అనుకున్నట్టే జరిగింది… శివాజీకి గట్టిగా తలంటాల్సిన నాగార్జున ఎనలేని ప్రేమతో తమలపాకుతో అత్యంత సుతారంగా అంటినట్టు నటించాడు… తనను నెత్తిన మోస్తున్న నాగార్జున మరోసారి ఇజ్జత్ పజీత చేసుకున్నాడు… అనగా మళ్లీ పరువు పోగొట్టుకున్నాడు… అంతేనా..? కాసేపు వేరే డ్రామా…
తనకు భుజం నొప్పి తిరగబెట్టింది… అది డ్రామా కాదు… బిగ్‌బాస్ లోపలకు పిలిచి, ఇలాగే ఆడితే రిస్క్ ఉంది, రాబోయే రోజుల్లో ఇంకా సీరియస్ కావచ్చునని డాక్టర్లు చెబుతున్నారు, ఇక నీ ఇష్టం, రిస్క్ భరిస్తానంటే కొనసాగు, లేదంటే బయటికి వెళ్లిపో అన్నాడు… అక్కడికి తనేదో సీరియస్ ఆట ఆడుతున్నట్టు..! సోఫాలో పడుకోవడం లేదా కూర్చోవడం, వెగటు నవ్వుతో అందరి మీదా నోరు పారేసుకోవడం, వెంట ఓ ఇద్దరు పాలేర్లతో పెద కామందు వేషాలు…
ముందేమో ఆడతాను అంటాడు… తరువాత నన్ను పంపించెయ్యండి, వంద శాతం నా పర్‌ఫామెన్స్ ఇవ్వలేను అంటాడు… తీరా నాగార్జున మళ్లీ రూంలోకి పిలిచి, పర్లేదు, సోగ్గాడు సినిమా సమయంలో నాకూ ఇదే ప్రాబ్లం… ఆడేసెయ్ అన్నాడు… శివాజీ సై అన్నాడు… అరగంట దాకా ఇదే… శివాజీ మీద ప్రేక్షకుల సానుభూతిని జమచేయడం కోసం నాటకం…
Ads
నిజంగానే కంటెస్టెంట్ల ఆరోగ్యం మీద అంత శ్రద్ధ ఉన్నట్టయితే… అమర్ దీప్ రోజూ రెండు ఐవీ ఫ్లూయెడ్స్ ఎక్కించుకుంటున్నట్టు ఇదే నాగార్జున బాబుగారు చెప్పాడు కదా… మరి ఈ సానుభూతి ప్రహసనం బాపతు ఫాయిదా అమర్ దీప్‌కు ఎందుకు దక్కకూడదు..? అశ్వినికి ఏదో ప్రాబ్లం… మొత్తం హౌజే అనారోగ్యంతో ఉంది… ఆ వాతావరణం ఆరోగ్యమే కలుషితమైంది…
ఒకవైపు నాగార్జున మాట్లాడుతూనే ఉన్నాడు… ప్రియాంక మీదకు ఎగిరాడు శివాజీ… నువ్వు మొదటి నుంచీ ఇంతే, చెబితే వినవు అంటాడు… నువ్వెవరు చెప్పడానికి..? ఆమె ఆట ఆమె ఇష్టం… అమర్‌దీప్‌కు మాటిచ్చి తప్పావు కదా అని నాగార్జున సుతిమెత్తగా, తనే భయపడుతూ అడిగాడు… డిప్యూటీ కెప్టెన్లుగా ప్రియాంక, శోభల్ని ఎంచుకున్నాడు, అందుకే మాట మార్చాను అంటాడు… కానీ తనేమో యావర్, ప్రశాంత్‌లను పెట్టుకోవచ్చు, అందులో తప్పులేదు… అది నాగార్జున అడగలేడు…
కడిగేయాల్సిన శివాజీని వదిలేసి నాగార్జున అమర్‌దీప్‌ను దబాయించి తప్పుపడతాడు… ఇంకోవైపు ప్రియాంక నోరు మూయిస్తాడు… ప్రియాంక మీద నోరుపారేసుకున్న యావర్‌ను కూడా గట్టిగా మందలించలేడు నాగార్జున… కారణమేంటంటే తను శివాజీ మనిషి… శివాజీకి కోపం రావద్దు… ఇదేం హౌజుర భయ్… మొత్తం పక్షవాతమే… సారీ, పక్షపాతమే… శివాజీ మీద ఈ అవ్యాజ అనురాగానికి కారణమేంటి నాగార్జున బాబు గారూ…
శివాజీని హౌజులో అందరూ గౌరవించాలట… మిస్టర్ శివాజీ అని కూడా అనొద్దట… శివాజీ గారు లేదా శివన్న అనాలట… అసలు ఈ ఏజ్ బార్ కంటెస్టెంట్లు, ఇగోయిస్టిక్ కంటెండర్లే హౌజుకు పెద్ద సమస్య… మాటిమాటికీ మీరు ఒక్కటై ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు, ఇకపై ఎవరి గేమ్ వాళ్లు ఆడండి అని దబాయించాడు నాగార్జున… మరి అది యావర్, ప్రశాంత్, శివాజీకి వర్తించదా..? ఈసారి మరీ దిక్కుమాలిన సీజన్ చూపిస్తున్నారు కదా బాబు గారూ… ఖర్చు కలిసొస్తుంది, శివాజీకి కప్పు ఇచ్చేసి హౌజ్ మూసేయడం బెటర్ కదా…
అనుకున్నట్టుగానే సెల్ఫ్ గోల్ చేసుకుని అశ్విని నిష్క్రమించింది… నిష్క్రమణకు అర్హురాలే… ఎలాగూ ఎవిక్షన్ పాస్ ఈవారం ఎవరికీ ఇవ్వను అన్నాడు కదా ప్రశాంత్… సో, ఆదివారం రతిక నిష్క్రమణ… ఇక మిగిలింది ఇద్దరే, ప్రియాంక, శోభ… నాగార్జున మద్దతు చూసుకుని ఇక రాబోయే రోజులు వాళ్లిద్దరినీ విపరీతంగా సతాయిస్తారు మగ జెంట్ కంటెండర్లు… ఆల్‌రెడీ బెదిరించి ప్రియాంక, శోభ దోస్తీని కూడా కత్తిరించారు కదా…!!
Share this Article