.
Pardha Saradhi Upadrasta …. ఫ్రాన్స్ – నాటో నుంచి వైదొలగే దిశగా కీలక అడుగు?
France నాటో నుంచి బయటపడేందుకు పార్లమెంటులో తీర్మానం పెట్టనున్నట్టు ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ Clémence Guette వెల్లడించారు.
Ads
మొదటి దశగా NATO Integrated Military Command నుంచి ఫ్రాన్స్ తప్పుకునే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
శుభం భూయాత్.
నిన్న చెప్పినట్లుగానే — నాటోను దానంతట అదే బలహీనపరిచే విధంగా ట్రంప్ తన పదజాలం, విధానాలతో అడుగులు వేశాడు. ఇప్పుడు ఒక్కొక్క దేశంలో అసంతృప్తి బయటపడుతోంది.
నిన్న ఇటలీ ప్రధాని Giorgia Meloni కూడా “గౌరవం లేని నాటోలో ఎందుకు ఉండాలి? అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం” అని వ్యాఖ్యానించారు.
Germany ఛాన్సలర్ కూడా ఎప్పటినుంచో నాటోపై అసంతృప్తిగా ఉన్నారు.
ఇదే సమయంలో నాటో దేశమైన Denmark నుంచి Greenlandను “లాక్కుంటాం” అన్న ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పటికే ఉన్న అశాంతికి ఆజ్యం పోశాయి.
ఒకప్పుడు “రష్యా నుంచి మిమ్మల్ని రక్షిస్తాం” అంటూ అమెరికా నాటో దేశాలను చేర్చుకుంది. ఇప్పుడు మాత్రం “తిండి పెట్టడం దండగ… మిమ్మల్ని ఎందుకు పోషించాలి?” అనే స్థాయికి వచ్చింది.
రష్యా చుట్టూ ఉన్న నాటో దేశాలు ఇప్పుడు తప్పనిసరిగా నిర్ణయించుకోవాలి — ఏ దారి? ఎవరి వైపు? కొన్ని దేశాలు రష్యా కూటమి వైపు చెయ్యి చాచే అవకాశాన్ని కూడా తిరస్కరించలేం.

రష్యా చుట్టూ ఉండి, పాత USSRలో భాగమై లేదా ప్రస్తుతం NATO/EUలో ఉన్నా భవిష్యత్తులో రష్యా మిత్రదేశాలుగా మారే అవకాశం ఉన్న దేశాలు కొన్ని ఉన్నాయి…
🟥 పాత USSR దేశాలు
Belarus – ఇప్పటికే రష్యాకు అత్యంత సన్నిహిత మిత్రదేశం
Kazakhstan – అధికారికంగా తటస్థం, కానీ భద్రతలో రష్యా ప్రభావం బలంగా ఉంది
Armenia – పశ్చిమంపై నిరాశ, మళ్లీ మాస్కో వైపు చూసే అవకాశం
Azerbaijan – ద్వంద్వ విధానం, రష్యాతో వ్యూహాత్మక సంబంధాలు
Moldova – లోపలి రాజకీయ చీలికలు, రష్యా ప్రభావం కొనసాగుతోంది
🟦 ప్రస్తుతం NATO / EU లో ఉండి రష్యా వైపు వాలే అవకాశం ఉన్నవి
Hungary – నాటో సభ్యదేశమే అయినా రష్యాపై మృదు వైఖరి
Slovakia – కొత్త రాజకీయ ధోరణి రష్యాకు అనుకూలంగా
Bulgaria – లోపలి రాజకీయ విభేదాలు, రష్యా అనుకూల వర్గాలు
Romania – అధికారికంగా నాటో లైన్, కానీ ప్రజాభిప్రాయంలో చీలికలు
Turkey – నాటో సభ్యదేశమే అయినా స్వతంత్ర, రష్యాతో వ్యూహాత్మక లావాదేవీలు.
నాటో లోపలి ఏకాభిప్రాయం బలహీనపడితే, అమెరికా భద్రతా హామీలు నమ్మకంగా లేకపోతే యుద్ధ, ఆర్థిక ఒత్తిడి పెరిగితే ఈ దేశాలు భవిష్యత్తులో తమ దారి మార్చే అవకాశం ఉంది.
🌍 నాటో భవిష్యత్తు ప్రశ్నార్థకమా? లేదా కొత్త ప్రపంచ కూటములకు ఇదే ఆరంభమా? సమయమే నిర్ణయిస్తుంది. — ఉపద్రష్ట పార్ధసారధి
#France #NATO #Geopolitics #WorldPolitics #InternationalRelations #GlobalPowerShift #TrumpEffect #Russia #Europe #PardhaTalks
Share this Article