.
ప్రపంచాన్ని కుదిపేసిన Jeffrey Epstein కేసులో ఇప్పటికీ పూర్తి సమాధానం దొరకని కొన్ని ప్రశ్నలు అలాగే ఉన్నాయి… ఆ ప్రశ్నలన్నింటి మధ్యలో, ఒక మిస్టరీ నీడలా తిరిగే పేరు — Nadia Marcinko…
ఎప్స్టీన్ కథలో చాలామంది వచ్చారు… వెళ్లిపోయారు… కొందరు జైలుకెళ్లారు… కొందరు చనిపోయారు… కానీ నాడియా మాత్రం ఇంకా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది… ఎందుకంటే ఆమె పాత్రను ఒకే పదంతో నిర్వచించడం అసాధ్యం… బాధితురాలా..? సహచరురాలా..? లేక ఎప్స్టీన్ సామ్రాజ్యపు అత్యంత కీలక సాక్ష్యమా.. ?
Ads
స్లోవేకియాలో జన్మించిన నాడియాను, కేవలం టీనేజ్ వయసులోనే అమెరికాకు తీసుకొచ్చాడని పలు రిపోర్టులు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఎప్స్టీన్ తన పరిచయ వర్గాల్లో ఆమె గురించి మాట్లాడిన తీరు, బయటకొచ్చిన కోర్టు పత్రాలు, బాధితుల వాంగ్మూలాలు — ఇవన్నీ కలిపి చూస్తే, అది సాధారణ “సహాయం” కాదనే అనుమానం బలపడుతుంది.
ఆమెను పైలట్‌గా తీర్చిదిద్దడానికి భారీగా డబ్బు ఖర్చు పెట్టబడింది. తర్వాత ఆమె ఎప్స్టీన్ ప్రైవేట్ జెట్లను నడిపే స్థాయికి ఎదిగింది. సోషల్ మీడియాలో “Gulfstream Girl”గా ప్రసిద్ధి పొందింది. తర్వాత విమానయాన రంగంలో “Aviloop” అనే సంస్థతో వ్యాపారవేత్తగా కూడా ఎదిగింది. బయటికి చూస్తే ఇది ఒక సక్సెస్ స్టోరీలా కనిపిస్తుంది. కానీ ఎప్స్టీన్ కేసు తెరుచుకున్న తర్వాత అదే కథ చీకటి వైపు తిరిగింది.
ఎప్స్టీన్ ప్రైవేట్ జెట్ల ప్రయాణాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు నడిచినప్పుడు, నాడియా పేరు మళ్లీ మళ్లీ బయటకొచ్చింది. పబ్లిక్ డాక్యుమెంట్లలో ఆమె వందలాది ఫ్లైట్ లాగ్స్‌లో కనిపించినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న “267 ప్రయాణాలు” వంటి సంఖ్యలకు పూర్తి ధృవీకరణ లేదని కొన్ని ఫ్యాక్ట్-చెక్ రిపోర్టులు పేర్కొన్నాయి.
అసలు మలుపు మాత్రం 2018 తర్వాత మొదలైంది. అమెరికాలో ఆమె వీసా సమస్యలు తలెత్తిన సమయంలో, నాడియా ఫెడరల్ దర్యాప్తు సంస్థలతో సహకరించడం ప్రారంభించిందని అమెరికన్ మీడియా కథనాలు చెబుతున్నాయి. తర్వాతి నాలుగేళ్లలో ఆమె ఇచ్చిన సమాచారమే Ghislaine Maxwell విచారణలకు, ఎప్స్టీన్ నెట్‌వర్క్‌పై దర్యాప్తులకు కీలకమైందని రిపోర్టులు పేర్కొన్నాయి.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే — అమెరికా ఎఫ్‌బీఐ 2022లో నాడియాను మానవ అక్రమ రవాణా బాధితురాలిగా గుర్తించినట్టు బయటకొచ్చిన పత్రాలు సూచిస్తున్నాయి. అదే సమయంలో, పాత కేసు రికార్డుల్లో ఆమెను “పాజిబుల్ సహచరురాలు”గా కూడా పేర్కొన్నారు. అంటే ఈ కేసులో ఆమె పాత్రే అత్యంత సంక్లిష్టం. ఒకే వ్యక్తి… ఒకేసారి బాధితురాలిగానూ, వ్యవస్థలో భాగంగానూ కనిపించడం… ఇదే ఎప్స్టీన్ సామ్రాజ్యపు అసలు భయంకర రూపం కావచ్చు.
ఇప్పుడు మరో పెద్ద ప్రశ్న — నాడియా ఎక్కడుంది?
2024లో ఎప్స్టీన్ ఫైల్స్ చివరి విడత బయటకొచ్చిన తర్వాత ఆమె ప్రజల కంటికి దాదాపు కనిపించకుండా పోయిందని పలు మీడియా కథనాలు రాశాయి. ఆమె నిజంగా “అదృశ్యమైందా”? లేక ఉద్దేశపూర్వకంగా లో-ప్రొఫైల్‌లో ఉందా? స్పష్టమైన సమాధానం లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది — ఎప్స్టీన్ జెట్‌ల్లో ఎవరెవరు ప్రయాణించారు, ఎవరెవరు ఆ దీవులకు వెళ్లారు, ఏ రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు, సినీ ప్రముఖులు అతనితో సంబంధాలు పెట్టుకున్నారు అన్న సమాచారానికి ఆమె కీలకం.
అందుకే నాడియా మార్సింకో కథ ఇప్పుడు కేవలం ఒక మహిళ కథ కాదు…
ఇది శక్తి, డబ్బు, బ్లాక్‌మెయిల్, లైంగిక దోపిడీ, అంతర్జాతీయ రాజకీయ సంబంధాలు అన్నీ కలిసిన ఒక చీకటి సామ్రాజ్యానికి మిగిలిపోయిన చివరి “లైవ్ ఫైల్”.
ఆమె ఎప్పుడైనా పూర్తిగా నోరు విప్పితే?
బహుశా ప్రపంచం ఇప్పటివరకు చూసిన అతిపెద్ద శక్తివంతుల ముసుగులు ఒక్కసారిగా జారిపడే అవకాశం ఉంది…
Share this Article