Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాగబాబూ.., మహానటుడు ఎన్టీఆర్‌‌పై మరీ అంత చౌకబారు స్కిట్..!!

July 3, 2026 by M S R

.

నాగబాబు ఎవరు..? జనసేన ఎమ్మెల్సీ, పవన్ కల్యాణ్ అన్న, చిరంజీవి తమ్ముడు… కాదు, ప్రధానంగా ఈటీవీలో వచ్చే ఓ బూతు, వెగటు రోత జబర్దస్త్ ప్రోగ్రామ్‌కు సరికొత్త జడ్జి… సరే, ఏదో పాపులారిటీ కోసం ఏదో ప్రయాస అనుకుందాం… కానీ తను ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామి…

ప్రజాజీవితంలో ఉన్నప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని మర్యాదలు, పద్ధతులు, సంస్కారాలు పాటించాలి… అదే ఇప్పుడు చర్చనీయాంశం… తన కూటమికి ఏపీలో బాస్ ఎవరు..? చంద్రబాబు..! చంద్రబాబు పొలిటికల్ దైవం ఎవరు..? (వెన్నుపోటు గట్రా కాసేపు వదిలేయండి)… NTR లెగసీని కూడా హైజాక్ చేశాడు కదా…

Ads

మరి ఆ దేవుడిని నాగబాబు ఓ టీవీ షో కోసమైనా సరే, పైగా ది గ్రేట్ టీడీపీ అనుకూల చానెల్ ఈటీవీలో ఓ షోలో వెటకరిస్తే… కించపరిస్తే… చంద్రబాబు ఏం చేయాలి..? ఏమీ చేయడు… మరి ఆ కించపరిచిన స్కిట్ ఏదో తాజా ప్రోమోలో కనిపించింది…

(నాగబాబు వచ్చాడంటేనే తన వ్యక్తిగత రాగద్వేషాలు జబర్దస్త్‌లో ప్రదర్శితమవుతాయనీ, మల్లెమాల బాస్ ఉత్త నిమిత్రమాత్రుడనీ, ఈటీవీ యాజమాన్యం ఉత్తుత్తి పెత్తనమేననీ గతంలోనూ చెప్పుకున్నాం కదా… అదే హైపర్ ఆది మళ్లీ… గతంతో కత్తి మహేష్ మీద విసుర్ల దగ్గర నుంచీ చూస్తున్నాం కదా, కామెడీ షో కాస్తా పొలిటికల్ షో అయ్యిందని)…

సరే, ఈ ప్రోమో, ఈ స్కిట్ దగ్గరకు వద్దాం… ఎన్టీయార్‌ను పోలిన వేషభాషలు, బుల్లెట్ భాస్కర్… ఫస్ట్… 1961… అబ్బో, నేరేడు పళ్లు అంటూ హీరోయిన్ పిరుదుల మీద కసికసిగా బాదుతూ ఉంటాడు… (నిజానికి అది ఎన్టీయార్ పాట కాదు)… పొట్టి నరేష్ అక్కడికి ‘చచ్చిపోద్ది సార్’ అని వారిస్తుంటాడు…

రష్మి అయితే మరీ ‘హీరో గారూ కాస్త బలిసినట్టున్నారు’ అని సెటైర్ వేస్తుంది… తరువాత 1987… భాస్కర్ పొట్టను చూపిస్తుంటాడు పొట్టి నరేష్… ‘జనాలు నా పొట్ట కోసం, తట్ట కోసం రారు, నా మొహం చూడటానికి వస్తారు’ అంటాడు భాస్కర్… ‘ఆ రెండూ కలిపితే మీ మొహం’ అంటుంది రష్మి… దారుణమైన వ్యాఖ్య…

అక్కడ శాంతి స్వరూప్ (లేడీ గెటప్) తన జోడీ… కట్ చేస్తే 1997… అదే హీరో… హీరోయిన్ ఎవరూ అనడుగుతాడు ముసలి భాషలో… ‘నా కూతురే బాబూ…’ అంటుంది/ అంటాడు శాంతి స్వరూప్… తన బిడ్డ ఫైమా… బంగారు బొమ్మ రావేమో అని సాంగ్… తరువాత మరీ కుర్చీ నుంచి లేవని భాస్కర్…

ఫైట్లకు కూడా క్లోజప్ షాట్ ఇవ్వడానికి ఎంత అవస్థలు పడతాడో చెబుతున్నట్టు..! ఇదీ ఆ ఫోజు…

నాగబాబు

మొత్తం స్కిట్ అంతా నాగబాబు పడీ పడీ నవ్వుతూనే ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు… ఒక దిగ్గజ నటుడిని, అదీ కూటమిలో ప్రధానపార్టీకి ఆరాధ్య దైవం వంటి మహానటుడిని అంత వెకిలి చేయడం అవసరమా..?

చివరగా చిన్న ప్రశ్న నాగబాబూ… కామెడీ షోను కామెడీగానే చూద్దాం అంటావేమో… సరే, మీ అన్న చిరంజీవి మీద ఇలాంటి వెకిలి స్కిట్ చేస్తే, ఇలాగే పడీ పడీ నవ్వుతావా..? ఎంకరేజ్ చేస్తావా..? ఆ షోకు జడ్జిగా ఉంటావా..? అసలు మల్లెమాలకు అంత ధైర్యం ఉందా..? ఈటీవీకి ఆ సాహసం చేతనవుతుందా..? ఫాఫం ఈటీవీ!! ఫాఫం లోకేష్, ఫాఫం చంద్రబాబు, ఫాఫం బాలకృష్ణ!!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నాగబాబూ.., మహానటుడు ఎన్టీఆర్‌‌పై మరీ అంత చౌకబారు స్కిట్..!!
  • సవాళ్లు- డిమాండ్లు- తోపులాటలు… ఎందుకొచ్చిన ప్రచార ప్రయాస!
  • NEET – ప్లస్ టూ మార్కులకు వెయిటేజీ- లేదా 70% వస్తే నీట్ అర్హత?
  • ఎట్టకేలకు జననాయకుడికి మోక్షం! 2, 3 రోజుల్లో CBFC క్లియరెన్స్!
  • గడీలోకి వెళ్తే మరో జీవన్‌రెడ్డి – కాషాయం ఇక రానివ్వదు – మరేమిటి..?!
  • పెళ్లి తంతు కూడా ముఖ్యమే! రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంటే సరిపోదు!!
  • అంతటి స్టార్ డైరెక్టర్ దాసరి ఆ హీరో కాళ్లు ఎందుకు మొక్కాడు..?!
  • డర్టీ మొగుడు- కామ ఖాకీ…! చామెట్ యాప్‌లో బరిబాతల దందా!
  • Unsung Hero – అమెరికన్ గడ్డ మీద ఓ ఇండియన్ గదర్!
  • ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర! – సూత్రధారి ఈ సెంథిల్ బాలాజీ..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions