Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నరుడి బ్రతుకు నటన..! మసాలా కాదు, ఆలోచింపజేసే డిఫరెంట్ మూవీ..!

October 25, 2024 by M S R

.

నరుడికి నటన అనివార్యం. కొన్నిసార్లు తనతో కొన్నిసార్లు ఎదుటివారితో, మరికొన్నిసార్లు చుట్టూ ఉన్న సమాజంతో.

నటన ఎక్కువైతే భ్రమలు చుట్టుముడతాయి. ఆకాశంలో తేలుస్తాయి. ఆకాశం నుంచి నేలమీదకు రావాలంటే వాస్తవాన్ని కళ్ళముందుకు తీసుకురాగలిగే ఉత్ప్రేరకం కావాలి. ఆ ఉత్ప్రేరకం మనిషి మాత్రమే కానక్కర్లేదు. ఒక సంఘటన, ఒక దృశ్యం, పుస్తకం, సినిమా ఏదైనా కావొచ్చు. అయితే బయటినుంచి బయటినుంచి వచ్చే మార్పు తాత్కాలికం. నిజమైన మార్పు తెలియాలంటే నిన్ను నువ్వు వెతుక్కుంటూ ప్రయాణం చెయ్యాలి.

Ads

అదే ‘నరుడి బ్రతుకు నటన’.

సత్య యాక్టర్ అవ్వాలని కోరిక. కానీ అందుకు తగ్గ శ్రమ అతని దగ్గరలేదు. ‘బాగానే చేస్తాను కదా, నాకు అవకాశం ఇవ్వడానికి వీళ్లకొచ్చిన సమస్య ఏంటి?’ అని ఆత్మవంచన చేసుకుంటుంటాడు. తన పొరపాటు వల్ల ఒక మనిషి చావు బతుకుల్లో ఉన్నా పట్టించుకోనంత నిర్లక్ష్యం. నీకు యాక్టింగ్ రాదు అని తండ్రి,

నీ అంత చెత్త యాక్టింగ్ ఇప్పటివరకూ చూడలేదని అపరిచితుడు, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా అని చెప్పిన స్నేహితుని మాటల్లో తనకే తెలియని కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. సమాధానాలు వెతుక్కుంటూ ఒంటరిగా కేరళ ప్రయాణమవుతాడు.

తెచ్చుకున్న డబ్బుతో రిచ్ గా బతుకుతాడు. డబ్బులు అయిపోతాయి. చేతిలో ఉన్న ఫోన్ కూడా పోతుంది. భాష తెలియదు, చేతిలో రూపాయి లేదు. ఒక్కడు నిలబడతాడు.

‘A hungry stomach, an empty pocket teach you the most valuable lessons in life’ అన్నట్టు కనపడే దృశ్యం, ఎదురయ్యే మనిషి, జరుగుతున్న సంఘటన ఇన్నాళ్లూ ప్రశ్నలేవో రేపుతుంటాయి. ఆ ప్రశ్నల నుంచి తనను తాను ఎలా చూసుకున్నాడు, యాక్టర్ అవ్వాలనే సత్య లక్ష్యం నెరవేరిందా అనేది సినిమా.

కరోనా తర్వాత ప్రయాణాలు మనిషి జీవితంలో భాగమయ్యాయి. గోవా, కేరళ, కర్నాటక, తమిళనాడు, అరకుల్లోని ఏ హిల్ స్టేషనూ, టీ కాఫీ ఎస్టేట్స్, ఫారెస్ట్ క్యాంపులు, బీచ్ లు కొత్త కాదు. అయితే యాత్రికుడిగా మనకు కొంత పరిమితి ఉంటుంది. వెళ్లి వచ్చే నాలుగైదు రోజుల్లో మనం ప్రదేశాలు, దృశ్యాలు, మన అనిభూతులు మాత్రమే. కానీ ఈ సినిమా కేరళలోని ఒక మారుమూల పల్లెను, పల్లె వాతావరణాన్ని, పల్లెలోని మనుషులను, రోజువారీ జీవితాల్ని తెరమీదకు తెస్తుంది.

