AK62… ఇదీ నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ వాళ్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించిన సినిమా… ఏకే47 మాదిరిగా ఏకే62 తుపాకీ కాదు… ఇది సినిమా పేరు కాదు, అజిత్ 62 వ సినిమా అని అర్థం… ఇప్పటికే మూడుసార్లు అజిత్‌తో జతకట్టిన నయనతార ఇందులో అజిత్ పక్కన హీరోయిన్‌గా నటించాలి… వాళ్లది హిట్ పెయిర్… నయనతార లేడీ సూపర్ స్టార్ కదా, అజిత్‌తో కలిస్తే ఇక ఢోకా ఏముంది..? సో, లైకా ప్రొడక్షన్స్ వాళ్లు ఈ సినిమా ప్రకటించడమే కాదు, మ్యూజిక్ కంపోజర్ తదితరుల పేర్లనూ ప్రకటించి, ఫార్మల్‌గా లాంచ్ చేశారు గత ఏడాది…
విఘ్నేశ్ గాలితో తేలిపోయాడు… ఖచ్చితంగా ఇది వర్కవుట్ అయి ఉంటే తనకు మంచి పేరు, డబ్బు వచ్చేవి… ఇంకా మంచి ప్రాజెక్టులు దొరికి ఉండేవి… ఓసారి నయనతార అజిత్‌ను రహస్యంగా తన ఇంట్లో కలుసుకుని, సినిమాలో అజిత్ లుక్కు, భాష, కథ ఎట్సెట్రా డిస్కస్ చేసిందనే వార్తలు కూడా వచ్చాయి… మరి మొగుడు దర్శకత్వం చేస్తున్న సినిమా కదా… తనూ బాధ్యత తీసుకుంటోంది గుడ్ అన్నారందరూ… పైగా అందులో తనే హీరోయిన్ కదా… సీన్ కట్ చేస్తే…
లైకా ప్రొడక్షన్స్ వాళ్లు సినిమాను హోల్డ్‌లో పెట్టేశారు… ఎందుకూ అంటే అజిత్‌కు విఘ్నేశ్ చెప్పిన కథ నచ్చలేదుట… మరి కథ నచ్చకపోతే ఎలా ప్రాజెక్టుకు సంతకాలు పెట్టాడు..? ఇదొక మిస్టరీ ప్రశ్న… ఇంకేదో కారణం ఉంది, అది అజిత్ చెప్పడు, విఘ్నేశ్ చెప్పడు, లైకా వాళ్లు అస్సలు నోళ్లు విప్పరు… సినిమాను కొన్నాళ్లు హోల్డ్ చేయడమే కాదు, విఘ్నేశ్‌ను ఆ ప్రాజెక్టు నుంచి చెప్పాపెట్టకుండా తప్పించేశారు… ఇది ఖచ్చితంగా విఘ్నేశ్‌కు అవమానమే…
Ads
ఈ పరిణామం విఘ్నేశ్‌కన్నా తన భార్య నయనతారను బాగా డిస్టర్బ్ చేసింది… తన సినిమా పోయినందుకు కాదు, తనను కూడా ఉంచారో లేదో కూడా తెలియదు, ఇది కాకపోతే ఇంకా పది సినిమాలు వస్తాయి తనకు, వయస్సు మీద పడినా గిరాకీ తగ్గలేదు ఆమెకు… సో, అది ప్రాబ్లం కాదు, విఘ్నేశ్‌కు నష్టదాయకం… అజిత్ రెఫ్యూజ్ చేశాడంటే భవిష్యత్తులోనూ పెద్ద ప్రాజెక్టులు రాకపోవచ్చు… సో, నయనతార బాగా బాధపడింది… దాంతో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తమిళ మీడియా, సోషల్ మీడియా కోడైకూస్తోంది…
ఇకపై అజిత్‌తో కలిసి తాను నటించబోను అనేది ఆ నిర్ణయం… నిజానికి చాన్నాళ్లుగా నయనతారే స్వయంగా రంగంలోకి దిగి, భర్త తరఫున లైకా ప్రొడక్షన్ వాళ్లతో, అజిత్‌తో సంప్రదింపులకు దిగింది… సర్దుబాటు చేయడానికి ప్రయత్నించింది… కానీ అజిత్ విఘ్నేశ్ వద్దని భీష్మించుకున్నాడు… దాంతో లైకా వాళ్లు ఆ సినిమాకు విఘ్నేశ్ ప్లేసులో మాగిల్ తిరుమణిని తీసుకున్నారు… లైకా వాళ్లు నయనతారకు స్పష్టంగా చెప్పారట… మీ భర్త చెప్పిన కథనం అజిత్‌కు నచ్చలేదు, కొన్ని మార్పులు చెబితే మీ భర్తే పట్టించుకోలేదు, ఇంకేం చేయమంటారు మరి అనడిగారుట…
ఇదే ఫ్రస్ట్రేషన్‌లో నయనతార ఈ నిర్ణయం తీసుకుంది… నయనతారతో నటించకపోతే అజిత్‌కు నష్టమేమీ లేదు, ఆమె గాకపోతే వేయి మంది… కానీ ఇక్కడ అజిత్‌దే పెద్ద తప్పు… ముందుగా కథ విని సంతకం చేశాక ఇప్పుడు స్టోరీ నచ్చలేదనడం ఏమిటి..? విఘ్నేశ్‌ది కూడా తప్పే… అజిత్ చెప్పిన మార్పులకు తలూపితే పోయేది… తెలుగులో హీరోలు తమ అభిమానులనే దర్శకులిగా పెట్టుకుని, తాము చెప్పినట్టుగా సినిమాలు తీయించుకుంటున్నారు… దండాలు పెట్టి, హీరోల కాళ్ల దగ్గర కూర్చునే దర్శకుల తరం ఇది… ఇది హీరోస్వామ్యం బ్రదర్…నిజానికి నయనతారదీ తప్పే… అజిత్ సినిమాల్ని బహిష్కరించడం వల్ల తనకే నష్టం… అందుకని దూద్ కా దూద్, పానీకా పానీ… విఘ్నేశ్ భార్యగానే కాదు, ఇండిపెండెంట్ హీరోయిన్‌గానూ తన ఉనికిని కాపాడుకోవాలి కదా…!
Share this Article