్లికి, తండ్రికి ప్రత్యక్ష నరకం… ప్రతి రోజు… ప్రతి గంట… బిడ్డ బతికుంటే చాలు అని అనుకొంటారు తల్లిదండ్రులు… 26 ఏళ్ళ కొడుకు ఇన్ని రోజులు సెరిబ్రల్ పాలసీతో బాధపడి కళ్ళకెదురుగా మరణిస్తే…?
కడుపుకోత… గుండెకోత ! నిజంగా ఇన్నేళ్లు ఆ దంపతులు కొడుకును చూస్తూ ఎంత బాధపడి ఉంటారు..? సత్య నాదెళ్ల సంగతి తెలుసు గానీ ఆయన భార్య ఏం చేస్తుందో తెలియదు… ఎంతగా పనిమనుషుల్ని పెట్టుకుని, కొడుకును కనిపెట్టి చూసుకోవాలని చెప్పినా సరే… ఆ దంపతుల పెయిన్‌ను మనం అక్షరాల్లోకి తీసుకురాలేం…
Ads
తన కొడుకు అనంత్ తన అనారోగ్య సమస్యల్ని ప్రస్తావిస్తుంటే ముఖేష్ అంబానీ కళ్లెంబడి నీళ్లు వచ్చాయనే వార్తలు, వీడియోలు చూశాక ఎందుకో హఠాత్తుగా సత్యా నాదెళ్ల అనుభవించిన పెయిన్ గుర్తొచ్చింది… ఫేస్ బుక్ కూడా పాత మెమొరీ పోస్టును గుర్తుచేసింది… నిజంగా అలాంటి విషమ వ్యాధి, దాని బాధతో పోలిస్తే అనంత్ అంబానీ బాధ, అనారోగ్యం దాదాపు జీరో… ఐనా ముఖేష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు… అదే తండ్రి ప్రేమ… ఆ ఎమోషన్ సహజం…
పిల్లల చిన్న చిన్న అవస్థలకే తల్లడిల్లిపోయే తల్లిదండ్రులను చూస్తుంటాం… వాళ్ల మీద ప్రేమ కారణంగా వాళ్లు బాధను ఫీల్ కావడం సాధారణమే… కానీ లోకంలో ఎంతోమంది ఎన్నో రకాల విషమ అనారోగ్య సమస్యలతో తల్లడిల్లిపోతున్నారు… అందుకే ముఖేష్ కన్నీళ్ల వీడియో చూస్తే అనిపించింది… ఈ స్థాయి కుబేరుడివి కదా… పేద పిల్లల ఆరోగ్యం కోసం ఏమైనా ఓ బృహత్ పథకం ఆలోచించొచ్చు కదాని..! అఫ్ కోర్స్, ఇంత ఇచ్చిన సొసైటీకి నువ్వు కూడా ఏమైనా తిరిగి ఇవ్వాలి కదా భాయ్..!!
Share this Article