మొన్నటి నుంచీ నెటిజనం బిగ్‌బాస్ నటరాజ్ మాస్టర్‌పై విరుచుకుపడుతున్నప్పుడే అర్థమైపోయింది… ఈసారి నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్‌కు బాటలు పడుతున్నాయి అని…! పలు సైట్లలో వోటింగ్ సరళి చూస్తుంటే అర్థమైంది ఏమిటంటే..? కాజల్ నటరాజ్ తక్కువ వోట్లతో డేంజర్ జోన్లో ఉన్నారని..! కానీ మొదటి మూడు వారాలూ వరుసగా ఆడవాళ్లనే బయటికి పంపించేశాడు బిగ్‌బాస్… ఫస్ట్ సరయు, సెకండ్ ఉమాదేవి, థర్డ్ లహరి… అందుకే లెక్క మార్చాడు… కాజల్ మాత్రమే కాదు, ఆనీ మాస్టర్, సిరికి కూడా వోట్లు తక్కువే వచ్చాయట… ఆ ముగ్గురూ ఆడాళ్లే కదా… సో, ఆనీ, సిరి, కాజల్‌లను సేవ్ చేసి, నటరాజ్ మాస్టర్‌కు ఓ దండం పెట్టేశాడు… మరి బిగ్‌బాస్ లెక్కలు వేరే ఉంటాయి కదా… హౌజులో మగ, ఆడ నిష్పత్తి కూడా ముఖ్యమే కదా… పైగా కాజల్, సిరి యాక్టివ్… ఆనీ పర్లేదు…
నటరాజ్ మాస్టర్ యాక్టివే… కాకపోతే హైపర్ యాక్షన్… ప్రత్యేకించి యాంకర్ రవిని టార్గెట్ చేశాడు… గుంటనక్క అన్నది తన గురించేనని నెటిజనానికి అర్థమైంది… విశ్వను ఊసరవెళ్లి అన్నట్టుగా కూడా అర్థమైంది… సరే, అక్కడితే ఆపేస్తే సరిపోయేది… అంతా ఆటలో భాగమే… ప్రతి ఒక్కరికీ ఓ స్ట్రాటజీ ఉంటుంది… అలాగే బలమైన కంటెండర్లుగా భావించిన రవి, విశ్వలను మెంటల్‌గా డిమోరల్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుందాం… కానీ ఈసారి రవిని నత్తతో పోల్చాడు… రవి హర్టయి తోటి కంటెస్టెంట్లతో షేర్ చేసుకున్నాడు… రవి దాకా ఎందుకు..? ప్రేక్షకులకే నచ్చడం లేదు, నటరాజ్ యాటిట్యూడ్… ఆ దెబ్బ పడింది… పోనీలే మాస్టర్, జానేదేవ్… మీ శ్రీమతి డెలివరీ టైమ్‌కు ఆమెకు భరోసాగా ఆమె దగ్గరే ఉండొచ్చు… ఆఫ్టరాల్ బిగ్‌బాస్…!! మన ఫ్యామిలీ ఎమోషన్స్కన్నా గొప్పదేమీ కాదుగా…!! ((బిగ్‌బాస్ ఆటే ఓ వినోదం, ఓ సరదా షో… అంతే సరదాగా ఈ నటరాజ్ పెన్సిల్ పిక్ వాడాను… అన్యథా భావించవలదు..))
Ads
Share this Article