చివరకు నాగార్జున తన ఇజ్జత్ పోగొట్టుకున్నాడు… బిగ్‌బాస్ టీం చెత్తా నిర్ణయాలు, తనతో పలికించే మాటలే కావచ్చుగాక, కానీ ఓ హోస్టుగా తనకంటూ ఓ విచక్షణ, వివేకం ఉండాలి కదా… ఒక విషయంలో నాగార్జున చెప్పిన మాటలు, చేసిన వాదనతో తన పరువు వంద శాతం మూసీలో కలిసిపోయింది… బిగ్‌బాస్ ప్రోగ్రాంతో తనకు పారితోషికం, స్టూడియోకు రెంట్ భారీగా వస్తుండవచ్చుగాక… కానీ ఓ పెద్దమనిషిగా భ్రష్టుపట్టిపోయాడు ఈ దసరా స్పెషల్ షోతో…
అసలు తనకు హోస్టింగ్ అంటే తెలుసా అనే డౌట్ వచ్చింది తొలిసారిగా… బిగ్‌బాస్ ఆట అంటే ఏమిటో గీతుకు తెలిసినంత కూడా నాగార్జునకు తెలియదు… ఇది పక్కా వాస్తవం… ఒక ఉదాహరణ చూద్దాం… శనివారం చంటి అనే ఆ తిక్క కేరక్టర్‌ను ఇకపై ఈ సీజన్‌లో అస్సలు కెప్టెన్సీ టాస్క్‌కు పోటీపడకుండా నిషేధించారు… దానికి కారణం కీర్తి వేసిన నెగెటివ్ వోటు… తను ఎలాగూ ఆట ఆడడు… కామెడీ చేతకావడంలేదు… యాక్టివ్‌గా ఉండటం లేదు… పైగా అన్నీ వాట్ల మాటలతో ఎదుటివాళ్లను హర్ట్ చేస్తుంటాడు…
ఒక సందర్భం ఏమిటంటే… హౌజులో కీర్తి ఓ విధేయురాలైన కోడలు టైపు… సైలెంటుగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది… ఓసారి అలా చేసుకుంటుంటే ఇదే చంటి కీర్తి కెమెరాల కోసం చేస్తోంది అన్నట్టు ఏదో ఓ పిచ్చి కామెంట్ విసిరాడు… అక్కడికి అందరూ పెద్ద శుద్దపూసలైనట్టు…! ఆ కామెంట్‌ను గీతు, ఆరోహి కీర్తికి చెప్పారు… అది ఆమెను హర్ట్ చేసింది… సహజం… ఇక్కడ నాగార్జున ఎంత దరిద్రంగా బిహేవ్ చేశాడంటే..? ఆల్‌రెడీ శనివారం ఆ ఎపిసోడ్ అయిపోయిందిగా… మళ్లీ దసరా స్పెషల్ షో అంటూ మూడున్నర గంటలు చావబాదిన వీకెండ్ షోలో మొదట్లోనే ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు…
Ads
ఆరోహి, ఆర్జే సూర్య కుటుంబీకుల నుంచి ఏమైనా ప్రెజర్ వచ్చిందో ఏమిటో తెలియదు గానీ… వాళ్ల ప్రేమను ఓవర్ ఎక్స్‌పోజ్ చేయాలనుకున్న బిగ్‌బాస్ మళ్లీ రూటు మార్చి, ఆ ఇద్దరికీ ఏమీలేదు, ఇద్దరికీ బయట వేర్వేరు లవర్స్ ఉన్నారనే కలర్ ఇచ్చాడు… భయపడ్డాడు… అదే భయం చంటి విషయంలోనూ… నాగార్జున కెప్టెన్సీ టాస్క్ నిషేధం అనగానే చంటి విసురుగా వెళ్లిపోవడం కనిపించింది… సో వాట్..? బిగ్‌బాస్ చివరకు చంటికి కూడా భయపడాలా..? ఒక్కసారిగా రూటు మార్చి, కీర్తిదే తప్పు, చంటి తప్పేమీ లేదు, శుద్ధపూస అని జనానికి చెప్పే ప్రయత్నం చేశారు…
చెప్పుడు మాటలు వినవద్దు, విన్నాసరే సంబంధిత వ్యక్తులతో కన్‌ఫమ్ చేసుకోవాలి అని ఏవేవో నీతులు చెప్పించారు నాగార్జునతో… తప్పు… బిగ్‌బాస్ ఆట అంటేనే అది… చెప్పుడు మాటలు చెప్పేవాడు చెబుతాడు, అది గేమ్ స్ట్రాటజీ… నమ్మాలా వద్దా అనే తెలివి సదరు కంటెస్టెంటుకు ఉండాలి… నిజానికి చంటి చేసింది పక్కా నెగెటివ్ వ్యాఖ్య… కీర్తిని వెక్కిరిస్తున్న వ్యాఖ్య… గీతు చెప్పిందే రైట్… (ఆ పిల్ల ఏదీ మనసులో దాచుకోదు… ఓపెన్, డైనమిక్… తను లేకపోతే సీజన్ 6 లేదు… అది పక్కా…)
చివరకు మూడునాలుగుసార్లు వీడియోలు చూపించినా సరే, చంటి మాటలే తప్పు అన్నట్టుగా చూపిస్తున్నాయి… ఐనా నాగార్జున గీతుదే తప్పు అన్నట్టుగా ఆడియెన్స్ (వాళ్లూ సెలెక్టెడ్ కదా) తో చెప్పించాడు… హౌజులోని నప్పతట్ల బాలాదిత్యతో ప్రవచనాలు చెప్పించాడు… కానీ ఆట స్పిరిట్ మాత్రం ఎవడికీ అర్థం కాలేదు… చంటి తప్పేమీ లేదు అని నాగార్జున పదే పదే హౌజ్ మెంబర్లతో కూడా నిర్బంధంగా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించినట్టు..? ఇదే ఇజ్జత్ పోగొట్టుకోవడం అంటే…!!
