.
మన కాసర్ల శ్యామ్‌కు ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డు… బలగం సినిమాలో ఊరూ పల్లెటూరు పాటకు… సూపర్.,. తెలంగాణ అచ్చమైన పల్లెటూరు పాటకు జాతీయ పట్టం…
బేబీ సినిమాలో ప్రేమిస్తున్నా పాట పాడిన పీవీఎన్‌ఎస్ రోహిత్‌కు ఉత్తమ నేపథ్య గాయకుడు అవార్డు… సూపర్… తెలుగులో ఇంకొన్ని అవార్డులూ వచ్చాయి… ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ చిత్రంగా హను-మాన్… ఉత్తమ బాలనటిగా గాంధీతాత చెట్టులో నటించిన సుకృతి…
Ads
ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో బేబీ సాయి రాజేష్… ఉత్తమ స్టంట్స్ హను-మాన్ నందు పృథ్వి… బెస్ట్ తెలుగు ఫిలిమ్ భగవంత్ కేసరి… ఇక్కడే కాస్త ఆగిపోయింది మది… అసలు అందులో ఏముంది..? ఓ సాదాసీదా సినిమా…
ఎస్, ప్రతి అవార్డు వెనుకా ఓ కథ ఉంటుంది… రాగద్వేషాలు ఉంటాయి… మోడీ ప్రభుత్వం ఫాఫం చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతుకుతోంది కదా… చంద్రబాబును ప్లీజ్ చేయడానికి మోడీ ప్రభుత్వం, సంబంధిత విభాగాలు ఏవో పాట్లు పడతాయి అనుకుంటున్నదే…
అనుకున్నట్టే పద్మభూషణ్ ఇచ్చారు… ఏమో, చూడబోతే… ఎన్టీయార్‌కు భారతరత్న ఇవ్వరేమో గానీ, బాబు గారి వియ్యంకుడు, బావమరిది బాలయ్యకే ఇస్తారేమో..! కాకపోతే మరీ భగవంత్ కేసరికి ఉత్తమ తెలుగు అవార్డు ఇచ్చే రేంజుకు పడిపోతారా..? నిజానికి కాళోజీ సినిమాకు వస్తుందని అనుకున్నారు అందరూ…
అప్పుడు తట్టింది… జ్యూరీలో వీఎన్ ఆదిత్య ఉన్నాడని..! క్లియర్..! ఊరకే రావండీ జాతీయ అవార్డులు… లెక్క ఉంటుంది, సమీకరణాల్లో ఫిట్ కావాలి… అందరికీ తెలిసిన రహస్యమే అది… కాకపోతే మరీ భగవంత్ కేసరికి అవార్డు అనేసరికి కాస్త ఆశ్చర్యం, ఇప్పుడు కాస్త స్పష్టత…
మిగతా అవార్డుల విషయానికొస్తే… రాణి ముఖర్జీకి ఉత్తమ నటి అవార్డు సముచితం… జవాన్‌లో షారూఖ్‌కు ఇచ్చేబదులు గోట్‌లైఫ్ పృథ్విరాజ్ సుకుమారన్‌కు ఇస్తే సముచితంగా ఉండేదేమో… అసలు విక్కీ కౌశల్‌ను దాటి ఆ అవార్డు ఎలా దాటిపోయింది…?
12 th ఫెయిల్ సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డు కూడా అంతే… ఎందుకోగానీ విక్కీ కౌశల్‌కు రాజ్ బహదూర్ సినిమాకు గాను ఉత్తమ నటుడు అవార్డు రావల్సింది అనిపించింది… ఏదో జాతీయ సమగ్రత బాపతు ఏదో అవార్డు ప్రకటించారు…
పోనీలే… ఏవో కొన్ని అవార్డులు తెలుగు సినిమాల పేరిట కనిపిస్తున్నాయి, అందే సంతోషం… ప్రత్యేకించి గీత రచయిత కాసర్ల శ్యామ్, గాయకుడు రోహిత్‌కు ‘ముచ్చట’ అభినందనలు…
Share this Article