.
ఇక నమస్తే తెలంగాణ పత్రిక దిగజారడానికి కొత్త లోతులు ఏమీ లేవు అనుకున్న ప్రతిసారీ అది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది… నేను దిగజారడానికి మరిన్ని పాతాళాల్ని నేనే అన్వేషించుకుని, రెట్టించిన దూకుడుతో కూరుకుపోతా అని నిరూపించుకుంటూనే ఉంటుంది…
దానిదొక చరిత్ర… యథా యజమాని, తథా పార్టీ… యథా పార్టీ తథా మైకులు… నమస్తే కూడా అంతే… సమకాలీన పాత్రికేయ ప్రపంచంలో దిక్కుమాలినతనంలో దాన్ని కొట్టే మీడియా లేదు… ఓ మిత్రుడు చెప్పినట్టు… దానికదే సాటి, కరపత్రాలకూ కొన్ని స్టాండర్డ్స్ ఉంటయ్, దానికి లేవ్, అదీ దాని గొప్పతనం అట…
Ads
తెలుగు పత్రికల విషయానికొస్తే… ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి… రెండు టీడీపీవి, ఒకటి వైసీపీది… ఐనా అవే టాప్ త్రీ ప్లేసులో ఉంటాయి… కారణం, తమ పార్టీలకు ఎంత విధేయ బాకాలూదినా సరే, మాస్ మీడియాగా కొన్ని పాత్రికేయ విలువల్ని, న్యూట్రల్ రీడర్స్ కోసమైనా పాతివ్రత్యాన్ని, ‘శీలాన్ని’ నటిస్తాయి… నమస్తే మరీ బరితెగింపు, బజారు ధోరణి…
ఉదాహరణ తాజాగా ఏముందీ అంటారా..?
ఇదీ దాని ఫస్ట్ పేజీ… (ఫస్ట్ పేజీలలో మొదటి ఫస్ట్ పేజీ… అర్థం కాలేదా..? తాపీగా చదవండి…) నిజానికి ఎంతటి దిక్కుమాలిన పత్రికకైనా సరే ఈరోజు బ్యానర్ వార్త ‘ఢిల్లీ ఎన్నికల ఫలితాలు’… జర్నలిజంలో ఓనమాలు నేర్చుకునేవాడైనా సరే, సగటు పాఠకుడైనా సరే ఈజీగా చెప్పగలిగే ప్రయారిటీ అది…
కానీ నమస్తే తెలంగాణ అనబడే కరపత్రం, సారీ, దీనికి సరైన పదం దొరకడం లేదు… ఫస్ట్ పేజీలో అసలు ఢిల్లీ ఫలితాల వార్తే లేదు… కాంగ్రెస్ మీద పడి ఏడ్వటం, రేవంత్ రెడ్డికి వ్యతిరేకతను బిల్డప్ చేయడం… అన్నీ అవే వార్తలు… సరే, ఏదో ఏడ్చారు అనుకుందాం…
ఈమధ్య పత్రికలకు యాడ్స్‌ను బట్టి అనేక ఫస్ట్ పేజీలు ఉంటున్నాయి కదా… ఈరోజు యాడ్స్ లేకపోయినా సరే నమస్తే రెండు ఫస్ట్ పేజీలను ఇచ్చింది… ఒకటి బీఆర్ఎస్ డప్పు… రెండోది కాస్త బెటర్… ఐనా ఢిల్లీ ఫలితాల్ని స్ట్రెయిట్‌గా గాకుండా… 2 శాతం తేడాతో ఆప్ ఓటమి అని ఓ బాష్యం… (లిక్కర్ స్కాంలో కవిత కోస్కామర్ కదా, అందుకని ఆప్ మనది, అదీ సానుభూతి…)
రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్ అంటూ మరో వార్త… హెహెహె అని రేవంత్ రెడ్డిని వెక్కిరిస్తున్నారు కదా… ఎలాగూ కాంగ్రెస్ జీరో సీట్లతో డకౌట్ అయ్యింది కదా… అదీ హేట్రిక్ కదా… ఆ కోణంలోనైనా బీజేపీ గెలుపు వార్తకు ప్రాధాన్యం ఇవ్వాలి కదా… ఇవ్వదు, ఇవ్వలేదు, ఎందుకంటే, అది కేసీయార్ తత్వంలాంటిదే కాబట్టి…
ఇటు తీవ్ర ద్వేషాన్ని, విషాన్ని కుమ్మరించాలి… పార్టీని, మోడీని బదనాం చేయాలి, పార్టీ ముఖ్యులను అరెస్టు చేయడానికి నానా డ్రామాలు నడిపించాలి… తీరా ఎన్నికల్లో ఓడిపోయి, ఎక్కడ రేవంతుడు కక్షగట్టి కత్తిదూసి వేధిస్తాడో అనే భయం… మరోవైపు కవిత లిక్కర్ స్కాం… ఢిల్లీ వెళ్లి రాయబారాలు, కాళ్లబేరాలు చేయాలి, ఇటు మళ్లీ తన పత్రికలో బీజేపీ ద్వేషం సరేసరి…
ఏం పొలిటికల్ లైన్‌రా బాబూ…;? ఇదుగో, ఇందుకే దేశంలో ఒక్కడంటే ఒక్క నాయకుడూ కేసీయార్‌ను నమ్మలేని దురవస్థ… బీఆర్ఎస్ ముఖ్యులను ఫిక్స్ చేయలేని రేవంత్ వైఫల్యం ప్లస్ దరిద్రమైన తెలంగాణ బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీ… ఇవే బీఆర్ఎస్ బలాలు…!!
Share this Article