అందుకే డౌటొస్తున్నదీ అనడం… నాగార్జునకు అసలు హోస్టింగ్ తెలుసా అనడం…!! బిగ్‌బాస్ ఇంట్లో కొనసాగాలంటే బిగ్‌బాస్‌కు భయపడటం, నాగార్జున ముందు వంగీ, నంగి మాట్లాడటం కూడా గీతు దగ్గర లేదు… ఒకటీరెండు సందర్భాల్లో గీతు వాదన ఎదుట నాగార్జునే తెల్లమొహం వేయాల్సి వచ్చింది… అన్నింటికన్నా ముఖ్యంగా ఇప్పుడు నాగార్జున మీద ఓ క్రిమినల్ కేసు పెట్టొచ్చు… ఎందుకంటే..?
నిన్న చంటి గీతుకు ఓ పానీ పూరీ ఇచ్చాడు… అందులో పానీ లేదు, కానీ అందులో బోలెడంత ఉప్పు కూరి ఇచ్చాడు… బిగ్‌బాస్ షో బాధ్యులకు బుర్రల్లేవు… కానీ నాగార్జునకు ఏమైంది..? అదెలా తింటారు…? ఇది బిగ్ బాస్ ఆట అనుకున్నారా..? లేక ప్రాణాలతో ఆటా..!! ఒకవేళ గీతుకు బీపీ ప్రాబ్లమో, థైరో సమస్యో ఆల్‌రెడీ ఉండి ఉంటే…? అవి లేకపోయినా సరే, అంత ముడి ఉప్పు ఒక్కసారిగా ఒక మనిషి నోట్లో ఎలా కుక్కుతారురా ఇడియట్స్ అని బిగ్‌బాస్ టీం బాధ్యులను అడిగితే వాళ్ల దగ్గర సమాధానం ఉండదు… సర్, ఇలాగే తినలేను, నీళ్లు తాగుతూ తింటానని గీతు అడిగితే కూడా నాగార్జున ఒప్పుకోలేదు… ఏమిటీ క్రూరత్వం..?
ఆమె అప్పుడే వాష్ బేసిన్ వద్దకు పరుగెత్తింది… ఆ ఎపిసోడ్ జరుగుతున్నంతసేపూ అవస్థ పడింది… చంటి అనే ఓ ఎదవ కేరక్టర్ ఆమె మీద కక్ష ప్రదర్శిస్తున్నట్టుగా… కసికసిగా అంత ఉప్పు కూరితే, దాన్నెలా తినమంటారు..? చెత్తాగాళ్లు…! రాత్రి శ్రీహాన్ తనకు మిరియాల పాలు కలిపి ఇచ్చాడనీ, ఒకరు తలపట్టారనీ, నీళ్లు తాగుతూనే ఉన్నాననీ, రాత్రంతా నిద్ర లేదనీ, అవస్థ పడుతూనే ఉన్నానని చెబుతోంది గీతు… ఆమె కూడా పిచ్చిది కాకపోతే… అసలు దాన్నెందుకు తినడం..? రిజెక్ట్ చేయాల్సింది…
ఇంతా చేసి, ఇలా నీచంగా బిహేవ్ చేసిన చంటి మాత్రం కనీసం సారీ కూడా చెప్పలేదు… ఎంత ఇడియాటిక్ ప్రవర్తన..? వీళ్లా హౌజులో ఉండాల్సింది… పైగా తనను సమర్థిస్తున్నాడు, వెనకేసుకొస్తున్నాడు నాగార్జున… నిజంగా నువ్వు సిగ్గుపడాలి నాగార్జునా..!! నీ భార్య వీధి కుక్కలకూ నొప్పి కలగనివ్వదు… నువ్వేమో ఇలా contestants ప్రాణాలతో, ఆరోగ్యంతో ఆడుకుంటావా…? ఆ తిక్క చంటిని వెనకేసుకొచ్చి, ఆ విషపు పూరీ తిన్న గీతు బాధ గురించి అడగలేదేం… కనీస ప్రస్తావన లేదేం… దాన్నెందుకు డిబేట్ పెట్టలేదు… చిచీ…!!
Share this Article