.
అప్పుడప్పుడూ జిల్లా పేజీలు తిరగేయడం అలవాటు కదా… అనుకోకుండా ఓ జిల్లా పేజీ బ్యానర్ చూడగానే హఠాత్తుగా చూపు ఆగిపోయింది… ఆ స్టోరీ ఏమిటంటే… ఒకప్పుడు నక్సలైట్లకు ఆయువుపట్టుగా నిలిచిన ఓ ఊరు ఇప్పుడు ఆర్మీ వైపు కదిలింది… ఆ యువత కొత్త దిశలో పరుగు తీస్తోంది…
ఒకవైపు దండకారణ్యాన్ని ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర బలగాలు జల్లెడపడుతున్నాయి… నక్సలైట్లను అంతం చేయడం కోసం…! ఇదుగో ఇలాంటి పాత నక్సల్ గ్రామాలు మాత్రం తమ దిశ మార్చుకుని కేంద్ర బలగాల్లో చేరుతున్నాయి… ఎంత కంట్రాస్టు… నక్సలిజం మాయమైపోతున్న నేపథ్యంలో గ్రామాల యువత ఎటు చూస్తున్నారో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ…
Ads
మంచి హ్యూమన్ ఇంట్రస్టింగ్ స్టోరీ… నిజానికి జిల్లా పేజీకి ఇలాంటి స్టోరీలను పరిమితం చేయడం అనే ఈ జడ్జిమెంట్ ఏమాత్రం కరెక్టు కాదు… మానవాసక్తి కథనాలకు ఇతర పత్రికలు బాగా ప్రాధాన్యం ఇస్తున్నాయి, పాఠకులూ సొల్లు రాజకీయ వార్తలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు, ఇదుగో ఇలాంటివే కావాలిప్పుడు… ఈ స్టోరీకి బాధ్యులైన పాత్రికేయ మిత్రులకు అభినందనలు… మంచి వార్తా కోణం… హెడింగ్ కూడా ఇంకాస్త బాగుండాల్సింది… ఇది రొటీన్, మరీ జోన్ పేజీ బాపతు హెడింగ్…
ఆ ఊరి పేరు తిప్పాపూర్… పాత నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలం… 1984 ప్రాంతంలోనే నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారు ఊరి యువత… ఇంటికో నక్సలైట్… రాజ్యానికి వ్యతిరేకంగా పోరుబాట, అడవిబాట… ఊళ్లో ఓ పెద్ద అమరవీరుల స్మారక స్థూపాన్ని కూడా నిర్మించారు… నలుగురు పంచాయతీ అధికార్లను కిడ్నాప్ చేసి అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది ఆ ఊరు…
ఆరేడేళ్లపాటు అన్నలకు అడ్డా అది… తరువాత 1990లో నలుగురిని ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు, ఊరోళ్లతోనే స్థూపం కూల్చివేయించారు… తరువాత పోలీసు తీవ్ర నిఘా, నిర్బంధంతో నక్సలిజం ఆ ఊరి నుంచి వెళ్లిపోయింది… 1991లో అశోక్ అనే యువకుడు తొలుత ఆర్మీలోకి వెళ్లాడు… రాష్ట్ర పోలీసుల్లో మాత్రం చేరవద్దని నక్సలైట్ల దళం పిలిపించుకుని మరీ హెచ్చరించింది…
ఇక తనను చూసి ఒకరివెంట మరొకరు… 18 మంది ఇప్పటికి… మరో 40 మంది శిక్షణలో ఉన్నారు, వాళ్లూ వెళ్లిపోతారు… కొన్నేళ్లలో చూడండి… అప్పట్లో ఇంటికొక నక్సలైటు కదా… ఇక ఇంటికొక ఆర్మీ జవాను… ఎంత కంట్రాస్టు… ఎంత మార్పు..?
Share this Article