Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జయప్రద – రేణుకా చౌదరి… ఇద్దరి రహస్య పంచాయితీని తీర్చిన చంద్రబాబు…

May 22, 2023 by M S R

Murali Buddha…….   జయప్రద , రేణుకా చౌదరి , బాబు చిదంబర రహస్యం . మూడు దశాబ్దాలైనా బయటపడని విషయం : జర్నలిస్ట్ జ్ఞాపకాలు

…..
ఏదైనా వివాదంపై ముఖ్యనాయకుల సమావేశం జరిగితే , సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకునేంతవరకు జర్నలిస్ట్ లకు నిద్ర పట్టదు . క్యాబినెట్ సమావేశంలో మీడియాకు విషయాలు చెబితే తాట వలుస్తా అని సీఎం హెచ్చరిస్తే క్యాబినెట్ ముగియగానే ఈ విషయం కూడా మీడియాకు తెలిసిపోతుంది . 95లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ఎంపీలుగా ఢిల్లీలో జయప్రద , రేణుకా చౌదరి వెలిగిపోతున్న రోజులు . ఇద్దరి మధ్య ఎందుకో వివాదం తలెత్తింది .
జయప్రదను ఉద్దేశించి ఓ ఇంగ్లీష్ పత్రికలో రేణుక చౌదరి పింప్ అంటూ ఏదో వాఖ్య చేశారు . పంచాయితీ చంద్రబాబు వద్దకు వచ్చింది . హిమాయత్ నగర్ లోని టీడీపీ కార్యాలయం మంచి మాస్ మసాలా న్యూస్ వస్తుంది అని మీడియా చాలాసేపు ఎదురు చూసింది . ఇద్దరితో బాబు సుదీర్ఘంగా మంతనాలు . ఇలాంటి సమావేశం ఏది జరిగినా తరువాత మీడియాను పిలిచి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు , ఇదంతా మీడియా కల్పించిన సృష్టి అని రొటీన్ డైలాగులు , ఒకరినొకరు కౌగిలించుకున్న ఫోటో సెషన్ తో ముగుస్తుంది .
కానీ ఆ రోజు ఏం జరిగిందో , బాబు ఇద్దరికీ ఏం చెప్పారో ? ఏం రాజీ కుదిర్చారో ఎవరికీ తెలియదు . వీరిద్దరూ చెప్పలేదు . అటు బాబు మీడియా ముందు నోరు విప్పలేదు . జర్నలిస్ట్ లు ఎంత ప్రయత్నించినా ఈ ముగ్గురి నుంచి విషయం బయటకు రాలేదు . ఆ సమావేశం జరిగి 28 ఏళ్ళవుతున్నా సమావేశంలో ఏం జరిగి ఉంటుంది అనే సందేహం తొలుస్తూనే ఉంటుంది .
తోచింది రాసుకోవడమే కానీ ఏం జరిగిందో ఆ ముగ్గురికి తప్ప ఎవరికీ తెలియలేదు . టీడీపీ నాదే అని ఎన్టీఆర్ వేసిన కేసు కొట్టేసి బాబుదే అని తీర్పు వచ్చింది . తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి బదిలీ అయ్యాక జయప్రద వెళ్లి బొకే ఇచ్చిన ఫోటోను సైతం మీడియా సంపాదించింది కానీ .. ఇప్పటికీ సమావేశం వివరాలు సంపాదించలేదు . ఆ తరువాత ఇద్దరూ టీడీపీకి దూరం అయ్యారు / దూరం పెట్టారు .
జయప్రద సమాజ్ వాది పార్టీలో చేరారు . అమర్ సింగ్ ఆశీస్సులతో ములాయం పార్టీలో ఉత్తరాదిలో జెండా ఎగురవేశారు . అనంతరం అమర్ సింగ్ కే అడ్రెస్ లేకుండా పోయింది . ములాయం సింగ్ లేరు . వాళ్ళ అబ్భాయి తాజా రాజకీయ జీవితాన్ని వెతుక్కుంటున్నారు .ఇక రేణుకా చౌదరి చంద్రబాబు సిఫారసు లేకుండానే మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రి పదవి చేపట్టారు . తరువాత టీడీపీకి దూరం అయి కాంగ్రెస్ లో చేరారు .
మధ్యలో సొంతంగా ఓ పార్టీ పెట్టారు . పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో శాసనసభ్యులు గెలిచారని , వారి పేర్లు చెప్పను రహస్యం అని జెమిని టివి ధర్మపీఠంలో చెప్పారు . జయప్రద , రేణుకా , బాబుల సమావేశం చిదంబర రహస్యమే తెలుసుకోలేక పోతున్నాం , ఆ రహస్య శాసన సభ్యుల పేర్లు తెలుసుకొనే అదనపు శ్రమ ఎందుకులే అని ఎవరూ ఆ మాటను సీరియస్ గా తీసుకోలేదు .
సోనియాగాంధీకి తృటిలో ప్రధాన మంత్రి పదవి తప్పిపోయినప్పుడు ఢిల్లీలో త్యాగం మీటింగ్ పెట్టి కాంగ్రెస్ నేతలంతా ఆమెను వేనోళ్ళు పొగడసాగారు . రేణుకా చౌదరి వంతు వచ్చింది . ఆమె కాంగ్రెస్ కు కొత్త, ఆఁ ఏం మాట్లాడుతుంది లే అనుకున్నారు . ఆమె మైకు పట్టుకొని బోరున ఏడ్చారు . మాటలు లేవు, మాట్లాడుకోడాలు లేవు, మైకు కూడా తడిచిపోయేంతగా , కరిగిపోయేంతగా ఏడ్చారు . టీడీపీ ట్రైనింగా ? మజాకానా ?  అనుకున్నారు అంతా .
తెలంగాణ ఏర్పడేప్పుడు సీఎం రేస్ లో నేను లేను చాలా పనులు ఉన్నాయి అని ప్రకటించారు . ఇప్పుడు ఆంధ్ర నుంచి పోటీకి ప్రయత్నిస్తున్నారు . (ఒకే గవర్నర్ రెండు రాష్ట్రాలకు ఉన్నప్పుడు ఒకే సీఎం రెండు రాష్ట్రాలకు సీఎం గా ఉంటే తప్పేమిటి ?) ఏదో ఒక పార్టీలో చేరాలి అని జయప్రద తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కాలం , వయసు , పరిస్థితులు సహకరించడం లేదు .
కాంగ్రెస్ వెలిగిపోతే రేణుకా చౌదరి వెలిగిపోయే వారు . కానీ …. పరిస్థితులు కలిసి రావడం లేదు . అన్ని రోజులు మనవే కావు . రోజుల సంగతి ఎలా ఉన్నా 28 ఏళ్ళు గడిచినా ఆ సమావేశం చిదంబర రహస్యం ఏమిటో తెలియడం లేదు . ఏమై ఉంటుందా ? అని 95లో హైదరాబాద్ లో రిపోర్టింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి రిటైర్ అయ్యాక కూడా ఆ ప్రశ్న నన్ను తొలుస్తూనే ఉంది . ఇంతకూ ఏం జరిగి ఉంటుందో ?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions