సాధారణంగా ఆహా ఓటీటీలో కంటెంట్ నాణ్యత మీద పెద్దగా సదభిప్రాయం లేదు… ఏదో ఒకటి తీసుకొచ్చి డంప్ చేస్తున్నారనేదే జనాభిప్రాయం… ఇండియన్ ఐడల్ తెలుగు పేరిట పాటల పోటీ షో పెడుతున్నారు అనగానే చాలామంది ప్రేక్షకులు నవ్వి, లైట్ తీసుకున్నారు… పైగా కాపీల తమన్, చాలారోజుల నుంచి వినిపించని- తెలుగు రాని సింగర్ కార్తీక్, పార్ట్ టైమ్ గాయని నిత్యా మేనన్ జడ్జిలు అని చదివి, చూసి సవాలక్ష షోలతో ఇదీ ఒకటి అనుకున్నారు అందరూ…
మొదట్లో రేవంత్ అనుకుని, తరువాత తనను పీకేసి, శ్రీరామచంద్రను హోస్ట్‌ను చేశారు… అయితే ఆడిషన్ రౌండ్లను చూస్తుంటే కాస్త ఇంట్రస్టింగ్ అనిపించింది… కారణం ఏమిటంటే..? దేశవిదేశాల నుంచి ఆన్‌లైన్ ఆడిషన్స్ కూడా చేశారు… మారుమూల పల్లెల నుంచి, పేద నేపథ్యాల నుంచి కూడా పాటరత్నాలు ఎన్నెన్నో… వందలాదిగా ఆడిషన్స్ ట్రై చేశారు… నిజంగా ఎన్ని మాణిక్యాలో కదా…
Ads
కార్తీక్ పెద్ద ఇంప్రెసివ్ కాదు గానీ… తమన్ సరదాగా చేస్తున్నాడు, బాగుంది… నిత్యామేననే సెంట్రల్ పాయింట్… ప్లజెంటుగా కనిపిస్తోంది… కాస్త స్వరజ్ఞానం ఉన్నదే కాబట్టి పర్లేదు… ష్, నిజం చెప్పాలంటే ఈటీవీ, జీటీవీ పాటల కార్యక్రమాల్లో జడ్జిలకన్నా బెటరే… ఆడిషన్స్ వరకూ ట్రాక్స్ సాయంతో గాయకులను పరీక్షిస్తున్నారు, పర్లేదు… కానీ అసలు పోటీ ప్రారంభమయ్యాక, గాయకులు పాడుతున్నప్పుడు ఫిజికల్‌గా ఆర్కెస్ట్రా ఉంటే బాగుంటుంది… హిందీ ఇండియన్ ఐడల్ చూశాం కదా… ఫుల్ ఫ్లెడ్జ్‌డ్… రకరకాల వాయిద్యాలు… కొందరు గాయకులు కూడా వివిధ పరికరాల మీద తమ నైపుణ్యం ప్రదర్శించారు… మచ్చుకు ఈ పాట చూడండి… ప్రత్యక్షంగా వీక్షిస్తున్న అనుభూతి కలుగుతుంది…
ఈవిషయంలో ఎస్పీ బాలును మెచ్చుకోవాలి… ఈటీవీలో తను నిర్వహించిన ప్రతి సంగీత కార్యక్రమంలోనూ వివిధ సంగీత పరికరాలను కూడా చూపించేవారు… అది ప్రేక్షకుడికి ఓ లైవ్ ఫీలింగ్ ఇస్తుంది… జీటీవీ సరిగమప హంగూఆర్భాటం ఎక్కువ… సంగీత ప్రాధాన్యం తక్కువ… ఓ టేస్ట్ కనిపించదు… మాటీవీ ఎందుకోగానీ మ్యూజిక్ సంబంధ రియాలిటీ షో ఒక్కటీ చేయలేకపోతోంది… ఇటు సరిగమప, అటు ఆహా షోలను ఒకందుకు మెచ్చుకోవాలి… ఎక్కడెక్కడో దాగున్న మంచి గాయనీగాయకులను పరిచయం చేస్తున్నందుకు… సోనీ లివ్ కోసం ఫోక్ సాంగ్స్ షో ఒకటి వస్తోంది…
నిజానికి రేటింగ్స్, యాడ్స్ రెవిన్యూపరంగా చూస్తే ఈ పాటలపోటీలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు… ఇవి అన్ని సెక్షన్ల ప్రేక్షకులు చూసే ప్రోగ్రామ్స్ కావు… హిందీ ఇండియన్ ఐడల్ సూపర్ క్లిక్ అయ్యిందంటే కారణం, సోనీ టీవీ రీచ్… పైగా గత సీజన్‌లో సింగర్స్ ఎంపిక, ప్రోగ్రాం రన్ చేసిన తీరు, గెస్టులు… అన్నీ కారణాలే… అయితే తెలుగు మార్కెట్, బడ్జెట్ ఆ భారీతనానికి చాన్సివ్వవు… ఐనాసరే, ఈటీవీ, జీటీవీ, ఆహా ఆ షోలపై కాన్సంట్రేట్ చేస్తున్నయ్…
ఇవన్నీ సరే, ఈ పోటీల్లో తమ ప్రతిభను చూపే గాయనీగాయకులకు భవిష్యత్తులో అవకాశాలు ఎలా ఉంటయ్..? ఇది పెద్ద ప్రశ్న… జవాబు చాలా క్లిష్టమైన ప్రశ్న… బిగ్‌బాస్ షోల ఫైనలిస్టులకు, కంటెస్టెంట్లకు ఏం అవకాశాలు వస్తయ్…? ఇదీ అంతే… అంతే…
Share this Article