.
ముమైత్ ఖాన్…. పేరు వినగానే, ఆ మొహం చూడగానే ఓ పాట అకస్మాత్తుగా గుర్తొచ్చి హమ్ చేయాలనిపిస్తుంది… ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే… చీటికిమాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే… నాకెవ్వరూ నచ్చట్లే, నా ఒంటిలో కుంపట్లే, ఈడు ఝుమ్మంది తోడెవ్వరే…
అలాంటి ఐటమ్ సాంగ్స్ నుంచి డ్రగ్స్ కేసు… ప్లస్ బిగ్‌బాస్… అప్పట్లో ఏదో టీవీ షోలో జడ్జి దాకా… ఆమెకు టాలీవుడ్‌లో బోలెడన్ని అనుభవాలు… కెరీర్ సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడమో, మరేదైనా కారణమో గానీ… మంచి మంచి అవకాశాలు కోల్పోయి, ప్రస్తుతం ఏం వెండితెరకు సంబంధించి ఏం చేస్తున్నదో కూడా తెలియని దుస్థితి…
Ads
ఈమధ్య ఏదో టీవీ షోలో మిడ్ ఎంట్రీ ఇచ్చింది… కాకమ్మకథలు అని తేజస్వి మదివాడ ఆహాలో ఓ వెగటు చాట్ షో చేస్తుంటుంది కదా… అందులో కనిపించింది ముమైత్… వెగటు స్టెప్పులు శేఖర్ మాస్టర్‌తో కలిసి ఈ షోలో పార్టిసిపేట్ చేసింది…
మామూలుగానే ఆ షోలో ద్వంద్వార్థాలు, వెగటు వ్యాఖ్యలు, వెకిలి ప్రశ్నలు కదా… హఠాత్తుగా ఆ వాతావరణం బరువెక్కింది… ముమైత్ పుర్రెలో 8 టైటానియం వైర్లు ఉన్నాయనేది ప్రస్తావన… దాని నేపథ్యం చెప్పుకొచ్చింది ముమైత్…
నిజానికి తను ఏ షోలో కనిపించినా నవ్వుతూ, తుళ్లుతూ, అందరినీ ఆటపట్టిస్తూ, చురుకుగా… ప్లస్ స్పోర్టివ్‌గా కూడా కనిపిస్తుంది… కానీ ఆమె కంటతడి పెట్టిన సీన్ ఇదే కాదు.,. నాలుగేళ్ల క్రితం ఆలీతో సరదాగా చాట్ షోలో కూడా చెప్పుకుంది ఆమె… సాధారణంగా సినిమా తారల తెర వెనుక జీవితాల్లో బోలెడంత విషాదమో, అన్నీ చంపుకునే అనుభవాలే ఊహించగలం… కానీ ఇది కాస్త భిన్నంగా ఉంది…
బాలకృష్ణ డిక్టేటర్ సినిమాలో శ్రద్ధాదాస్‌తో ఓ పాట చేస్తున్నప్పుడు ఇటాలియన్ మార్బుల్ ఫ్లోర్‌పై కాలు స్లిప్పయి, ఒక కార్నర్ అంచుకు ఆమె తల కొట్టుకుంది… కోమాలో 15 రోజులున్నది… నిజంగానే ఇది బయట చాలామందికి తెలియదు అప్పట్లో…
రెండు రోజులపాటు బ్రెయిన్ బ్లీడింగ్ ఆగలేదు, డాక్టర్లు మూడేళ్లు రెస్ట్ అవసరమని చెప్పారు… ఆమె ఎలాగోలా 3 నెలల్లో మళ్లీ ఫీల్డ్ మీదకు వచ్చేసింది… కానీ ఆ సమయంలో తను అనుభవించిన పెయిన్ పాపం అనిపించేదే… చెప్పొచ్చేదేమిటంటే… ఆమె కైపు చూపుల వెనుక మనకు కనిపించకుండా సుడులు తిరిగే ఏదో పెయిన్ ఉంటుందని..! కన్నీటిని దాచుకునేందుకూ కష్టమేనని…!
ఇక్కడ ముమైత్‌ది నటన కాదు… రియాలిటీ… అవునూ, ఈ టైటానియం వైర్లు ఏమిటి అంటారా..? ప్రమాదంలో పుర్రె (బ్రెయిన్ కాదు) ఆకారం డిస్టర్బ్ అయినప్పుడు ఈ వైర్లతో పుర్రెను యథాస్థితికి తీసుకొస్తారు… క్రానియోటమీ… లేదా క్రానియోప్లాస్టీ అంటారు… ఇతర లోహాలకన్నా టైటానియం వైర్లు బయోకంపాటిబుల్… ఐనా సరే, ఎప్పుడూ డాక్టర్ల పర్యవేక్షణ అవసరమే…
Share this Article