Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక ఆదిపురుష్ – ఒక అఖండ2 – ఒక నాగబంధం!!

July 3, 2026 by M S R

.

కేవలం గ్రాఫిక్స్ సినిమాను నిలబెట్టలేవు… గ్రాఫిక్స్ కథకు, కథనానికి తోడ్పడాలి, అదనపు విలువను (Value Addition) జోడిస్తాయి తప్ప అదే ప్రధానంగా సినిమా నడవదు… అది తెలియకే ఒక ఆదిపురుష్ అంతటి ప్రభాస్ ఉండీ, అన్ని వందల కోట్లు పెట్టినా సరే తోకపటాకులాగా టప్‌మంది…

అంతటి బాలకృష్ణ ఉండీ, అన్ని పంచ్ డైలాగులు కొట్టీ, అఖండ ఘనవిజయం తరువాత సీక్వెల్ అయి ఉండీ, థమన్ బాక్సులు బద్దలు కొట్టినా సరే, అఖండ2 బాక్సాఫీసు మాత్రం బద్ధలు కొట్టలేదు… ప్రస్తుతం నాగబంధం కూడా అంతే…

Ads

సినిమా ట్రెయిర్లు, పెట్టిన 100 కోట్ల భారీ ఖర్చు, చేసిన ప్రచారం, పెట్టిన విగ్రహాలు గట్రా సినిమా మీద ఆసక్తిని పెంచాయి.., ఓ చిన్న హీరోతో అంత భారీ ప్రయోగం చేస్తున్నారేమిటా అనిపించింది… ఎందుకంటే ఇలాంటి సినిమాలకు పెద్ద స్టార్లు కూడా కొన్నిసార్లు ఆనడం లేదు, చతికిలపడుతున్నాయి… మరి స్టార్ అట్రాక్షన్ కూడా లేకపోతే..?

నిజానికి విరాట్ కర్ణ బాగానే చేశాడు కథానాయకుడిగా… రుద్రగా, సాధువుగా నప్పాడు… నభా నటేష్ (డబుల్ రోల్), దక్ష, ఐశ్వర్య మీనన్ ఉన్నారు… జగపతిబాబు కూడా ఉన్నారు… హైక్వాలిటీ గ్రాఫిక్స్ చేశారు… విజువల్స్ గ్రాండ్‌గా ఖర్చుకు తగినట్టుగా ఉన్నాయి… బీజీఎం కూడా అదిరిపోయింది… కానీ ఏం ఫాయిదా..? పాటలు, యాక్షన్ సీన్లు, ఇతరత్రా గ్రాఫిక్స్‌దే డామినేషన్… పైగా…

ప్రస్తుతం ట్రెండ్ పురాణాలు, సనాతనధర్మం, హిమాలయాల చుట్టూ ఓ కథ రాసుకున్నారు… ఐనా సరే ఎక్కడ దెబ్బతిన్నది..? సీన్లను కలిపే ఓ ఎమోషనల్ థ్రెడ్ లోపించింది… 1960 నాటి కథ… ఓ బ్రహ్మకమలం, అది దొరికినవాడికి విశ్వాన్ని శాసించే శక్తి వస్తుంది… దానికోసం విలన్, అడ్డుకునే పనిలో హీరో… పద్మనాభస్వామి గుడిలో చివరి నేలమాళిగకు నాగబంధం రక్షణ ఉన్నట్టుగా… ఇందులోనూ… అడుగడుగునా పాములే…

1970 లో కూడా కథ ఉంటుంది… నిజానికి ఓ దేవుడి నాభిలో బ్రహ్మకమలం, దాని కోసం ఓ ఫాంటసీ కథ… ఇందులో సనాతనధర్మ రక్షణ ఏముంది..? దానిపై గంభీరమైన మాటలు దేనికి..? కావాలని ఇరికించినట్టు అనిపిస్తుంది… కొన్ని పాత్రల్ని ఎందుకు పెట్టారో తెలియదు, కొన్ని సీన్లు అలా ఎందుకు వచ్చిపోతున్నాయో అర్థం కాదు… హీరోహీరోయిన్ల ప్రేమ మరీ తీసికట్టు యవ్వారం…

విలన్ అయితే దొరికిన ప్రతివాడినీ చంపేస్తుంటాడు… కానీ సినిమాలో చెప్పుకోదగ్గవి సెట్స్, క్లైమాక్స్… బాగున్నాయి… చివరగా, సినిమా కథాకథనాలు బాగుంటే హనుమాన్, మిరాయ్ వంటివీ పెద్ద పెద్ద స్టార్లు లేకపోయినా హిట్టయ్యాయి… ఇందులోనూ స్టార్లు లేకపోయినా పర్లేదు, పెదకాపు విరాట్ కర్ణ లో ఇమేజ్ కూడా సమస్య కాదు… కానీ ఎటొచ్చీ కథాకథనాలు, కదిలించే భావోద్వేగబంధం లేదు… అందుకే నాగబంధం పనిచేయలేదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చట్టం చేయని నిర్వాకం కేసీయార్‌ది ! నిందలు రేవంత్ రెడ్డిపైన !!
  • Bheemana Amavasya ! భర్తకు నటి ప్రణీత పాదపూజ వైరల్ ఫోటోలు !!
  • టాటా చైర్మన్ చంద్రశేఖరన్ నిష్క్రమణ వెనుక ఏం జరిగింది ?!
  • ఆ దరిద్రుడు, నరకం చూపించాడు ! అనుపమ వేదనాగీతం !!
  • ప్రకాష్‌రాజ్ నిర్మాతగా ఓ నాసి మూవీ – బాలచందర్ పరువూ గల్లంతు !!
  • అడాప్టివ్ టెస్టింగ్ ! నీట్- పోటీ పరీక్షల అక్రమాలకు రియల్ చెక్ !!
  • PTG Colony – అరకు ​హైవే మెరిసింది… కనీస గౌరవం మరిచింది!
  • చంద్రముఖి ! హీరోలు, భాషలు మారేకొద్దీ అష్టవంకర్లు పోయిన అసలు కథ !
  • గైర్హాజరీ టీచర్లపై ఇకపై కఠిన చర్యలు! ఉత్తర్వులు జారీ!
  • ఆయన కేరళలోని గంగ… ఈయన ఇక్కడే కిమ్స్… ఏమిటీ తేడా..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions