Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం నాగార్జున… చివరకు ఆ ఆదిరెడ్డికీ లోకువ చేసిన బిగ్‌బాస్ టీం…

November 20, 2022 by M S R

ఫాఫం నాగార్జున… మళ్లీ అదే అనాలనిపిస్తోంది… నిన్నటి షో చూశాక మరింత బలంగా ఇలాగే జాలేసింది… అసలు ఈ సీజనే పరమ చెత్త… ఈ దరిద్రం ఎప్పుడు అయిపోతుందా అని ఆ టీమే ఎదురుచూస్తున్నట్టుగా ఉంది… సరే, ఈ సీజన్ దివాలా తీసింది సరే… ఎలాగోలా పూర్తి చేసి, చేతులు దులుపుకుంటే సరిపోతుంది కదా… లేదు, మధ్యలో నాగార్జున పరువు తీస్తున్నారు… తనకేమో ఇదంతా సమజైతలేదు…

బిగ్‌బాస్ టీం నాగార్జునను పూర్తిగా మిస్ లీడ్ చేస్తోంది… తనేమో బిగ్‌బాస్ చూడడు… టీం రాసిచ్చిన వివరాలను బట్టి వీకెండ్ షోలు నడిపిస్తాడు… సరే, ఇదీ ఓ సినిమా అనుకుందాం… కానీ చూసే ప్రేక్షకులు తనను చూసి నవ్వుకుంటున్నారనే సోయి కూడా లేకపోతే ఎలా..? చివరకు ఓ కామనర్‌గా ఈసారి హౌజులో ప్రవేశపెట్టిన ఓ యూట్యూబ్ రివ్యూయర్ ఆదిరెడ్డికి కూడా బిగ్‌బాస్ టీం కన్విన్సింగ్ జవాబు చెప్పించలేకపోయింది నాగార్జునతో… నిజానికి తను బలమైన కంటెస్టెంటే కాదు, ఐనాసరే లాజిక్ మాట్లాడాడు… బిగ్‌బాస్ టీంకు చిర్రెత్తినట్టుంది… ఇక శనివారం సగం ఎపిసోడ్ ఆదిరెడ్డి మీద దాడితోనే సరిపోయింది… ముందుగా ఒక పిచ్చి కథ చెప్పించారు నాగార్జునతో…

అసలు అదెలా సమంజసం..? ఆదిరెడ్డి లేవనెత్తిన సందేహాలకు నివృత్తి అవసరం గానీ… దబాయించి, కూర్చోబెట్టడం ఒక హోస్టు పరువు తీసేదే తప్ప, పెంచేది మాత్రం కాదుగా… నాగార్జున పూర్తిగా సైడ్ ట్రాక్‌లోకి వెళ్లిపోయింది ఎక్కడంటే… ఒక గేమ్ పెట్టింది బిగ్‌బాస్ టీం, అందులో గెలిస్తే ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తుంది… ఆ పాస్ ఉపయోగించి, ఇంటి నుంచి వెళ్లిపోయే సభ్యులను కాపాడవచ్చు… నాకు ఉపయోగపడని పాస్ కోసం, ఎవరి కోసమో ఉపయోగపడే పాస్ కోసం నేనెందుకు కష్టపడాలి అని ఆదిరెడ్డి ప్రశ్న… రీజనబుల్…

Ads

హౌజులోకి వచ్చిందే ఎవరైనా సరే, వాళ్ల గెలుపు కోసం… ఇంకెవరికో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగపడే పక్షంలో తనెందుకు కష్టపడాలి… సింపుల్ లాజిక్… నాగార్జునకు ఆదిరెడ్డి సూటిగానే చెప్పాడు… దీనికి ఆడాలనే స్పిరిట్, గెలవాలనే సంకల్పం అవసరం అంటూ ఏదేదో చెప్పబోయి, ఇదేదో సరిగ్గా లేదని తనే అనుకుని… నువ్వు బిగ్‌బాస్‌కన్నా తోపువా, తురుమువా అని దబాయింపులకు దిగాడు నాగార్జున… బిగ్‌బాస్‌ను తప్పుపట్టడం మానెయ్ అన్నాడు… ఇలా చేసి గీతూ బయటికి పోయింది అని ఉదాహరణ తీసుకున్నాడు… అంటే ఆమెను పంపించినట్టే, నిన్ను కూడా బయటికి పంపిస్తాం అని బెదిరిస్తున్నట్టా..?

మేం గేటు తీసి పంపించాల్సిన పనిలేదు, ఆడియెన్సే వచ్చి గేట్లు తెరిచి, బయటికి తీసుకుపోతారు అని మరో విసురు… ఒక ప్రశ్నకు జవాబు చెప్పలేక ఇన్ని అవస్థలా..? ఓ వీడియో చూపించి ఆదిరెడ్డి మాట్లాడింది తప్పు అంటాడు నాగార్జున… సర్, ఎడిటెడ్ వెర్షన్ కాదు, మొత్తం వీడియో చూపించండి అని అడిగాడు ఆదిరెడ్డి… ప్చ్, దానికీ నాగార్జున నుంచి సమాధానం లేదు… మొహం మాడ్చుకుని, ఆదిరెడ్డి చివరకు తనే సైలెంటు అయిపోయి కూర్చున్నాడు… ఈసారి ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యాడు, పర్లేదు… కానీ…

వచ్చేవారం తన మెడపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతున్నట్టే భావించాలి… ఏదో దిక్కుమాలిన ఇమ్యూనిటీ అనే సిస్టం పెట్టి, ప్రైజ్ మనీలో ఎలా కోత పెట్టబోతున్నారో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా… దానికితోడు ఈ తలకుమాసిన పిచ్చి తర్కాలతో, బెదిరింపులతో కంటెస్టెంట్లను అదరగొడితే ఇక అదేం ఆట..? దానికి ఇంత ఖర్చు దేనికి..? ఈసారి మెరీనాకు స్పాట్ పెట్టినట్టున్నారు… బయటికి పంపించేసినట్టున్నారు… దానికీ ఏదో స్కెచ్, పనికిమాలిన వ్యూహం ఉండే ఉండవచ్చు… అంతా బిగ్‌బాస్ టీం ఏదనుకుంటే అది… జనం వోట్లు మన్నూమశానం పెద్ద హంబగ్…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions