.
శివశ్రీ… నిన్నటి నుంచీ ఈమె వివరాల కోసం సెర్చింగు జరుగుతోంది నెట్‌లో జోరుగా… కారణం, శివశ్రీ స్కంధప్రసాద్ బీజేపీకి చెందిన బెంగుళూరు యువ ఎంపీ, భావి కర్నాటక బీజేపీ ఆశాకిరణం తేజస్వి సూర్యను పెళ్లి చేసుకోబోతున్నది…
Ads
34 ఏళ్ల తేజస్వి గురించి తెలిసిందే కదా… స్వతహాగా లాయర్, రెండుసార్లు ఎంపీ… సంఘ్ నుంచి బీజేవైఎం ద్వారా బీజేపీలో బలంగా ఎమర్జవుతున్న నాయకుడు… తన దూకుడు వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉంటాడు కూడా… ఈ బెంగుళూరు ఎంపీకి చెన్నైకి చెందిన 28 ఏళ్ల శివశ్రీతో పరిచయం ఎక్కడ మొదలైందో తెలియదు గానీ, తమ పెళ్లి విషయాన్ని తనే స్వయంగా వెల్లడించాడు… మార్చి 4న పెళ్లి…
శివశ్రీ విషయానికి వస్తే, ఆమె గురించి వివరాలు ఆసక్తికరం… పుట్టింది చెన్నై… తండ్రి స్కంధప్రసాద్ మృదంగ విద్వాంసుడు… చిన్నప్పటి నుంచే శివశ్రీకి భరతనాట్యం, శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పిస్తూ ప్రోత్సహించాడు…
అలాగని ఇతరత్రా విద్యలను నిర్లక్ష్యం చేయలేదు ఆమె… శాస్త్ర యూనివర్సిటీలో బయో టెక్నాలజీతో ఇంజనీరింగ్ చదివింది… సంస్కృతంలో ఎంఏ చేసింది… భరతనాట్యంలో కూడా ఎంఏ… ఈ రెండు కళల్లోనూ ప్రదర్శనలు ఇస్తుంటుంది… తనకు స్వయంగా ఓ యూట్యూబ్ చానెల్ ఉంది… రీల్స్, షార్ట్స్ చేస్తుంటుంది…
ఇవే గాకుండా… ఆమెకు ట్రెక్కింగ్, సైకిలింగ్, వాకింగ్, యోగాలలో బాగా ఆసక్తి… పోటీల్లో పాల్గొంటుంది… రాబోయే గోవా ఐరన్‌మ్యాన్ ఎండ్యూరెన్స్ పోటీలో పాల్గొంటోంది… తేజస్వి మొన్నటి సీజన్‌లో ఆ టాస్క్ కంప్లీట్ చేశాడు కూడా…
సినిమాల్లో పాడటం ఆమెకు పెద్దగా ఇష్టం ఉండదు కానీ… ఏఆర్ రెహమాన్ అడగడంతో తనతో కలిసి మణరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాకు ఓ పాట పాడింది…
ఈ ప్రదర్శనలకు తోడు ఆహుతి అనే సంస్థను స్థాపించింది… 64 కళల్లో ముఖ్యమైన వాటిని ఎంకరేజ్ చేయడం, వ్యాప్తి చేయడం ఆ సంస్థ ఉద్దేశం… కొన్నాళ్లుగా ఈ ఇద్దరి పెళ్లి మీద కన్నడ, తమిళ మీడియాలో రూమర్స్ ఉన్నాయి… ఇప్పుడిక కాబోయే వరుడే ప్రకటించాడుగా… భలే ఎంపిక… ఆల్రెడీ శివశ్రీ కుటుంబం పెళ్లి పనుల్లో పడిపోయారట..!! గుడ్…!
చివరగా…. ఆమెకు గతంలోనే పెళ్లయ్యిందనీ, భర్త డాక్టర్ శ్రీనివాసన్‌తో విడాకులు తీసుకుందని ఓ సమాచారం..!
Share this Article