ఎందుకో బిగ్‌బాస్5 వీకెండ్ షోకు వచ్చిన నాగార్జున మరీ డల్‌గా కనిపించాడు… జోష్ లేదు ఏమాత్రం… ఏదో వచ్చానా, షో చేశానా, వెళ్లానా అన్నట్టుగా కనిపించింది తన వైఖరి… అంతేలెండి, ఆ షో చూస్తున్న ప్రేక్షకుల్లాగే తను కూడా…! ఎందుకో ఈసారి ఆ షో మీద ప్రేక్షకుల్లో పెద్ద ఆసక్తి కనిపించడం లేదు… అసలు మూడు, నాలుగో సీజన్ల నుంచే ఈ షో మీద ఇంట్రస్టు పోతూవచ్చింది జనానికి..! సరే, ఇంకా మొదటి వారమే కదా, రాను రాను రేటింగుల కోసం బిగ్‌బాస్ ఎన్ని లవ్వు ట్రాకులు పెడతాడో, ఎన్ని తగాదాలు పెడతాడో, ఏమేం వేషాలు వేస్తాడో చూద్దాం… కానీ మొదటివారం ఓసారి మనం కూడా పైపైన పరిశీలిస్తే… కొన్ని అంశాలు ప్రముఖంగా కనిపిస్తాయి…
- లోబో సరదాగా, స్పాంటేనియస్‌గా జోకులేస్తూ, అందరితో కలుపుగోలుగా ఉంటూ ఎంటర్‌టెయిన్ చేస్తున్నాడు… అది తన సహజతత్వమే కాబట్టి అదలాగే కొనసాగుతుంది…
- యాంకర్ రవి తను ఏదో షోకు యాంకరింగ్ చేస్తున్నాననే ఫీలింగులో ఉన్నట్టున్నాడు, నేనెలాగూ ముందే మాట్లాడుకుని వచ్చాను, ఇంకా చాలా కథ నడపాల్సి ఉంది నేను, ట్రోఫీ నాదే అన్నట్టుగా ఉన్నాడు… అందరికీ సర్దిచెబుతూ, మోడరేటర్‌లా వ్యవహరిస్తున్నాడు… కాస్త ఓవర్ అనిపిస్తోంది…
- ఉమాదేవి ఇంకా విసిగించడం ఖాయం… త్వరలో వెళ్లిపోవడమూ ఖాయమే… ఆమెకు టాక్ట్‌ఫుల్‌గా ఎలా మెదలాలో తెలియదు…
- పింకీ అలియాస్ ప్రియాంక… చాలా బెటర్… పాత సీజన్‌లో తమన్నా టైపు కాదు… తను అందరితో కలివిడిగా, మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తోంది…
- జెస్సీ డల్, డిమ్… ఆకారపుష్టి అన్నట్టుగా… ఎందులోనూ ఇన్వాల్వ్‌మెంట్ లేదు, దూకుడు లేదు, చొరవ లేదు, అసలు యాక్టివిటీయే లేదు… పైగా ఎవరో ఏదో అన్నారని జైలులో కూర్చుని ఏడ్చిన తీరు పాత సీజన్ శోకదేవతల్ని గుర్తుచేసింది… ఇవి మగశోకాలు…
- యానీ మాస్టర్ సున్నితంగా, ఎవరితోనూ ఏ తగాదా రావద్దు అన్నట్టుగా వ్యవహరిస్తోంది… రియల్ లైఫులో కూడా ఆమె అలాగే… కానీ బిగ్‌బాస్ హౌజులోకి వచ్చాక అది కుదరదు, కైలాట్కం తప్పదు, ‘సబ్ కా దోస్త్’ ధోరణి నై చల్తా…
- యానీ మాస్టర్‌లాగే ప్రియ… కుదురుగా, పద్దతిగా కనిపిస్తోంది… కిచెన్‌లో ఫిక్సయిపోయింది… ఈమె కూడా అందరూ నావాళ్లే అనే ధోరణిని వదిలిపెట్టకతప్పదు… అసలు పంచాయితీలు మొదలయ్యేవే కిచెన్‌లో…
- సిరి తొలిరోజు ఉన్నంత హుషారుగా లేదు, ఓవర్ ఎమోటివ్… ఉన్నవాళ్లలో తీసిపారేయదగిన కేరక్టర్ మాత్రం కాదు…
- సరయూ కావాలని ఒకరిద్దరితో గిల్లికజ్జాలు ట్రై చేసింది కానీ వర్కవుట్ కాలేదు…
- శ్వేత కూడా డిమ్, కామ్… కానీ అలా కుదరదు, బిగ్‌బాస్ కుదరనివ్వడు… మారలేకపోతే మధ్యలోనే ఖేల్ ఖతం…
- నటరాజ్, సన్నీ, మానస్… ఓవరూ కాదు, ఇన్‌యాక్టివూ కాదు… రవిని తమకు ప్రధాన పోటీదారుగా భావిస్తున్నారు… తరచూ రవితో కెలుకుడు గేమ్స్ తప్పవు…
- విశ్వ యాక్టివ్… ఇంకాస్త పరిశీలన అవసరం తన మీద… శ్రీరామచంద్ర డల్…
- ఆర్జే కాజల్… వెరీ యాక్టివ్… పనిచేయదు, అందరి మధ్య దూరిపోతుంది అని ఆమె మీద హౌజ్‌మేట్స్ కంప్లయింట్… కానీ అది ఆమెకు తెలియక కాదు, తెలిసే చేస్తున్నది… మంచి గేమ్ ప్లాన్‌తోనే వచ్చింది… హౌజులో ఇలాంటివాళ్లుంటేనే మజా… హమీదా కూడా కాస్త యాక్టివే కానీ, కాజల్ అంత దూకుడు లేదు…
- లహరి పర్లేదు, కొన్నాళ్లు ఉండొచ్చు… షణ్ముఖ్ వెరీ డల్…!!
Share this Article
Ads