.
నిజానికి హిట్-3 సినిమా థియేటర్‌లో చూడాలనే అనుకున్నాను… నాని ఫ్యాన్‌ను కదా… అఫ్‌కోర్స్, కొన్నాళ్లుగా దారితప్పినా సరే…
కానీ విపరీతమైన హింస ఉంటుంది, మీ ఇష్టం అని తనే తేల్చిపారేశాడు కదా.,. పిల్లలు చూస్తే దడుసుకుంటారు అని కూడా గొప్ప టేస్టుతో ముందే చెప్పాడు కదా… ఆ నెత్తుటి కమురు వాసన ఎందుకులే అని అవాయిడ్ చేశాను…
Ads
సరే, ఓటీటీలో వచ్చింది కదా… మరీ భీకరంగా ఉన్నచోట చకచకా మూవ్ చేసి, అసలు నాని చెప్పినంత గొప్పతనం అందులో ఏముందో చూడాలని మెంటల్‌గా ప్రిపేరై స్టార్ట్ చేశాను…
సినిమా గురించి ఏమీ కంప్లైంట్స్ లేవు, ఎందుకంటే.., నిర్మాతే హీరో కాబట్టి ఎలా తీసినా ఇబ్బంది లేదు.., జనాలకి నచ్చితే డబ్బులొస్తాయి, నచ్చకపోతే మరీ ఎక్కువ నష్టాల తీవ్రత ఉండదు, కాబట్టి హీరో నాని ఎలాగైనా తీసుకోవచ్చు (స్టోరీ, యాక్షన్, ప్రజెంటేషన్ ఎట్సెట్రా).., ఎటువంటి కథలనైనా ఎంచుకోవచ్చు.., ఎందుకంటే రిస్క్ తనది కాబట్టి…
కానీ చాలా సినిమాల్లోలాగే దీనిలో కూడా కొన్ని మిస్ ఇంటర్‌ప్రిటేషన్స్ ఉన్నయ్.., ముఖ్యంగా సమాజానికి ఉపయోగపడేవి… “డార్క్ వెబ్ ” మన సమాజంలో ఒక నిషేధిత ప్రపంచం అన్నట్టుగా, అందులో అందరూ స్మగ్లర్లు, మాఫియా ముఠాలు, డ్రగ్స్ నెట్‌వర్క్, ఇల్లీగల్ దందాలు అనే ఒక పర్‌సెప్షన్ ఎప్పటిలాగే క్రియేట్ చేసారు..,
డార్క్ వెబ్ అనగానే ఒక డార్క్ రూమ్, దానిలో మళ్ళీ ఒక మాట్రిస్ సినిమాలోలాగా ఒక గ్రీన్ కంప్యూటర్ కోడ్స్, గిరాగిరా తిరిగే ఒక స్కల్ గ్రాఫిక్స్, ఇదే డార్క్ వెబ్ అని జనాల మెదడులోకి ఎక్కించే ప్రయత్నం… దీనివల్ల అసలు డార్క్ వెబ్ అంటేనే అదేదో భూతం అన్నట్టుగా క్రియేట్ చేసారు మన అర్ధ మెదడు క్రియేటర్స్…
ఇంటర్నెట్ యుగంలో అన్ని విషయాల్లోలాగే పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి… డార్క్ వెబ్ అంటే అదేమీ ఇల్లీగల్ యవ్వారం కాదు.., దాని పాజిటివ్స్ దానికి ఉన్నయ్… ముఖ్యంగా దాన్ని ప్రపంచ వ్యాప్తంగా విజిల్‌బ్లోయర్లు, డిటెక్టివ్ జర్నలిస్టులు, మరీ ముఖ్యంగా నియంతల పాలనలున్న దేశాలల్లో సమాచారాన్ని ప్రపంచానికి చేరవేయటానికి ఉపయోగించే సాధనం కూడా…
అందుకే కొంచెం డార్క్ వెబ్ అంటే కంప్లీట్ నెగిటివ్ అనే భావనను మన మైండ్లో నుంచి ముఖ్యంగా క్రియేటివ్ డైరెక్టర్ల మెదళ్ల నుంచి తీసేస్తే బెటర్… చివరగా… అందరూ క్షుద్ర పూజలు అని రాస్తుంటారు కదా… కానీ ఏదీ క్షుద్రం కాదు… వామాచారం, అంతే… అదీ శాస్త్రబద్దమే… ఊళ్లలో చూస్తాం కదా, గ్రామదేవతలకు కల్లో, సారాయో, మందో సాక పోసి, ఏదైనా బలి ఇచ్చి, అక్కడే పొతం చేసి, వండి, నైవేద్యం పెట్టి తినేస్తారు…
అందులో క్షుద్రం ఏమీ ఉండదు… కానీ మన మీడియా కూడా తెలుగు సినిమాలాంటిదే కదా… దానికి క్షుద్రం అని పేరు పెడుతుంది… సేమ్, డార్క్ వెబ్… దాని గురించి తెలియకపోతే తెలుసుకోవాలి, టెక్నాలజీ గురించి ఐడియాల్లోని దర్శకులు, నిర్మాతలు, హీరోలతో ఇదే చిక్కు… పైగా విపరీతమైన హింస ఉంటే అర్జెంటుగా స్టార్ హీరో అయిపోతాననే భ్రమ… ఫాఫం నాని..!! డబ్బులు ఈసారి వచ్చి ఉండొచ్చు, కానీ పూర్ టేస్ట్, మరోసారి ఇది వర్కవుట్ కాదు…
Share this Article