అనాద డీ.సల్మాన్
అడ్రస్ తెలియని లేఖ
వాళ్లందరి మధ్య తనను తాను వెతుక్కునే సత్య. ఇందులో ఏ పాత్రా పరిధికి మించి ప్రవర్తించదు. ఎందుకంటే వాస్తవ జీవితంలో మనకు తెలియని అద్భుతాలు అప్పటికప్పుడు రావు.

పక్షులకు తన జీవిత పోరాటం, గమనం తప్ప ప్రత్యేక జీవిత లక్ష్యాలేం ఉండవు అంటూ చివరిలో మనిషి జీవితాన్ని పక్షితో పోల్చి చెప్పే పక్షి ఫిలాసఫీ చాలా బాగుంది.

‘నరుడి బ్రతుకు నటన’ సినిమా ప్రివ్యూ సమీక్ష ఇది… నేటివిటీ నేటివిటీ అంటూ మలయాళం , తమిళ సినిమాల్ని వెతికి చూసే తెలుగు ప్రేక్షకులకు ఆ నేటివిటీని ఓ భిన్నమైన కథాంశంతో, రొటీన్ మసాలాలకు భిన్నంగా, గుడ్ టేస్ట్‌తో అందించిన ప్రొడ్యూసర్ Sukumar Boreddy  అభినందనీయుడు… ఈరోజు సినిమా విడుదలైంది… (వివేక్ లంకమల) 


ఈ సినిమా నిర్మాణం, ఆ ప్రయాస వేరు… చాన్నాళ్లుగా దీని విడుదల కోసం సినిమా టీం పడినన్ని కష్టాలు తీస్తే మరో సినిమా… రాస్తే ఓ పెద్ద పుస్తకం… ఎట్టకేలకు  థియేటర్లకొచ్చింది… ముచ్చట


నువ్వు నీకే దొరికే వరకు … Life Joureny .. Find yourself .. Know What Actually You Are .. ఇవన్నీ సమకాలీన సినిమా హిట్ ఫార్ములాలు.. అప్పటి గమ్యం నుంచి ఈ మధ్య వచ్చిన సత్యం సుందరం వరకు పేక్షకుడు Self-identityతో ఓన్ చేసుకున్న సినిమాలే.

“నరుడి బ్రతుకు నటన” .. మొదటి రెండు నిమిషాల్లోనే కనెక్ట్ అయ్యే డైలాగ్స్ తో సినిమా ఓపెనింగ్ బాగుంది.. రైటర్ మంచి సాహిత్యం చదివినట్లున్నారు.. మంచి డైలాగ్స్ ఫ్రెష్ ఉన్నాయి. పాటలు ఫైట్స్ మధ్యలో సినిమా కాకుండా కథ కోసం అవసరమైన సీన్స్ తో సినిమా బాగుంది.

భాష పరిధులను సినిమా దాటింది.. సినిమా ఎక్కువ భాగం కేరళలో జరుగుతుంది , చూడటానికి చాలా బాగుంది. సినిమా బలం ఒరిజినాలిటీ..
జ్ఞాపకాలనే పోగుచేసే ఆట కాదా జీవితం అంటే .. ఈ సినిమా సోల్ అదే. సత్యం సుందరంలో కనిపించని ఫీల్ నాకు ఈ సినిమాలో కనిపించింది.

అలా అని ఈ సినిమా ఆర్ట్ మూవీ కాదు.. కమర్షియల్ ఎలెమెంట్స్ చాలా ఉన్నాయి. నరుడి బ్రతుకు నటన సినిమా ఎక్కడ స్లో కాకుండా ఎడిటర్ జాగర్త పడ్డారు…… (శివ రాచర్ల)


 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions