Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జాతీయ అవార్డుల ఎంపిక పర్లేదు – మనకూ బాగానే వచ్చాయి

July 18, 2026 by M S R

.

పర్లేదు… ఎప్పటిలాగే దక్షిణ సినిమాను జాతీయ అవార్డుల ఎంపికలో తీసిపారేయలేదు… ఈసారి ప్రయారిటీ దక్కింది… ఆర్టికల్ 370 సినిమాకు ఉత్తమ చిత్రంగా, అందులో నటించిన యామీ గౌతమ్‌కు ఉత్తమ నటిగా అవార్డుల ఎంపికపై ఇంకా ప్రకాష్ రాజ్ వంటి గొంతులు ఇంకా ఏమీ ప్రశ్నించినట్టు లేదు… ఆ సినిమా బీజేపీ ఎజెండా ప్రేరితమనీ, యామీ బీజేపీ మనిషనీ ట్వీటినట్టు లేదు ఇంకా…

సహజమే… కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ రాగద్వేషాలు ఖచ్చితంగా జాతీయ అవార్డులను ప్రభావితం చేస్తాయి… దానికితోడు పైరవీలు, సిఫారసులు కూడా ముఖ్యమే… (ఆర్టికల్ 370 సినిమాకు ఆ అర్హత లేదని కాదు, యామీ గౌతమ్ బాగా చేయలేదనీ కాదు)… ఐనా ఆ అవార్డులకున్న ప్రాధాన్యం విలువ ఎక్కువే… గతంలో ఫిలిమ్ ఫేర్ అవార్డులకు ఈ జాతీయ అవార్డులకన్నా కాస్త ఎక్కువ విలువ ఉండేది… ఇప్పుడు రెండూ సేమ్ సేమ్…

Ads

దక్షిణ సినిమాకు సంబంధించి… ఉత్తమ నటుడు మమ్ముట్టి, గుడ్ సెలక్షన్… భ్రమయుగంలో తన నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే… సూపర్ స్టార్ హోదాను అనుభవిస్తూ కూడా తనలోని నటుడిని తృప్తిపరిచేందుకు ఏ ప్రయోగాలకైనా తను సిద్ధం (అఫ్‌కోర్స్, మోహన్‌లాల్ కూడా)… తమిళ, తెలుగు, కన్నడ నటుల్లో కాస్త ఈ సోయి పెరిగితే బాగుణ్ను…

గోట్ లైఫ్ (ఆడుజీవితం) నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు వస్తుందని చాలామంది ఆశించారు… భ్రమయుగం మమ్ముట్టితోపాటు చందూ ఛాంపియన్ నటుడు కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఈ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును పొందాడు… తనూ అర్హుడే…

జాతీయ ఉత్తమ నటి అవార్డు సాయిపల్లవికి వస్తుందని కూడా చాలామంది ఆశించారు… అమరన్ సినిమాలో బాగా చేసింది కూడా… అలాగే కని కుస్రుతి, శ్రద్ధాకపూర్ (స్త్రీ2), ఆలియా భట్ (జిగ్రా) కూడా ప్రధానంగా పోటీపడ్డారు…

జాతీయ ఉత్తమ చిత్రం కేటగిరీలో ఆర్టికల్ 370 తోపాటు అమరన్, స్త్రీ2, ఆడుజీవితం, భ్రమయుగం, కల్కి పోటీపడ్డాయి… ఆయా సినిమాలకు ఏదో ఓ కేటగిరీలో అవార్డులు అడ్జస్ట్ చేశారు… సరే, తెలుగుకు వద్దాం, ఈసారి కాస్త చెప్పుకోదగిన అవార్డులే వచ్చాయి… ఇలా…



72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన
ఉత్తమ తెలుగు చిత్రం – కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ పాపులర్ చిత్రం – కల్కి 2798 ఏడీ
ఉత్తమ బాలల చిత్రం – 35 చిన్న కథ కాదు
ఉత్తమ బాల నటుడు- అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు)
ఉత్తమ మేకప్‌ – పి.రవికుమార్‌ (కమిటీ కుర్రోళ్లు)
బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌ (ఒరిజనల్‌) – సుకుమార్‌ (పుష్ప-2)
బెస్ట్ డైలాగ్ రైటర్‌ – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – దీపాలి నూర్‌, శీతల్ శర్మ (పుష్ప-2)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్‌ – నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2798 ఏడీ)



ఇవీ మొత్తం అవార్డులు…

ఉత్తమ చిత్రం – ఆర్టికల్ 370
ఉత్తమ నటుడు – మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్‌ (సంయుక్తంగా)
ఉత్తమ నటి – యామీ గౌతమ్‌ (ఆర్టికల్ 370)
ఉత్తమ దర్శకుడు – రాజ్‌కుమార్ పెరియస్వామి (అమరన్‌)

ఉత్తమ నేపథ్య గాయని – వైకోం విజయలక్ష్మి (ఏఆర్‌ఎం)
ఉత్తమ నేపథ్య గాయకుడు – అభయ్ జోధ్ పుర్కర్‌
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ – జలాల్‌ (భ్రమయుగం)
ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం – కెప్టెన్‌ మిల్లర్‌ (తమిళం)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్‌ – నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2798 ఏడీ)
బెస్ట్ ఎడిటర్ – కలైవన్నన్‌ (అమరన్)
బెస్ట్ సౌండ్ డిజైనర్‌ – మానస్ చౌదరి (భూల్ బులియా)
బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌ – యోగేశ్ దేశ్‌పాండే
ఉత్తమ పాటల రచయిత – మనోజ్‌ ముంతాసిర్ (మైదాన్‌)
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ – జీవీ ప్రకాశ్ కుమార్‌ (అమరన్‌)
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు) – శశ్వంత్ సచ్‌దేవ్‌ (ఆర్టికల్ 370)

ఉత్తమ తమిళ చిత్రం – రాయన్
ఉత్తమ మలయాళ చిత్రం – ఫెమినిస్ట్ ఫాతిమా
ఉత్తమ కన్నడ చిత్రం – మిథ్య (ఇల్యూజన్‌)
ఉత్తమ హిందీ చిత్రం – శ్రీకాంత్
ఉత్తమ గుజరాత్‌ చిత్రం – మారన్ (ద హంట్‌)
ఉత్తమ బెంగాలీ చిత్రం – చల్‌చిత్ర ఎఖో


 


 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జాతీయ అవార్డుల ఎంపిక పర్లేదు – మనకూ బాగానే వచ్చాయి
  • మహానటికన్నా ఏం తక్కువ ? మరువలేని అభినయ *సౌందర్యం !
  • సాక్షి రాసింది… సగం అబద్ధం – సగం నిజం … దేని గురించంటే..?
  • పాపం తెలుగు దినపత్రికలు – నానాటికీ దిగదుడుపు… సాక్షి సహా !!
  • ప్రైవేటు రాకెట్ విక్రమ్-1 విజయాన్ని ఇలా అర్థం చేసుకుందాం!!
  • సోనమ్ దీక్ష భగ్నం సరైన చర్య! ఇప్పటికే ఆలస్యమైంది కూడా!!
  • ఐశ్వర్య ఫ్లాప్ – లయ డబుల్ ఫ్లాప్ – నాగదుర్గ డిజాస్టర్ – ఏమిటీ దురవస్థ..!!
  • TRS … ఈ పేరుపై BRS ప్రేమ ఏమీ లేదు… భయం, కలవరం..!!
  • అదే పాత కథ- అదే పాత తారాగణం- అదే పాత కథనం… చీప్ కామెడీ అదనం !!
  • … దాంతోనే మొదలైంది యండమూరి సుదీర్ఘ రచన ప్రస్థానం !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions