నవీన్ పోలిశెట్టి… కామెడీ టైమింగ్, డైలాగ్ డిక్షన్ తన నుంచే మిగతా వర్తమాన టీవీ, సినిమా కమెడియన్లు నేర్చుకోవాలి… ప్రత్యేకించి బొక కమెడియన్లు… మరీ వెగటు, వెకిలి, బూతు పదాలు, చేష్టలే కామెడీగా వర్ధిల్లుతున్న ఈ జబర్దస్త్ యుగంలో రియల్ హెల్తీ కామెడీ ఏమిటో తను చూపిస్తాడు…
ఆమధ్య వచ్చిన జాతిరత్నాలు సినిమాకు ప్రాణం తనే… అంతకుముందు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అని మరో సినిమా… చిచోరా అని హిందీ సినిమా… చివరగా అనుష్క శెట్టితో కలిసి నటించిన మిస్టర్ అండ్ మిస్ పోలిశెట్టిలో కూడా తను ఓ కమెడియన్ రోల్ చేశాడు… ఓ వెరయిటీ స్టోరీ లైన్‌తో సినిమా బాగుంటుంది… నిజానికి తను సినిమాల్లోకి రాకముందు ఓ స్టాండప్ కమెడియన్…
యూట్యూబర్, టీవీలు, షోలు, పలు పార్ట్ టైమ్ కొలువులు… అసలు లండన్ వెళ్లిన ఈ సివిల్ ఇంజినీర్ వినోద ప్రయాణమే ఆసక్తిదాయకం… తన స్టాండప్ కమెడియన్‌గా పనిచేయడమే సినిమాల్లోనూ తన టైమింగుకు ఉపకరిస్తున్నదేమో… కొన్నాళ్లుగా ఎక్కడా లేడు… బోలెడు వార్తలు… రకరకాలు… అయ్యలూ, బాబులూ… ఓ యాక్సిడెంటులో గాయపడ్డాను, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది…
Ads
ఇప్పుడు హఠాత్తుగా వచ్చేశాడు… రావడమే నేరుగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోకు గెస్టుగా… అదే ఎనర్జీ… టైమ్‌లీ పంచులు… తన ప్రమాదం గురించి వివరణ… ‘‘ఇక చేయి పనిచేయదేమో అనుకున్నాను, ఈ కష్టంలో నాకు అండగా నిలిచింది మ్యూజిక్ ఒక్కటే’’ అంటూ చెప్పుకొచ్చాడు… చేతికి బాండ్లు అలాగే ఉన్నాయి ఇంకా…
ఈ ప్రోమోలో నచ్చింది ఏమిటంటే..? నవీన్ పోలిశెట్టిలోని మరో కోణాన్ని చూపించడం… ఓ హిందీ పాట పాడాడు… గీతామాధురి భాషలోనే చెప్పాలంటే… సీరియస్‌గానే బాగా పాడాడు… ఓ రెగ్యులర్ గాయకుడిలాగే..! తను అనగనగా ఒక రాజు అనే ఓ కొత్త సినిమా కమిటైనట్టున్నాడు కదా… అందులో ఒక పాట నిజంగానే పాడిస్తే బాగుంటుంది… లేదా కంపోజర్ థమన్ తనే చాన్స్ ఇచ్చేట్టున్నాడు చూడబోతే…
ఎప్పటిలాగే షోలో… నజీరుద్దీన్, శ్రీకీర్తి, కీర్తన, అనిరుధ్ సుస్వరం, కేశవ్ రామ్ తదితరుల పాటలకు ఆహాలు ఓహోలు… జస్ట్, నవీన్ పోలిశెట్టి కోసం చూడాలేమో… అంతే… చూస్తున్నంతసేపూ ఆహ్లాదాన్ని పంచుతూనే ఉంటాడు తను…! తనలోని కమెడియన్‌ను పూర్తిగా ఆవిష్కరించే పాత్ర ఏదో తన కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నట్టుంది…!!
Share this Article