.
హలో అమెరికనా! హతవిధీ, ఏమిటిది? కంచికి చేరని కథ
గప్పాల అమెరికనుడి అసలు రంగు తేలిపోయింది! నాసా [NASA] రాకెట్ సైన్స్ [RocketScience] రోదసీ [Space] కి ఇవతలే చతికిలపడిపోయింది! డెబ్భై [70s] ల్లోనే అంతన్నాడింతన్నాడు, చందమామపై సైతం అడుగులేశామన్నాడు!
Ads
కానీ, ఒక్కచర్యతో అవన్నీ ఉత్త ఫేకుడే అని తెర్లేసుకున్నాడు! ఇంతజేసి ఇంటెన్క సచ్చినట్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ [ఐఎస్ఎస్] లో ఇరుక్కుపోయిన ఓ ఇద్దరు కాస్మొనాట్లను భూమ్మీదకు తేవడానికి అమెరికావోడు కిందామీదా పడుతున్నాడు!
వాళ్లను వెనక్కి తేవడంలో చేతులెత్తేసి, సాయం కోసం బేలగా ఎలాన్ మస్క్ వైపు చూస్తున్నాడు! నిస్సిగ్గుగా తన ప్రత్యర్థి రష్యాకు చెందిన స్పేస్ ఏజెన్సీ రాస్కాస్మోస్ [RosCosmos] కాస్మొనాట్ అలెగ్జాండర్ వ్లాడిమిరోవిచ్ గోర్బనోవ్ సాయం అర్థిస్తున్నాడు!
ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బేరీ విల్మోర్లను వెనక్కి తేవడంలో ఎదురైన ఫెయిల్యూర్, రాకెట్ సైన్సులో రాటుదేలామని విర్రవీగిన అగ్రరాజ్యం గర్వమణిగేలా చేసింది! వాళ్లిద్దరినీ వెనక్కి తీసుకురావడంలో నాసా విఫలమవడంతో గడచిన ఆరునెల్లుగా త్రిశంకు స్వర్గంలోనే తేలియాడుతున్నారు!
తన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, ఇన్నిరోజులు పలికిన బీరాలన్నీ వట్టి బోగస్ అని వీళ్ల ఉదంతం ప్రపంచానికి చాటుతోంది! ఈ ఏడాది జూన్ 5 వ తేదీన ఫ్లోరిడాలోని కేప్ కెనెర్వల్ స్పేస్ స్టేషన్ నుంచి బోయింగ్ స్టార్ లైనర్ [BoeingStarLiner] రాకెట్లో సునీతా, విల్మోర్ ఇద్దరూ రయ్మంటూ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే!
సరిగ్గా 8 రోజులకు వాళ్లు తిరిగి భూమిపై ల్యాండ్ కావలసి ఉండింది! షెడ్యూల్ ప్రకారం స్టార్ లైనర్ టెస్టుతో పాటు, అంతర్జాతీయ రోదసీ కేంద్రంలో పరిశోధనలు జరిపి జూన్ 14 వ తేదీకల్లా వాళ్లిద్దరూ భూమికి చేరుకోవాలి! కానీ, అలా జరగలేదు! అనూహ్యంగా ఐఎస్ఎస్ లోనే హట్కాయించారు!
ఇక అప్పటి నుంచీ వాళ్లిద్దరి కథ కంచికి చేరడం లేదు! సునీతా, విల్మోర్ల అంతరిక్షయాత్ర ముగింపు నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది! అనేక అనుమానాల నడుమ వాళ్ల రిటర్న్ జర్నీ తాజాగా 2025 ఫిబ్రవరికి పోస్టుపోన్ ఐంది!
2006 లో మొదటిసారి, 2012 లో రెండోసారి స్పేస్ ఎక్స్‌పెడిషన్స్ లో పాల్గొన్న సునీతా విలియమ్స్ మూడోసారి మాత్రం అక్కడే చిక్కుకుంది! ఎన్నో చేదు అనుభవాలను నమోదు చేస్తోన్న తన హ్యాట్రిక్ అటెంప్ట్ తో కలిపి ఆమె ఇప్పటి వరకు 322 రోజులు అంతరిక్షంలో గడిపింది!
