సమంత పోస్ట్ చేసిన ఒక ఫోటోను చూసి అంకుల్ నాగార్జున కోపగించాడా..? అందుకే సమంత లెంపలేసుకుని వెంటనే పోస్ట్ డిలిట్ చేసి సైలెంట్ అయిపోయిందా..? ఇదీ టాలీవుడ్ తాజా చర్చ… బాస్ కస్సుమన్నాడు కాబట్టే, సమంతే స్వయంగా డిలిట్ చేసుకుంది కాబట్టి… సమంత వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, ఫైర్ బ్రాండ్ చిన్మయి దగ్గర్నుంచి మన అనసూయ వరకూ కిక్కుమనడం లేదు… లేకపోతే ఈ ఫోటో పోస్టుపై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లపై భగ్గుమనేవాళ్లేమో… ఇందులో తప్పేముంది..? వల్గారిటీ ఏముంది..? ఆమె స్వేచ్ఛకు అడ్డుపడతారా..? అంటూ ఉల్టా దాడికి దిగేవాళ్లేమో… నిజానికి ఇది ఓ గాసిప్ తరహాలో చదవాల్సిన వార్త కాదు… ఇంకాస్త ఎలాబరేట్ చేసుకోవాలి… ఎందుకంటే..? సమంతకు నాగార్జున చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు, పోనీ, తనే తీసుకుంది అనుకుందాం… కానీ సమంత కొన్ని గీతలు దాటుతోందా..? ఆమె మాయలో ఉన్న చైతూ కారణంగా నాగార్జున ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడా..?
ఇదుగో ఈ ఫోటోయే సమంత డిలిట్ చేసింది… ఫోటోలో ఉన్న యువకుడు ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్… తన ఒడిలో కాళ్లు పెట్టుకుని రిలాక్స్ అవుతోంది… నవ్వుతోంది… ఒక ఎంప్లాయర్కూ, ఒక ఎంప్లాయీకి నడుమ ఉన్న బంధంలా లేదు… ఇద్దరి మధ్య మంచి చనువు ఉన్నట్టు ప్రతిఫలిస్తోంది… నాలుగేళ్లుగా ఆమె దగ్గర తను పనిచేస్తున్నాడు… ఈ ఇన్స్టాగ్రాం పోస్ట్ మీద అక్కినేని ఫ్యాన్స్ భగ్గుమన్నారు… వాళ్లకు ఎక్కడో కలుక్కుమన్నట్టుగా ఉంది ఫోటో… సో, విషయం నాగార్జున దాకా వెళ్లడం, తరువాత ఆమె డిలిట్ చేయడం చకచకా జరిగిపోయాయి…
మొదట్లో సమంతతో చైతూ పెళ్లికే నాగ్ అంగీకరించలేదు… తనకు సినిమా తారలతో ఉన్న బంధాలు ఇక్కడ అప్రస్తుతం… కానీ తనే స్వయంగా ఓ హీరోయిన్ను పెళ్లి చేసుకున్నాడు… చైతూ పట్టుదల కారణంగా నాగ్ దిగివచ్చి సమంత-చైతూ పెళ్లికి వోకే అన్నాడు… ఆమె తన మత సంప్రదాయాల మేరకు పెళ్లి జరగాలని అడిగితే… రెండు మతాల సంప్రదాయాల్లోనూ పెళ్లి తంతు జరిపించాడు… కానీ ఆమె తన చుట్టూ కొన్ని గీతలు గీసుకోవాలని కోరుకున్నాడు… ఎందుకంటే, ఆమె అక్కినేని కుటుంబంలోకి కోడలిగా వచ్చింది… ఆమె ఎప్పుడూ దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలనేది నాగ్ కోరిక… అమల కూడా అంతేగా… పెళ్లయ్యాక ఆమె మళ్లీ తెర మీదకు రాలేదు… ముందస్తుగా కుదిరిన ఒప్పందం కావచ్చు… కానీ సమంత పెళ్లి తరువాత కూడా నటిస్తోంది… కాకపోతే అల్లరి చిల్లర వేషాలు గాకుండా కాస్త హీరోయిన్ సెంట్రిక్, పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ ఎట్సెట్రా… అలాంటి సినిమాలు పెద్దగా దొరకవు కాబట్టి టాక్ షోలు చేసుకుంటోంది…
Ads
అసలు వీళ్లే కాదు… ఏ సినిమానటి పెళ్లయినా సరే, వెంటనే సినిమాలు బంద్ అయిపోతయ్… అప్పటివరకూ ఆమె ఏం చేసిందో, ఎలా ఉందో అనవసరం… ఇండస్ట్రీలో ఎంత పాపులర్ అనేదీ అనవసరం… పెళ్లయ్యాక ‘పద్ధతి’గా ఉండాలని ఆంక్షలు మొదలవుతయ్… మళ్లీ ఎప్పుడో పిల్లలు కాస్త పెద్దగయ్యాక, సెకండ్ ఇన్నింగ్స్ అని వదినలు, తల్లుల పాత్రలకు వస్తుంటారు… నాన్సెన్స్, ఇవేం ఆంక్షలు అనే చర్చ ఎలా ఉన్నా… వర్తమానంలో జరుగుతున్నది మాత్రం ఇదే… వాళ్లతో పోలిస్తే సమంత కాస్త బెటర్… ఆమె బహిరంగంగా ఎలాంటి పోస్టులు పెట్టినా, ఫోటోలు పెట్టినా అక్కినేని ఫ్యామిలీ నుంచి పెద్దగా అభ్యంతరాలు రానట్టున్నయ్… కానీ ఈ ఫోటో ఆ కుటుంబానికి ఇబ్బందికరంగా ఉండటం, నాగ్ ఫ్యాన్స్ కూడా అదే ఫీలవడంతో సమంతకు ఇక తప్పనిసరైంది… డిలిట్ కొట్టేసింది…! ఈ ఫోటోపై చైతూకు కూడా తలవాచిపోయి ఉంటుంది…!!
Share this Article