Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

…. అలాంటి నాగార్జున సడెన్‌గా యాక్షన్ హీరో అనేసరికి మేమంతా షాక్’’

November 8, 2025 by M S R

.

కొన్ని స్నేహాలు… ఎప్పుడో క్లాస్‌మేట్లుగా ఉండి… తరువాత భిన్న రంగాల్లో సెలబ్రిటీలుగా ఎదిగి… ఎప్పుడో ఓసారి కలిసినప్పుడు పంచుకునే ముచ్చట్లు… ఆహ్లాదాన్ని, పాజిటివిటీని నింపుతాయి…

వచ్చే 14న ‘శివ’ సినిమా రీరిలీజ్… 4కే డాల్బీ అట్మాస్ వెర్షన్‌ను ఏఎన్ఆర్ జయంతిన… సరే, మళ్లీ మళ్లీ ఆ సినిమా గురించి చెప్పుకోవడం కాదు ఇది… అప్పట్లో నాగార్జున, క్రికెటర్ శ్రీకాంత్ స్నేహం గురించిన కొన్ని ముచ్చట్లు గుర్తొచ్చి…

Ads

శ్రీకాంత్ తెలుసు కదా… 1983 వరల్డ్ కప్ హీరోల్లో తనూ ఉన్నాడు… మన ఓపెనర్… డ్యాషింగ్ బ్యాటరే… జోవియల్ కేరక్టర్ కూడా..! ఇప్పటి కోహ్లీ, రోహిత్, ధోని తరం ప్రేక్షకులకు శ్రీకాంత్ తెలియకపోవచ్చుగాక, కానీ అప్పట్లో తను పెద్ద క్రికెట్ స్టార్…

నాగార్జున, క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్… ఈ ఇద్దరు దిగ్గజాలు చెన్నైలోని గిండీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదువుకున్నారు… వారిది నాలుగు గోడల మధ్య మొదలైన స్నేహం, కానీ కాలేజీ బయట వారిద్దరి పబ్లిక్ ఇమేజ్ మాత్రం పూర్తిగా వేరుగా ఉండేది…

శ్రీకాంత్ వ్యాఖ్యలు (నాగార్జున సూపర్ స్టార్ అయ్యాక)…:

  1. వెనుక బెంచ్‌ ముచ్చట…: “నాగార్జున ఇప్పుడు ‘కింగ్’ కావచ్చు, కానీ కాలేజీలో మా వెనుక బెంచ్‌లోనే కూర్చునేవాడు... కాలేజీలో అతను చాలా కామ్‌గా, సైలెంట్‌గా, ఒద్దికగా ఉండేవాడు… ఎక్కువ మాట్లాడేవాడు కాదు…”
  2. యాక్షన్ హీరోగా షాక్…: “మా క్లాస్‌మేట్, సైలెంట్‌గా ఉండే నాగ్… ఉన్నట్లుండి ‘శివ’ సినిమాతో యాక్షన్ హీరో అయిపోయేసరికి మేమంతా షాక్ అయ్యాం! అతనిలోని ఆ కోణం చూసి ఆశ్చర్యపోయాం…”
  3. పాపులారిటీ పోలిక (సరదాగా)…: “మా మధ్య అప్పట్లో పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు…” (అంటే నాగార్జున స్టార్ అయినా తన పాత స్నేహితుడే అని సరదాగా చెప్పేవాడు)…

 

నాగార్జున దృష్టిలో శ్రీకాంత్: ‘క్రేజ్’ కింగ్‌తో క్లాస్‌మేట్!

నాగార్జున వ్యాఖ్యలు (శ్రీకాంత్‌తో కలిసి ’83’ సినిమా ప్రమోషన్స్‌లో)

  1. క్రికెట్ క్రేజ్ కింగ్..: “నేను, శ్రీకాంత్ క్లాస్‌మేట్స్‌గా ఉన్నప్పుడు, అప్పటికే శ్రీకాంత్ ఒక స్టార్ క్రికెటర్‌గా చాలా పాపులర్… అతని క్రేజ్ ముందు నేను ఎవరనేది ఎవరికీ తెలియదు… కాలేజీలో అంతా శ్రీకాంత్ చుట్టూనే ఉండేవాళ్ళు…”
  2. సిక్సర్ల ముచ్చట…: “శ్రీకాంత్ గేమ్స్, క్రికెట్ ఆడుతున్నప్పుడు మేమంతా స్టేడియంలో కూర్చొని చూసేవాళ్లం… మా తల పైనుంచి సిక్సులు వెళ్తుండేవి…” అని ఆ రోజుల్లో శ్రీకాంత్ ఆటను గుర్తుచేసుకున్నాడు…
  3. కాలేజీలో వైరుధ్యం…: “శ్రీకాంత్ నన్ను సైలెంట్‌గా ఉంటావని చెప్పాడు… తను మాత్రం ఎప్పుడూ అలా లేడు… తన ఆటతో ఎప్పుడూ అందరి దృష్టినీ ఆకర్షించేవాడు…” అని తమ కాలేజీ రోజుల్లో శ్రీకాంత్ చురుకుదనం గురించి వివరించాడు…

నాగార్జున కామెంట్స్… తాను నటుడిగా స్టార్‌డమ్ తెచ్చుకోవడానికి ముందే, తన క్లాస్‌మేట్ శ్రీకాంత్ అప్పటికే క్రికెట్ ప్రపంచంలో ఎంతటి స్టార్‌డమ్ అనుభవించాడో స్పష్టం చేస్తాయి… ఇద్దరూ బ్యాక్ బెంచర్లే… సో, డోన్ట్ అండర్ ఎస్టిమేట్ బ్యాక్ బెంచర్స్… బ్యాక్ బెంచుల్లో కూర్చుంటున్నారూ అంటే, తమ రాబోయే భిన్నరంగాల విజయాలను లిఖించుకుంటూ ఉన్నారన్నమాట..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చంద్రబాబు ప్రమోట్ చేశాడు… టేస్ట్ అట్లాస్ కూడా తప్పనిసరై గౌరవించింది…
  • ఇద్దరు వీరోయిన్లతో చిరంజీవి కిందామీదా పడి దొర్లినా… ప్చ్, పాపం..!!
  • 82వ ర్యాంకు కాదు…! 2, 3 ఏళ్లలో వరల్డ్ టాప్-20 లిస్టులోకి హైదరాబాద్..!!
  • ధర్మేంద్ర కుటుంబానికి బ్రిటిష్ రాజవంశంతో చుట్టరికం..! ఎలా..?!
  • సాంబ, మూర్తి, వెంకటకృష్ణ… వీళ్లే హైదరాబాద్ ప్రేక్షకులకు ఇష్టులు..!!
  • అడ్డగోలు దందా బీఆర్ఎస్ హయాంలో..! బురద జల్లేది ఈ ప్రభుత్వంపై..!!
  • మీడియా జీవితాలను, కుటుంబాలను నిలబెట్టగలదు… ఇవి అవే స్టోరీస్…
  • సర్‌ప్రయిజ్ అప్పియరెన్స్..! ఈ తెలంగాణ ‘బతుకమ్మ’ గుర్తుందా మీకు..?!
  • యాక్షన్ లేదు, ఆధార్ బ్లాకూ లేదు… ఈ వివాదం పూర్వపరాలు ఇవీ…
  • మిస్టర్ కీరవాణీ… ఈ వారణాసి లవ్ సాంగ్ వీడియో నువ్వైనా చూశావా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions