Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యూట్యూబ్ స్టార్ నాగదుర్గ- మూవీల్లో క్లిక్కయితే మరో సాయిపల్లవి…

June 19, 2026 by M S R

.

నాగదుర్గ… ఖచ్చితంగా తెలుగు యూట్యూబ్ సూపర్ స్టార్… ఆమె పాట అంటే మినిమం మిలియన్ల వ్యూస్… ఆమె నాట్యంలో ఆ ఈజ్ ఉంటుంది… ప్రధానంగా ఫోక్… ఎక్కడా రోత స్టెప్పులు, బాడీ లాంగ్వేజ్ ఉండదు… హాయిగా ఫ్యామిలీ అంతా చూసేలా ఉంటుంది…

ఎస్, తెలుగు ఫోక్ యూట్యూబ్ విప్లవంలో రాను ముంబైకి రాను పాటకు ఎంత వాల్యూ ఉందో, నాగదుర్గ పాటలకూ అంతే వాల్యూ ఉంది… యూట్యూబ్‌ను కమ్మేసిన ఓ నృత్య కెరటం… కాపోళ్ల ఇంటికాడ, జిల్లేలమ్మ జిట్ట, తిన్నా తిరం పడ్తలేల నుంచి మొన్నమొన్నటి దారిపంటొత్తుండు దాకా… సూపర్ హిట్ కేరక్టర్ ఆమె… తెలుగు యూట్యూబ్ స్టార్ హీరోయిన్ ఆమె…

Ads

ఇప్పుడు ఆమె తమిళ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్ హీరోగా నటించే ఓ తమిళ సినిమాలో హీరోయిన్… లవ్ ఓ లవ్… ఈ పవీష్ మనకు పరిచయమే…  జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తెలిసినవాడే… ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది… అంతకుముందే కలివివనం అనే ఓ తెలుగు సినిమా కూడా చేసింది ఆమె… ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ, అడవుల నరికివేత కాన్సెప్టుతో బాగానే ఉంది…

nagadurga

రొటీన్ సినిమా హీరోయిన్ల పాత్రలు అక్కర్లేదనీ, మంచి పాత్రలు దొరికితే తప్ప సినిమాల్లో చేయను అని గతంలో నాగదుర్గ చెప్పినట్టు గుర్తు… అలాగే ఏకంగా నాని సినిమా శ్యామ్ సింగరాయ్‌ పాత్ర కూడా వచ్చినట్టే వచ్చి పోయిందనీ వార్తలు చదివినట్టు యాది…

నాగదుర్గ

అలాంటిది నేరుగా ఓ తమిళ సినిమాలోకి, అదీ ధనుష్ క్యాంపులోకి ఎలా ఎంట్రీ ఇచ్చిందో గానీ ఇంట్రస్టింగు… అయితే చాలా వార్తలు వచ్చాయి… తమిళం వాళ్లు గుర్తించారు గానీ నాగదుర్గను తెలుగు ఇండస్ట్రీ గురించడం లేదు ఎందుకు అని..? కానీ తప్పు…

ఆమె రెండు తెలుగు సినిమాలు చేయబోతోంది… అవి రొటీన్ హీరోయిన్ పాత్రలా..? ఏమైనా విశేష ప్రాధాన్యముందా..? చూడాలిక… ఆమెకు కొన్ని చాన్సులు వచ్చీ ఆమె వద్దనుకుంది కదా, మరి ఈ పాత్రల కథలేమిటో ఆసక్తికరం…

nagadurga

కూచిపూడి, పేరిణి నేర్చుకున్న శాస్త్రీయ నృత్యకారిణి ఆమె… డాన్స్ స్కూల్ నడిపిస్తూ, డాన్స్‌లో పీహెచ్‌డీ కూడా చేస్తుందని సమాచారం… 1600 ప్రదర్శనలు, 70 వీడియో సాంగ్స్ చేసింది…

కాకపోతే తన పాపులర్ ఫోక్ స్టెప్పులకూ ఆ నాట్యాలకూ సంబంధం లేదు… దారపంటొత్తుండు పాటలో రెట్రో స్టయిల్ మేకప్పు, పోకడతో అదరగొట్టింది… అచ్చం సినిమా హీరోయిన్లలాగే… కొన్నిచోట్ల స్టేజ్ డాన్సులు కూడా చేసింది…

nagadurga

  1. వంశీరెడ్డి దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా ఓ సినిమా ఒప్పుకుంది ఆమె తాజాగా… బన్నీ వాసు, సుకుమార్ నిర్మాతలు…
  2. సంపత్ నంది నిర్మాతగా.. అశోక్ దర్శకత్వంలో రాజు వెడ్స్ రాంబాయి హీరో పక్కన నటిస్తుంది మరో సినిమాలో… ( ఈ రెండూ కట్టర్ తెలంగాణ సినిమాలే )

నాగదుర్గ

గుడ్ స్టార్ట్… ఏది పడితే అది చేయను అంటోంది, సాయిపల్లవిలాగే… ఆమెలాగే మంచి డాన్సర్, పైగా ఈమె ట్రెయిన్డ్… సాయిపల్లవి లుక్‌కన్నా బెటర్… కానీ నాట్యం సినిమాల్లో అప్రధానం, నటనే ముఖ్యం… అందులో సాయిపల్లవితో పోటీపడితే… తెలుగులో మంచి అవకాశాలున్నాయి… కాపోళ్ల ఇంటికాడ అంటూ దున్నేయడమే, ఆల్ ది బెస్ట్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రష్మిక, పూజా హెగ్డే, ఐటమ్ సాంగ్… తమన్ భలే కథలు చెబుతాడు!
  • ఈ పిల్లాడిని బలిగొన్నది కేవలం ఆ ఒక్క మార్కేనా? ఓ మథనం అవసరం!!
  • హోటల్ పనివాడుగా మొదలై… స్టార్ హీరోలకు దీటుగా స్టార్ విలన్!
  • విద్యా శాఖ మాత్రం ఇవ్వొద్దుట ! – మంత్రిగా ఉంటే పర్లేదుట !!
  • భక్తి తప్పు కాదు – ఇదుగో ఇలాంటి మూఢ భక్తే ‘మోక్షమార్గం’!
  • ప్చ్… చివరకు ఈ అనంత జ్ఞాన శ్రీరాముడూ చెప్పేవాడయ్యాడు !!
  • హైడ్రా ! తెలంగాణ బీజేపీ బీఆర్ఎస్ అనుబంధ రాజకీయ విభాగమా ?!
  • ఇదంతా తెలంగాణ అస్థిత్వ సమస్యా? బీఆర్ఎస్ పార్టీ అస్థిత్వ సమస్యా!?
  • బొద్దింకల పార్టీ ! మీకు తెలియని ఒక అంతర్జాతీయ పొలిటికల్ మిస్టరీ !!
  • అసలు సమస్య ‘నీట్’ను దాటి… మన వైద్య వ్యవస్థలోనే ‘రోగాలు’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions