Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యాంకర్ రష్మి ఆనందంతో మెలికలు తిరిగిపోయింది… అరుదైన ప్రశంసే మరి…

February 5, 2024 by M S R

మురళీమోహన్… ఒకప్పటి హీరో… తెలుగుదేశం నాయకుడు… వయస్సు 83 ఏళ్లు… ఇప్పటికీ తన ఆరోగ్యాన్నిబాగా కాపాడుకుంటున్నాడు… తన సంపాదన, తన ఆస్తులు, తన వ్యవహారాలే తప్ప పెద్దగా వివాదాల్లోకి రాడు… పిచ్చి విమర్శల జోలికి పోడు… ప్రత్యేకించి టీవీ షోలు, సినిమా ఫంక్షన్లలో కూడా ఎప్పుడూ కనిపించడు…

తనను శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్‌కు పిలిచారు… ఎప్పటిలాగే హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ కలిసి ఏవో మూస పంచులు వేస్తారు కదా… వేశారు… తరువాత మురళీమోహన్ వచ్చాడు స్టేజీ మీదకు… వచ్చాక యాంకర్ రష్మితో ‘నిన్ను చూస్తే హిందీ యాక్టర్‌ను చూసినట్టు ఉంటుంది’ అన్నాడు… ఆమె ఆనందంతో మెలికలు తిరిగిపోయింది… నిజంగానే మంచి ప్రశంస…

anchor rashmi

Ads

మురళీమోహన్ వంటి వెటరన్ సెలబ్రిటీ ఒక టీవీ యాంకర్‌ను మెచ్చుకోవడమే కాదు… ‘నేను ఆమె ఫ్యాన్‌ని’ అన్నాడు… ఏదో కృతకంగా అన్నట్టుగా కూడా లేదు… రష్మి ఫుల్ హేపీ అందుకే… ఈ షోకు ఆయనతోపాటు మహానటి జయసుధను కూడా ఆహ్వానించారు… వాళ్లిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు…

కాకపోతే మరీ ఇప్పటి యానిమల్, సలార్, కేజీఎఫ్ బాపతు కాదు… కుటుంబ కథా చిత్రాలు… అలాంటి పాత్రలకు జయసుధ ఐకన్… మురళీమోహన్ కూడా యాక్షన్ సినిమాలు గాకుండా తనూ ఫ్యామిలీ స్టోరీల్లోనే కనిపించేవాడు… తనకు సూటయ్యేవి కూడా అవే… పాత్ర వచ్చిందా, చేశామా, ఇంటికి వెళ్లిపోయామా… ఇదే స్టయిల్ తనది… ఈ వయస్సులో కూడా మొన్నామధ్య గాడ్ ఫాదర్ సినిమాలో చేసినట్టు గుర్తు…

jayasudha

జయసుధ రాజకీయ జీవితం కాస్త గందరగోళంగా ఉంటుంది గానీ… తన సినిమా కెరీర్ మాత్రం అపూర్వం… ఆమెకు లభించినన్ని వైవిధ్యమైన పాత్రలు బహుశా ఏ తెలుగు యాక్ట్రెస్‌కూ వచ్చి ఉండవు… ప్రతి పాత్రలోనూ జీవించింది… ఇద్దరూ కలిశారు ఈ షోలో… ఇంకేం..? మురళీమోహన్‌లోని నాటి రొమాంటిక్ నటుడు నిద్రలేచినట్టున్నాడు… ‘సిరిమల్లె పువ్వల్లే నవ్వు…’ అని అక్కడే పాట అందుకున్నాడు… మోకాళ్ల మీద కూర్చుని ప్రపోజ్ కూడా చేసేశాడు… సరదాగా, బాగుంది…

తరువాత మురళీమోహన్‌ సినిమా వారాలబ్బాయి స్పూఫ్ ఒకటి చేశారు ఈటీవీ ఆస్థాన కమెడియన్లు… విషయం ఏమిటంటే… శ్రీదేవి డ్రామా కంపెనీ 150 వ షో సెలబ్రేట్ చేస్తూ ఆయన్ని ముఖ్య అతిథిగా పిలిచి, సన్మానం కూడా చేశారు… నిజమే, హైపర్ ఆది చెప్పినట్టు… ఎన్టీయార్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు వంటి ఆనాటి హీరోలు నేడు లేకపోవచ్చు, కానీ వాళ్ల సమకాలీనుడు, వాళ్లతో కలిసి పనిచేసినవాడు మురళీమోహన్ మన మధ్యే ఉన్నాడు… సరే, షో విషయానికి వస్తే మొదట్లో కాస్త డిఫరెంటు కాన్సెప్టులతో బాగుండేది… తరువాత అన్ని ఈటీవీ రియాలిటీ షోలలాగే దీన్ని కూడా మరో జబర్దస్త్, మరో ఎక్సట్రా జబర్దస్త్ రేంజుకు పడేశారు… ఫాఫం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రధాని వీడియో పీకిపారేస్తేనే నొప్పి తెలిసింది- చురుకు పుట్టింది !!
  • కల్తీకి ‘పాలు’పడ్డవాడెవడినీ వదల్లేదు – ఎవరికీ మింగుడుపడడు !!
  • కర్ణుడి చావుకు లక్ష కారణాలు… బీజేపీ ఓటమికి లక్షాఒకటి !
  • ఆ పాటలో ఆమె చదువుతున్న ఆ పుస్తకం ఏమిటి..? 30 ఏళ్ల మిస్టరీ..!!
  • చరిత్ర మళ్లీ మొదటికే… 200 ఏళ్లు… ప్రపంచ ఆర్థిక శక్తి మళ్లీ ఆసియాదే !
  • ‘‘నేనేంటి? అన్నమయ్యనేంటి? నన్ను వదిలేసేయండి సార్ ప్లీజ్’’
  • ఊరంతా ఓ దారి – ఈ ప్రేమలతది మరో దారి – రోతనిధికి జైకొట్టే దారి !!
  • మద్యం కంపెనీలపై బ్యాన్ ! అసలు నిజం వేరు – మీడియా రాసేది వేరు !!
  • “కంటేనే అమ్మ అని అంటే ఎలా?.. ఈ నిజజీవిత కథే సమాధానం !”
  • ప్రజలకు చేరువగా పాలన ! రేవంత్ సర్కారు భేషైన నిర్ణయం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions