నిన్న ఉదయం 10 గంటలకే ‘ముచ్చట’ ఓ స్టోరీ పబ్లిష్ చేసి, విశ్లేషించింది ఇండియాటుడే తాజా సర్వేను… ఆ సర్వేలో పరస్పర భిన్నంగా ఉన్న అంశాలను, డౌట్లను కూడా వ్యక్తీకరిస్తూనే…. ఇద్దరు సీఎంలు ప్లస్ ప్రధాని మోడీల ర్యాంకులు ఘోరంగా దిగజారిపోయిన సర్వే సమాచారాన్ని కూడా అందించింది… ఈ దేశం మూడ్ తెలుసుకోవడానికి జస్ట్, 15 వేల శాంపిళ్లు సరిపోతాయా..? దాని కచ్చితత్వం పాలెంత అనే చర్చలోకి మనం ఇప్పుడు వెళ్లబోవడం లేదు గానీ… ఒకటి మాత్రం నిజం… గత సర్వేలో కూడా ఇంతే సంఖ్యలో శాంపిళ్లు తీసుకున్నప్పుడు మంచి మంచి స్థానాల్లో నిలిచిన తెలుగు ముఖ్యమంత్రులు ఏడాదిలో, అంతే సంఖ్యలో శాంపిళ్లు తీసుకున్న ఈసారి ఎందుకంత ఘోరంగా పడిపోయారు..? ప్రధాని కూడా తన పాపులారిటీని ఎందుకంతగా కోల్పోయాడు..? కచ్చితంగా ఓసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన సమయం ఇది… ఈ సర్వే ఆ సంకేతాలనే ఇస్తోంది… పార్టీలు, నాయకులు, వాటి అనుబంధ మీడియాలను విచిత్రమైన ఇరకాటంలో పడేసింది సర్వే… ఎలాగంటే..?
- కేసీయార్ వ్యతిరేకులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వాళ్లకు ఇరకాటం…. కేసీయార్ అసలు పాపులర్ సీఎంల జాబితాలోనే లేకపోవడం, మరీ దారుణమైన స్థితిలో తన పాపులారిటీ కొట్టుమిట్టాడుతున్న తీరును వెక్కిరించి, విమర్శించాలంటే…. మోడీ పాపులారిటీ కూడా పడిపోవడం…
- సేమ్… టీడీపీ… అసలు చంద్రబాబును దేశం ఒక లీడర్‌గా పరిగణించే లెవలే లేకపోవడం… ఒకప్పుడు చక్రాలు తిప్పిన లీడర్, ఇప్పుడు ఎవరికీ పట్టని ఓ అనాథ… జస్ట్, భారత జాతి విస్మరిస్తున్న ఓ పాత పచ్చ అవశేషం…
- సేమ్, వైసీపీ… మోడీ పాపులారిటీ తగ్గిందహో అని ఢూంఢాం అనాలంటే…. అసలు జగన్ పాపులారిటీయే ఘోరంగా పడిపోవడం… (పంచుడు పథకాలు పాపులారిటీని పెంచవు అని జగన్‌కు పాత చంద్రబాబు అనుభవాల్ని చదువుకున్నా అర్థం కాలేదు…)
- బీజేపీ వాళ్లకూ పచ్చి వెలక్కాయ గొంతుల్లో ఇరుక్కున్నట్టుగా….. కేసీయార్, జగన్‌కు చాకిరేవు పెట్టాలనుకుంటే… అదే సర్వేలో మోడీ పాపులారిటీ మరీ దారుణంగా పడిపోవడం… మింగలేక, కక్కలేక…
- కాంగ్రెస్ వాళ్లది మరీ ఏడుపు… కేసీయార్, జగన్, మోడీ… అందరూ వేస్ట్ అని ముద్ర వేద్దామనుకుంటే… ఆ ముద్ర ముందుగానే రాహుల్ గాంధీ మీద పడిపోవడం…. సోనియా, ప్రియాంకకు కూడా మినహాయింపు లేకపోవడం…
Ads
- అందుకే మరి… నమస్తే సైలెంట్… (ఏం చెప్పుకోగలదు ఫాఫం…)… నమస్తే సాక్షి, నమస్తే ప్రభ, నమస్తే ఈనాడు కూడా సేమ్… కక్కలేవు, మింగలేవు… రాయలేవు… ఏం రాద్దామన్నా ఎదురుతన్నే సిట్యుయేషన్… పాదాల మీద పడి పాకేవాడికి, నాకేవాడికి ఏం రాయాలో అర్థం కాదు కొన్నిసార్లు…
- ఓ దశ, ఓ దిశ లేని వెలుగు కూడా అంతే… కేసీయార్‌ను తిడదామంటే, అదే సర్వే మోడీని పాతాళానికి పడేసింది కదా… కొంతలోకొంత దిశ డిజిటల్ పేపర్ నయం… అందరికీ మించి ఆంధ్రజ్యోతి చాలా నయం…
- ఆ ఆంధ్రజ్యోతికి కూడా కేసీయార్ మీద భయం, భక్తి, జంకు, వణుకు లోలోపల… అందుకే జగన్‌ను ఏపీ ఎడిషన్లలో తిట్టేసి… తెలంగాణ ఎడిషన్లకొచ్చేసరికి ఒక్క కేసీయార్ మీద ఏమీ రాయలేక, ఇద్దరు సీఎంలనూ కలిపి ఏదో తూతూమంత్రం, తుమ్మకాయం మంత్రం తరహాలో ఏదో ఒక పిచ్చి వార్తను మమ అని పబ్లిష్ చేయడం…
- టీవీ డిబేట్లకు కూడా అక్కరకు రాదు, ఎందుకంటే, వచ్చే గెస్టులందరికీ ఇరకాటమే… ఎవడి పాపులారిటీ బాగాలేదు… ఎటొచ్చీ, పాపులర్ సీఎంల జాబితాలో కేరళ సీఎం మూడో ప్లేసులో ఉన్నాడు కాబట్టి కమ్యూనిస్టులకు మాత్రమే ఈ సర్వే కాస్త మొహం తెలుపు…
- ఈ సర్వేలో లక్ష లోపాలుండవచ్చుగాక… కానీ డెఫినిట్‌గా ఓ డిబేటబుల్ అంశమే… చివరగా అందరూ గుర్తించాల్సిన ఓ ప్రధానాంశం ఏమిటంటే… ఈ మేనేజ్డ్, పెయిడ్ సోషల్ గ్యాంగులకు అతీతంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఇప్పటికీ కాపాడుకుంటున్న పాపులారిటీ…!! He is ideal Ruler…!!!
Share this Article