Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నందూస్ వరల్డ్..! ఈ యూ-ట్యూబర్ చీటరా..? అసలేం జరుగుతోంది..?!

June 2, 2026 by M S R

.

Mohammed Rafee …. నందు వరల్డ్ స్కామ్ ఆరోపణలేనా… వాస్తవం ఏమైనా వుందా?
నందుస్ వరల్డ్ పేరిట యుట్యూబర్ గా ఇన్-ఫ్లూయన్సర్ గా సంచలనం సృష్టించిన నందన దంపతుల స్కామ్ నిజమేనా? ఒక్కొక్కరి దగ్గర 20 లక్షలు తీసుకుని స్పాన్సర్షిప్ వీసా సర్టిఫికెట్ ఇప్పిస్తామంటూ వారి కుమారుడు పంచెల ఫంక్షన్ లో వసూళ్లకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నందన ఫ్యామిలీ నిజంగా చీట్ చేసిందా? ఎదుగుతున్నారని తెలిసి ఎవరైనా కుట్రకు తెర లేపారా? నందన ఎందుకు నోరు విప్పడం లేదు?

లండన్ లో వుంటూ ఒకపూట తిని పస్తులు ఉన్న తొలి రోజులను గుర్తు చేసుకుంటూ నందన పెట్టిన వీడియోలకు మిలియన్ల వ్యూస్ లభించాయి. ఆర్ధిక ఇబ్బందులను తట్టుకుని నిలబడి యూట్యూబ్ ద్వారా జైత్ర యాత్ర చేస్తున్న తీరు చూసి లక్షల మంది స్ఫూర్తి పొందారు. ఆమె కుటుంబం అంతా కలసి చేసే రోజు వారీ వీడియోలు ఆసక్తికరంగా ఉంటాయి.

Ads

లండన్ లో లైఫ్ స్టయిల్ ఎలా ఉంటుందో ఆమె హస్కి వాయిస్ తో చూపించే వీడియోలకు కోట్ల మంది అభిమానులు వున్నారు. ఆమె సెలబ్రిటీ స్టేటస్ చూసి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆమెకు గెస్ట్ రోల్ ఇచ్చి నటించే అవకాశం కూడా కల్పించారు.

అలాంటిది నందన ఆమె భర్త కలిసి తమకు వర్క్ పర్మిట్ చేసే స్పాన్సర్షిప్ సర్టిఫికెట్ వీసా ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి 20 లక్షల వరకు వసూల్ చేసి చేతులు ఎత్తేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి! బాధితులు 50 మందికి పైగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వర్క్ పర్మిట్ వీసాలు ఇచ్చే ఐదారు కంపెనీల్లో తన భర్త కన్-సల్టెంట్ అని చెప్పి నందన ఈ వసూళ్ల దుకాణం తెరచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రతి చిన్న మాటకు హర్ట్ అయిపోయి, అందుకు స్పందనగా వీడియో విడుదల చేసి ఆవేదన వ్యక్తం చేసే నందన ఈసారి కూడా స్పందించారు. కానీ, ఈ ఆరోపణల గురించి మాట్లాడకుండా, తన ఎదుగుదల చూసి అసూయతో తొక్కేస్తున్నారని, కుట్ర పన్ని దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఖండించారు. అంతేకానీ, వచ్చిన ఆరోపణల గురించి ఒక్క ముక్క మాట్లాడకపోవడం విశేషం!

సెలబ్రిటీలుగా మారే వరకు ఒక ఎత్తు! మారిన తరువాత అభిమానుల నుంచి దోచుకోవడం మరొక ఎత్తు! దోచేయడం మాత్రం కామన్ గా కనిపిస్తోంది! మొదట అమాయకంగా వీడియోలు ఆరంభించి ఆ తరువాత ఆసక్తికరంగా మలుపులు తిప్పుతూ అభిమానం పెంచుకుంటారు! ఆ అభిమానం మత్తులో వున్నప్పుడే ఆర్ధికంగా దోచుకోవడం ఫ్యాషన్ అయిపోయింది!

అవునులే, అన్నీ వున్నప్పుడే చక్కబెట్టుకోవాలనే సామెత ఎలాగూ వుంది! కానీ, నందన అభిమానులు ఇప్పటికీ ఆమెను వెనకేసుకుని వస్తున్నారు. నందన అలాంటిది కాదని, ఏదో మోసం జరిగి ఉంటుందని, ఆమె కూడా మోసపోయి ఉండొచ్చు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు! అభిమానం పెంచుకుంటే ఇలాగే ఇంత ప్రేమగా ఉంటుంది!
– డా. మహ్మద్ రఫీ



 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • TMC బండి నొగలు విరుగుతున్నయ్… ‘కర్మ’ ఎదురుతంతోంది…
  • అసలు హిట్లర్ ఎవరు..? BRS రచ్చకు శ్రీధర్‌బాబు భలే కౌంటర్…!
  • బొద్దింకలు అడిగాయని… ధర్మేంద్ర ప్రధాన్‌‌ను తప్పించడం పెద్ద పరీక్షే..!!
  • బండి ‘ఫ్లెక్సీలు’ సరే… తనను పదే పదే గోకి, గిల్లి, గిచ్చి, రక్కి రెచ్చగొట్టింది ఎవరు..?
  • మానెక్ షా … మనసున్న ఓ చిత్రమైన కేరక్టర్ … చదవాల్సిన ఓ కథ …
  • ప్రధాని మోదీ వెనుక కనిపిస్తున్నది ఏమిటి..? గేమ్ ఛేంజర్..!
  • … కుండ బద్ధలు కొట్టేయడంలో రేవంత్ రెడ్డి తరువాతే ఎవరైనా..!!
  • అబ్ ఆయేగా మజా ..! జార్ఖండ్ బరిలో సాయిరెడ్డి, పరిమళ్ అంబానీ..!!
  • సుకన్య..! పరువుకై 30 ఏళ్ల సఫల పోరాటం… మీడియాకు ఓ పాఠం..!!
  • …. అందుకే రేవంత్ రెడ్డి ప్రత్యర్థుల అంచనాలకు అందడు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions