ఒక కళలో మంచి ప్రతిభ ఉన్నంతమాత్రాన మంచి మనుషులు కావాలనేమీ లేదు… ఎప్పుడూ మీడియా తెర మీద, వెండి తెర మీద కనిపిస్తూ గొప్పవాళ్లుగా జనం భ్రమపడినంతమాత్రాన వాళ్ల నిజస్వరూపాలు గొప్పగా ఉండాలని ఏమీ లేదు…
బోలెడు ఉదాహరణలు… చాలామంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, అసలు తత్వాలు వేరు… ప్రత్యేకించి మన తెలుగు సినిమా సెలబ్రిటీలకన్నా తమిళ సెలబ్రిటీల తీరు చూస్తే ఆశ్చర్యం, మరీ కొందరి అసలు రూపాలు చూస్తే అసహ్యమూ కలుగుతుంది…
Ads
ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో నయనతార-ధనుష్ వివాదం బాగా చర్చనీయాంశమైంది… అంతకుముందు ఇళయరాజా బాగోతాలు చూశాం కదా… తనను ఏదో ఓ రూమ్‌లో నీ స్టూడియో నడిపించుకో అన్న పాపానికి ఆ రూమ్ నాదే అని కోర్టుకెక్కాడు…
తన పాటలకు సంబంధించి చిన్న బిట్ ఎవరైనా వాడుకున్నా కోర్టుకెక్కాడు… రాయల్టీలపై ఎందరినో సతాయించాడు… చివరకు మంజుమ్మల్ బాయ్స్ సినిమాలో ఒకచోట తన పాటకు సంబంధించిన ఒకటీరెండు వాక్యాలు సినిమాలో పాత్రధారులు హమ్ చేస్తే… దానికీ కోర్టుకెక్కాడు… చివరకు ఎంతోకొంత ఇస్తే గానీ రాజీపడలేదు… ఎస్పీ బాలును ఎంత వేధించాడో తెలిసిందే కదా…
ఒక మ్యూజిక్ కంపోజర్‌గా ఇళయరాజాా గొప్పోడు… కానీ పైవన్నీ చదివితే కదా అసలు ఇళయరాజా కనిపించేది… కస్తూరి కథా అంతే… ఎప్పుడూ ఏదో కూసే అలవాటుంది… డీఎంకేను టార్గెట్ చేస్తూ, ఏవో విమర్శలు చేయబోెయి, బ్రాహ్మణ కులపక్షపాతంతో ఏదో అనబోయి, మొత్తం తెలుగువారినే కించపరిచేలా మాట్లాడింది…
ఆమె మాటల్లో తప్పేముంది అనిపించవచ్చుగాక… కానీ అభిప్రాయ వ్యక్తీకరణలో కూడా జాగ్రత్తలు అవసరం… ఇప్పుడు అరెస్టయింది… కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో, ఏ తెలుగువాళ్లను కించపరిచిందో అదే తెలుగువాళ్ల నడుమకు వచ్చి, దాక్కుని, చివరకు దొరికిపోయింది…
ఇప్పుడు ధనుష్ కథా అంతే… తను నటుడిగా వోకే… సినిమా కుటుంబం నుంచే వచ్చాడు… ఏకంగా సూపర్‌స్టార్ రజినీకాంత్ బిడ్డ ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు… భరించీ భరించీ ఆమె ఇక వదిలేసింది… ప్రస్తుతం నయనతార ధనుష్ వివాదం చూస్తుంటే… ఐశ్వర్య తన తత్వాన్ని ఏళ్లకేళ్లు భరించి ఇక భరించలేక వదిలేసినట్టుంది…
తాజా వివాదానికి వస్తే… ఎప్పటినుంచో నయనతారకు ధనుష్‌కు నడుమ ఏవో పాత పగలున్నాయి… అవేమిటో వాళ్లెవరూ బయటపెట్టలేదు గానీ… నేనూ రౌడీనే అనే సినిమాకు సంబంధించి ఇప్పుడు బయటపడ్డాయి… 10 కోట్లకు నయనతారకు నోటీసులు పంపించాడు కాపీరైట్స్ ఉల్లంఘన పేరిట…
నిజానికి నయనతార చేసిన తప్పేమీ లేదు… తన డాక్యుమెంటరీకి ఆ సినిమా క్లిప్స్ వాడతాను అంటే నిర్మాత ధనుష్ ఒప్పుకోలేదు… దాని దర్శకుడు నాయనతార భర్త విఘ్నేశ్ శివన్… అందులో నయనతార నటించింది… నెట్‌ఫ్లిక్స్ కోసం బియాండ్ ద ఫెయిరీటేల్ పేరిట తన పెళ్లి, తన విశేషాలతో ఓ డాక్యుమెంటరీ చేసింది ఆమె…
తనకు బాగా పేరు తెచ్చిన ఆ సినిమా బిట్స్ వాడుకోవడానికి ధనుష్ అంగీకరించలేదు… రెండేళ్లుగా అడుగుతోంది… కానీ నిల్ రిప్లయ్… దాంతో షూటింగ్ సమయంలో తమ కెమెరాలతో తీసిన 3 సెకండ్ల బిట్ వాడుకుంది ఆమె… పదేళ్ల నాటి సినిమా అది… పైగా తను నటించింది… అది ఒరిజినల్ ఫీడ్ కూడా కాదు… షూటింగ్‌ను రికార్డు చేసిన ఓ సాదాసీదా ప్రైవేటు వీడియో… దానికి కాపీ రైట్ ఉల్లంఘన అట, 10 కోట్లకు నోటీసు అట…
చాన్నాళ్లుగా ధనుష్‌కు నయనతార అంటే కోపం… గతంలో ఫిలిమ్‌ఫేర్ అవార్డుల సమయంలో కూడా తన పగను, తన కోపాన్ని తన మాటల్లో బయటపెట్టాడని నయనతార అంటోంది… ఈ 10 కోట్ల నోటీసుపై కూడా కస్సుమంది… ఇంత దిగజారతావా అంటూ కడిగేసింది… ఈమేరకు సుదీర్ఘంగా ఓ నోట్ రిలీజ్ చేసింది… అది చదివితే ధనుష్‌దే తప్పు అనిపిస్తోంది… నయనతార ఆవేదనలో, వాదనలో న్యాయముంది… ధనుష్ గుణం బయటపడిపోయింది..!! అందుకే తోటి తారలు నయనతారకు మద్దతు పలుకుతున్నారు… ధనుష్‌కు కోపం వస్తే రానీ అని సిద్ధపడిపోయి..!!
Share this Article