.
నాగదుర్గ… తెలంగాణ ఫోక్ డాన్స్, ఫోక్ సాంగ్స్‌తో యూట్యూబ్‌ను కమ్మేసిన ఓ నృత్య కెరటం… గతంలోనూ చెప్పుకున్నాం కదా ఆమె గురించి… కోట్ల వ్యూస్ ఆమె వీడియోలకు…
కాపోళ్ల ఇంటికాడ, జిల్లేలమ్మ జిట్ట, తిన్నా తిరం పడ్తలేల నుంచి మొన్నమొన్నటి దారిపంటొత్తుండు దాకా… సూపర్ హిట్ కేరక్టర్ ఆమె… తెలుగు యూట్యూబ్ స్టార్ హీరోయిన్ ఆమె…
Ads
ఇప్పుడు ఆమె తమిళ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్ హీరోగా నటించే ఓ తమిళ సినిమాలో హీరోయిన్ చాన్స్ వచ్చిందనీ, ఆల్రెడీ ఆ సినిమా పనుల్లో బిజీ అయిపోయిందని ఓ వార్త… ఇంట్రస్టింగు… పవీష్ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే…

రొటీన్ సినిమా హీరోయిన్ల పాత్రలు అక్కర్లేదనీ, మంచి పాత్రలు దొరికితే తప్ప సినిమాల్లో చేయను అని గతంలో నాగదుర్గ చెప్పినట్టు గుర్తు… అలాగే ఏకంగా నాని సినిమా శ్యామ్ సింగరాయ్ పాత్ర కూడా వచ్చినట్టే వచ్చి పోయిందనీ వార్తలు చదివినట్టు యాది…

అలాంటిది నేరుగా ఓ తమిళ సినిమాలోకి, అదీ ధనుష్ క్యాంపులోకి ఎలా ఎంట్రీ ఇచ్చిందో గానీ ఇంట్రస్టింగు… అది రొటీన్ హీరోయిన్ పాత్రా..? ఏమైనా విశేష ప్రాధాన్యముందా..? చూడాలిక… ఆమెకు కొన్ని చాన్సులు వచ్చీ ఆమె వద్దనుకుంది కదా, మరి ఈ పాత్ర కథేమిటో ఆసక్తికరం…

కూచిపూడి, పేరిణి నేర్చుకున్న శాస్త్రీయ నృత్యకారిణి ఆమె… డాన్స్ స్కూల్ నడిపిస్తూ, డాన్స్‌లో పీహెచ్‌డీ కూడా చేస్తుందని సమాచారం… 1600 ప్రదర్శనలు, 70 వీడియో సాంగ్స్ చేసింది…
కాకపోతే తన పాపులర్ ఫోక్ స్టెప్పులకూ ఆ నాట్యాలకూ సంబంధం లేదు… దారపంటొత్తుండు పాటలో రెట్రో స్టయిల్ మేకప్పు, పోకడతో అదరగొట్టింది… అచ్చం సినిమా హీరోయిన్లలాగే… కొన్నిచోట్ల స్టేజ్ డాన్సులు కూడా చేసింది…

ఈ పవీష్ తమిళ సినిమా ఆమెకు సినిమాల్లో ఎంట్రీ ఏమీ కాదు… మూణ్నాలుగు నెలల క్రితం అనుకుంటా… కలివి వనం అనే సినిమాలో చేసింది… టీజర్ కూడా విడుదల చేశారు… ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ, అడవుల నరికివేత కాన్సెప్టుతో బాగానే ఉంది…

నాగదుర్గ పాత్ర కూడా ఇంట్రస్టింగే అనిపించింది… టీజర్ చివరలో కాంతారా టచ్‌లో ఓ దైవనర్తకుడి ఊఊఊఊల యాడ్ చేసి వదిలారు… వనజీవి రామయ్య స్పూర్తితో తీసిన సినిమా అది… అది రిలీజైందా, ఏమైందో తెలియదు కానీ… తమిళంలో రాబోయే ఆమె సినిమా సక్సెస్ కావాలనే కోరుకుందాం… ఐతే… కేవలం డాన్సులు మాత్రమే ఓ సినిమా హీరోయిన్‌ను నిలబెట్టలేవు… అదొక్కటీ గుర్తుంచుకుంటే చాలు…!!

Share this Article