సీపీఎం… తెలుగునాట దాని బతుకంతా తెలంగాణ వ్యతిరేకతే… తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నప్పుడు సైతం తన సమైక్యాంధ్ర పోకడను దాచుకోలేదు… ఏవో పిచ్చి సూత్రాన్ని బయటకు ప్రదర్శిస్తూ యాంటీ తెలంగాణ ధోరణిని స్పష్టంగానే కనబరిచింది… సరే, సోనియా పుణ్యమాని తెలంగాణను ఎవరూ ఆపలేదు… ఎర్రజెండాకు ఆపే సీన్ కూడా లేదు…
తెలంగాణ ఏర్పడగానే సీపీఎం ఉమ్మడి ఆస్తులు చకచకా పంచేసుకున్నారు… ఇకనైనా అది యాంటీ తెలంగాణ పోకడను మార్చుకుంటుందని అనుకున్నారు అందరూ… కానీ ప్చ్… అది మారదు… దానికి ఓ పత్రిక ఉంది… గతంలో ప్రజాశక్తి… తెలంగాణ ఏర్పడగానే నవతెలంగాణ అని పేరు మార్చి, తెలంగాణ దుకాణం విడిగా తెరిచి, ఆ ఎడిషన్ వేరే తీసుకొచ్చారు…
సాధారణ స్పాట్ కవరేజీ మాటెలా ఉన్నా… మానవి వంటి ఫీచర్స్ మాత్రం అదే ఆంధ్రా వాసన కొడుతుంటయ్… తెలంగాణతనం అంటే ఇప్పటికీ దానికి పడదు ఎందుకో మరి..! కాజువల్‌గా నవతెలంగాణ మానవిలో ఇచ్చిన వంటల పేజీ చూస్తుంటే ఆశ్చర్యం కలిగింది… ఈరోజుల్లో ఆఫ్ బీట్ స్టోరీలు, ఫీచర్లలో వంటలకూ ప్రధానంగా స్పేస్ ఇస్తున్నాయి అన్ని పత్రికలూ…
Ads
ఈసారి పచ్చి బఠానీలు కాన్సెప్టుతో మూడో నాలుగో డిషెస్ రాసుకొచ్చారు… ఒకటి దోశ… పచ్చి బఠానీలను మసాలా దినుసులతో మిక్సీ చేసుకుని, శెనగపిండి కలిపి దోశల్లాగా వేసుకోవడమే… నిజమే, మీరు చదివింది… జస్ట్, బఠానీలు ప్లస్ శెనిగెపిండి… రెండు పరాటా… మామూలుగా పరాటాలు చేసుకున్నట్టే చేసుకోవాలి… పిండి ముద్ద కలుపుకున్నాక బఠానీలను కలపాలి… అంతే… సరే, ఇదీ ఓ రీతిలోనే ఉంది… మూడు టమాట బఠానీ కూర… దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది… టమాట కూర చేస్తాం కదా, అందులో బఠానీలు వేస్తే, అదే టమాట బఠానీ కూర…
నాలుగోది టేస్టీ రొట్టె… మీరు చదివింది నిజమే… డిష్ పేరే టేస్టీ రొట్టె… తెలంగాణ అస్థిత్వ, సాంస్కృతిక ఆహారవిశేషాల్లో ప్రధానమైంది సర్వపిండి, సర్వప్ప… బియ్యపు పిండితో చేస్తారు… ఇక్కడ వాళ్లు రాసింది కూడా అదే… బఠానీలను ఉడికించి, మెత్తగా మెదుపుకుని, బియ్యపుపిండి కలిపి సర్వపిండిలా కాల్చుకోవడమే… మధ్యమధ్య రంధ్రాలు చేసుకోవాలి… అయితే దానికి సర్వపిండి అని అసలు వంట పేరు రాయడం సదరు ఫీచర్ ఇన్‌ఛార్జులకు ఇష్టం లేదు… రాస్తే తెలంగాణతనం కదా, ఇసం… అందుకని దానికి టేస్టీ రొట్టె అని ఓ పిచ్చి పేరు తగిలించి, రొట్టె కాల్చారు… మీ టేస్టేమీ బాగాలేదు ఎడిటర్ మహాశయా… మరీ ఇంత ఆంధ్రాతనమా..?! చివరకు వంటల వార్తల్లో కూడా..!!
Share this Article