.
అవునూ, ఆ రైళ్లో ఆ సినిమాలో షర్మిలా ఠాగూర్ చదువుతూ కనిపించిన ఆ పుస్తకం పేరేమిటి..? ఈ చర్చ కొన్నేళ్లు నడిచింది… నిజం… ఈ చర్చ ఆ సినిమాకు, ఆ పాటకు కూడా బాగా పాపులారిటీ తీసుకొచ్చింది… ఆ కథలోకి వెళ్లాలంటే….
ఈరోజు బాలీవుడ్ లెజెండ్ కిషోర్ కుమార్ (పుట్టునామం అభాస్ కుమార్ గంగూలీ) జయంతి… నటుడు, గాయకుడు, కమెడియన్, దర్శకుడు, నిర్మాత, గీత రచయిత, కథారచయిత, సంగీత దర్శకుడు… బహుముఖ ప్రజ్ఞాశాలి… ఆ వివరాల మననంలోకి వెళ్తున్నప్పుడు…
Ads
హఠాత్తుగా ఓచోట ఆలోచనలు ఆగిపోయాయి… ఎప్పుడు..? ఏదో పాటల రాయల్టీ వివాదంలో రఫీకి, లతామంగేష్కర్‌కూ నడుమ మూణ్నాలుగేళ్లపాటు పాటల్లేవు, మాటల్లేవు… దాంతో ఆర్డీ బర్మన్ కిషోర్ కుమార్‌ను ఎంకరేజ్ చేశారని చెబుతారు… తరువాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు… లెజెండరీ సింగర్… ఎమర్జెన్సీ బాధితుడు… ( ఆ కథలు వేరు )…
ప్రత్యేకించి తను బాగా హిట్టయింది 1969లో వచ్చిన ఆరాధన మూవీ సాంగ్స్‌తో… రూప్ తెరా మస్తానా, మేరీ సప్నోంకీ రాణీ సాంగ్స్… సప్నోంకీ రాణి పాట కిషోర్ పాటల కెరీర్‌కు స్ట్రాండ్ ఫౌండేషన్ వేసింది… అది డార్జిలింగులో ఓచోట చిత్రీకరించారు… ఓ ఘాట్ రోడ్డు, పక్కనే రైల్వే లైన్… రైలు వచ్చినప్పుడు రోడ్డు బంద్, ట్రాఫిక్ ఎక్కువుంటే రైలు స్టాప్… సూపర్ లొకేషన్… ఈరోజుకూ టూరిస్టు ప్రయారిటీ లొకేషన్ అది…
రాజేశ్ ఖన్నా, మరొకరు జీపులో రోడ్డు మీద… పక్కనే ఓ పుస్తకం చదువుతూ షర్మిలా ఠాగూర్… క్షణకాలం ఆ పుస్తకం ముఖచిత్రం కనిపించకుండా టర్న్ అయిపోతుంది… ఇప్పుడంటే జూమ్‌లు, నెట్ సెర్చింగులు, ఫోటో గ్రాబింగులు ఎట్సెట్రా… అప్పుడు ఆ పుస్తకం పేరేమిటో తెలియక సినిమా ప్రేక్షకుల్లో మీడియాలో బోలెడు చర్చ…
Alister McLean రాసిన “Where Eagles Dare” అనుకునేవాళ్లు చాలామంది… దాని ఆధారంగా హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది… చాలా పాపులర్ రైటర్ అప్పట్లో… తరువాత, ఎహె, అదికాదు, ఆమె చదువుతున్నది “When Eight Bells Toll” పుస్తకం అని చర్చ… అదీ ఆ రచయిత రాసిందే… చివరకు ఈ పుస్తకం దగ్గరే ఫిక్సయ్యాయి చర్చలు…
దాదాపు 30 ఏళ్ల అనంతరం… 1999లో చివరకు షర్మిలా ఠాగూరే ఆ మిస్టరీ విడదీస్తూ, గొప్ప ట్విస్ట్ ఇచ్చింది… అప్పటిదాకా ఆ సినిమా టీమ్‌లో ఎవ్వరూ దీనిపై మాట్లాడలేదు కూడా… షర్మిల ఏం క్లారిటీ ఇచ్చిందీ అంటే…
‘‘చాలా సంవత్సరాల తర్వాత ఒక రహస్యాన్ని బయటపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. అది అలిస్టర్ మాక్లీన్ పుస్తకం కాదు. కవర్ మాత్రమే అలిస్టర్ మాక్లీన్ రాసిన “వెన్ ఎయిట్ బెల్స్ టోల్” పుస్తకం… అది ఫోంటానా వాళ్లు పబ్లిష్ చేసిన పేపర్ బ్యాక్ వెర్షన్… దానిలోపల నేను చదువుతున్నది రైల్వే టైమ్ టేబుల్… నేను తరువాత సన్నివేశంలో రైల్వే టైమ్ టేబుల్ గురించి ప్రస్తావించడాన్ని మీరు గమనించి ఉండవచ్చు… ఈ రైల్వే టైమ్ టేబులే ఆ రైల్వే టైమ్ టేబుల్…
చిత్ర యూనిట్ నుండి ఎవరూ ఇప్పటివరకు ఆ రహస్యాన్ని ఎందుకు బయటపెట్టలేదు అంటే, ముప్పై సంవత్సరాల క్రితం మీలాంటి తెలివైన అభిమానుల నుండి ఈ ప్రశ్నపై చాలా చర్చలు జరుగుతాయని మేము ఊహించాము కాబట్టి..’’ ఇదీ ఆ పాట లింక్…
మరి ఈ కథనానికి ముఖచిత్రం ఏమిటీ అంటారా..? ఈ సినిమాను కొన్నాళ్ల క్రితం 4 కే లోకి మార్చారు, యూట్యూబులోనూ ఉంది… అదుగో అందులో నుంచి గ్రాబ్ చేసిన ఫోటో… అందుకే, కాస్త ఆ పుస్తక ముఖచిత్రం కాస్త అర్థమవుతోంది…!! ……… ( Story Credit :: Apparasu Srinivasa Rao
)
తెలుగు రచయిత, దర్శక నిర్మాత Prabhakar Jaini ….. ఇదే పాటకు సంబంధించి షేర్ చేసుకున్న మరో ఇంట్రస్టింగు విషయం…
ఆ పాట, షర్మిలా, రాజేశ్ ఖన్నా, సుజిత్ కుమార్ వీళ్ళందరూ బాగా నచ్చిన సినిమా అది. అయితే, ఆ పాటలో ఒక అద్భుతమైన కెమెరా, ఎడిటింగ్ టెక్నిక్ ఉంది. షర్మిలా ట్రైనులో వెళ్తుంటే, రాజేశ్ ఖన్నా జీపులో వెంబడిస్తూ ఉన్నట్టు ఉంటుంది పాట. కానీ, నిజానికి, ఆ రెండు సీన్లు వేర్వేరుగా షూట్ చేసి, ఎడిటింగులో కలిపేసారు. కానీ, అటువంటి అనుమానమే రాదు. లుక్స్, బాడీ లాంగ్వేజ్, కంటిన్యూటీలు బాగా మ్యాచయ్యాయి…
ఇప్పుడు మనం, ఇంత టెక్నికల్‌గా అడ్వాన్సు అయినా, మనిషి ఒక వైపు ఉంటే, లుక్స్ తేడాగా ఉంటాయి. మొన్నటికి మొన్న హరిహర వీరమల్లులో, ఒకే సీనులో, ఒక సీనులో సుబ్బరాజుకు నీట్ షేవింగ్ ఉంటుంది. మరుక్షణంలో పూర్తి గడ్డంతో కనపడతాడని ఎవరో పోస్ట్ చేసారు… అస్సలు ఎవ్వడూ ఏదీ పట్టించుకోరు సార్! అవన్నీ పెద్ద తప్పులు కావని ధీమాగా, జబ్బలు చరుచుకుంటారు. అదొక స్వర్ణ యుగం…
ఇదొక లోహ యుగం. అంటే కత్తులు, కటార్లు, రకరకాల, వింత వింత ఆయుధాలు. అన్నీ ఫెవికాల్ అట్ట ముక్కలే. అబ్బో నిజంగా ఇనుముతో చేస్తే ఆ బరువుకు సుకుమారులైన మన హీరోలు కంది పోరూ? గడ్డాలు పెంచి, మురికి బట్టలు వెేసుకున్నంత మాత్రాన, సిక్స్ ప్యాక్ పెంచినంత మాత్రానా, వాళ్ళేమీ బలాఢ్యులు కాదు. తుమ్మితే ముక్కు రాలిపోయే రకాలు. అందుకే వంద మంది బౌన్సర్ల మధ్య, ధీమాగా నడుస్తూ, బయలుదేరుతారు…
Share this Article