తాజా పరిణామాల నేపథ్యంలో ఆరోజుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది! అలా మొన్న సెప్టెంబర్ 19 వ తేదీన సునీతా విలియమ్స్ తన బర్త్ డే సైతం అనివార్యంగా రోదసీలోనే చేసుకోవాల్సి వచ్చింది! 2024 సంవత్సరం కూడా చివరి అంకంలోకి చేరింది!
డిసెంబర్ 31 అర్ధరాత్రి, న్యూ ఇయర్ వేడుకలనూ ఆమె అక్కడే జరుపుకోవాల్సిన దుస్థితి! స్టార్ లైనర్ వ్యోమనౌక [#SpaceShip] లోని సర్వీస్ మాడ్యూల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ఆటంకం కలిగి ఆమె తిరుగుప్రయాణం జాప్యం ఔతోందని నాసా ఇప్పటికే ప్రకటించింది!
కాగా, 1998 నవంబర్లో లాంఛైన నాటి నుంచీ, అంటే గడచిన 26 ఏళ్లగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు అనేక దేశాల వ్యోమగాములు వెళ్లడం, రకరకాల పరిశోధనలు చేస్తుండటం నిరంతరంగా సాగుతున్న ప్రక్రియ! సెకనుకు 5 మైళ్ల చొప్పున, ప్రతి 90 నిమిషాలకు ఒకసారి అది ప్లానెట్ ఎర్త్ ను చుట్టి వస్తుంది!
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ తో పాటు ప్రస్తుతం ఆ స్పేస్ స్టేషన్లో మరో 7 గురు ఆస్ట్రనాట్స్ [Astronauts] ఉన్నారు! వివిధ మాధ్యమాల్లో ప్రచురితం ఔతున్న ఫోటోగ్రాఫ్ ల కారణంగా సునీతా విలియమ్స్ హెల్త్ అండ్ ఫిట్నెస్ లు జనసామాన్యానికి సైతం ఆసక్తికరంగా మారాయి!
ఆమె నెమ్మదిగా అనారోగ్యం బారిన పడుతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి! దీంతో, సునీతా విలియమ్స్ ఇంకా అంతరిక్షంలోనే ఉందా? ఎప్పుడు తిరిగి వస్తుంది? ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమిటి? లాంటి అనేక ప్రశ్నలు సగటు భారతీయుడిలో ఉత్పన్నం ఔతున్నాయి!
ఐతే, ఎక్కువ రోజులు రోదసీలో ఉంటే వ్యోమగాముల ముఖకవళికలు మారి, వాళ్ల స్వరూపం [Morphology] లో స్వల్ప తేడాలు రావడం, కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడం క్వైట్ నాచురల్!
వ్యోమగాములకు మనోధైర్యం, మానసిక సంసిద్ధతలు అతి ముఖ్యం! ఏమాత్రం ఒత్తిడికి గురైనా, వాళ్లను అనేక రుగ్మతలు చుట్టుముట్టడం తధ్యం! సూక్ష్మ గురుత్వాకర్షణ [MicroGravity] వల్ల రోదసీలో వాళ్ల జైవిక చర్యలు తీవ్ర ప్రభావానికి లోనౌతాయి!
బరువు తగ్గి బక్కచిక్కి పోవడం, బాడీ మజిల్స్ కరిగిపోవడం, ఎముకలు అరిగిపోవడం, తొడలు సాగడం, తల పెద్దగా కనిపించడం, చెంపలు కుంచించుకు పోవడం, కళ్లు వాచినట్లు ఉండటం, కంటిచూపు దెబ్బతినడం, బ్యాక్టీరియా విజృంభించి చర్మ సంబంధ వ్యాధులు రావడం, దురుద లేవడం ఇంకా అనేక ఇతర భౌతిక సమస్యలు తలెత్తడం సర్వసాధారణం!
