Sai Vamshi…. … 1993లో పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరిగిన 6 హత్యల గురించి కేరళకు చెందిన హేతువాది బసవ ప్రేమానంద్ గారు రాసిన పుస్తకం ఇది. మహిమలు, స్వామీజీలకు వ్యతిరేకంగా జీవితమంతా కృషి చేసిన ప్రేమానంద్ 1974 నుంచి సత్యసాయి బాబా మీద పోరాడారు. 1986లో దాదాపు 500 మంది కార్యకర్తలతో కలిసి పుట్టపర్తిలో కవాతు నిర్వహించినందుకు పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.
అదే ఏడాది ఆయన కోర్టులో బాబా మీద కేసు వేశారు. శూన్యం నుంచి బంగారం సృష్టిస్తూ Gold Control Actని ఉల్లంఘించారని ఆరోపించారు. కానీ కోర్టులో ఆ కేసు కొట్టేశారు. 1993లో ఆయన ఈ పుస్తకం రాశారు. పుట్టపర్తి సాయిబాబా మీద బలమైన పోరాటం చేసిన వారిలో నేటికీ ప్రేమానంద్ గారిది తొలి స్థానం. 2009లో 79వ ఏట క్యాన్సర్‌తో మరణించారు.
… వచ్చినవారి లక్ష్యం బాబా కాదని, ఏవో కొన్ని రహస్యాలు తెలిసిన ఎన్.రాధాకృష్ణను చంపేందుకే వచ్చారనే వాదన వినిపించింది. అయితే నిజం ఏమిటో, ఆరోపణలు ఏమిటో ఏవీ బయటకు రాలేదు. అనంతరం సత్యసాయి ట్రస్టు ముఖ్య అధికారి ఇందూలాల్ షా మాట్లాడుతూ ‘ఇది పూర్తిగా ట్రస్టు వ్యక్తిగత అంశం. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోనవసరం లేదు’ అన్నారు.
Ads
ఆ తర్వాత ఈ అంశం గురించి విచారణ జరిగినా, వివరాలేవీ బయటకు రాలేదు. ఈ కేసును మూసేయమని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత రహస్య ఆదేశాలు వచ్చాయనేది ఒక మాట. అయితే, మరణించినవారిలో నలుగురు నిజంగా హత్య చేయడానికే వచ్చారా, లేక అక్కడికి వచ్చి హత్యకు గురయ్యారా, వాళ్ల శరీరాల్లో బుల్లెట్లు పోలీసులు కాల్చినవేనా, ఆ రాత్రి నిజంగా ఏం జరిగింది అనేది నేటికీ తెలియదు… పూర్తి వివరాలు: http://www.exbaba.com/articles/whomurdered.html…?
Share this Article