కానీ, వ్యోమగాములు అన్ని రకాల తర్ఫీదు పొంది సుశిక్షితులుగా అంతరిక్షంలోకి ప్రవేశిస్తారు! అక్కడ కూడా కొన్ని స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోసీజర్స్ [SoPs] ను ఫాలో ఔతారు! ఐనప్పుడు, సునీతా విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిపై ఇక ఎలాంటి చింతా అక్కరలేదు!
కానీ, భయమంతా అమెరికోడు గొప్పలు చెప్పుకుంటున్న వాడి రాకెట్ టెక్నాలజీతోనే! ఎందుకంటే, ఆమధ్య [2003లో] అమెరికాకు చెందిన కొలంబియా స్పేస్ షటిల్, భూగ్రహ ఉపరితలంలోని బాహ్యపొర [Thermosphere] లో నుంచి వాతావరణం [Atmosphere] లోకి ప్రవేశించే క్రమంలో తలెత్తిన రాపిడి వల్ల గగనతలంలోనే పేలిపోయింది! ఆ సంఘటనలో భారత సంతతికే చెందిన తొలి మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా పంచప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఉదంతం ఇండియన్స్ ఇప్పటికీ, ఎప్పటికీ మరువలేని మానని గాయమే!
ఇదిలా ఉంటే, తనదైన సొంత పరిజ్ఞానంతో సునీతా విలియమ్స్, బేరీ విల్మోర్లను భూమిపైకి రప్పించడం చేతకాకే నాసా, ఎలాన్ మస్క్ సంస్థకు చెందిన స్పేస్X డ్రాగన్ [SpaceXCrewedDragonMission] రాకెట్ టెక్నాలజీని అరువు తెచ్చుకుంటోందా? రాస్కాస్మోస్ లో పని చేస్తోన్న కాస్మొనాట్ [Cosmonaut] అలెగ్జాండర్ గోర్బనోవ్ సాయాన్ని కోరిందా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
కేవలం ఇద్దరు ఆస్ట్రనాట్లను వెనక్కి తీసుకురావడానికే ఇన్ని ఆపసోపాలు పడుతున్న అమెరికా, మరి 1969 లోనే జాబిల్లిపై ఎలా అడుగు మోపింది? ఎలాన్ మస్క్ లేని ఆనాటి ఆ పాత రోజుల్లో నాసా ఏ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని నమ్మి అంత సాహసానికి ఒడిగట్టింది? అదే నిజమైతే, ఆ రాకెట్ సైన్సును ఇప్పుడెందుకు వాడలేకపోతోంది?
150 రోజులుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకున్న ఇద్దరు వ్యోమగాములను భూమ్మీదకు ఎందుకు తీసుకురాలేకపోతోంది? అలాగైతే, అంతరిక్షయానంలో ఎన్నో మైలురాళ్లను దాటాం, చందమామ లాంటి కొత్త మజిలీలను చేరాం అంటూ రష్యాతో ప్రచ్ఛన్నయుద్ధ [ProxyWar] సమయంలో అమెరికోడు అల్లినవన్నీ కట్టు కథలేనా? ఈ భూగోళం [Globe] పై తన సూపర్ కాప్ హోదాను, సుప్రిమసీని నిలబెట్టుకోవడానికి ఆడిన ఝూటా నాటకాలేనా?
హలో అమెరికనా.., మూన్ ల్యాండింగ్ పై ఇకనైనా గుప్పిటి విడువు! అప్పట్లో నువ్వు కొట్టిన గప్పాలను నమ్మి ఇంకా మత్తులో జోగుతూ, నీ అడుగులకు మడుగులొత్తుతున్న పాశ్చాత్య ప్రపంచంపై, స్వయంగా నీ చేతి కమండలంలోనే ఉన్న వాస్తవ జలాన్ని చల్లి కళ్లు తెరిపించు! నిజాలను దాచిపెట్టి పబ్బం గడుపుకుంటానంటే మాత్రం, ఇకపై నీ సయ్యాటలు సాగవు! ఇప్పటికైనా గుట్టు విప్పకపోతే, రోజులు దొర్లుతున్న కొద్దీ నీ పరువు గంగలో కాదు ఆకాశగంగలో కలవడం ఖాయం!…... ( రచయిత :: సూరజ్ వి. భరద్వాజ్… )
Share this Article