Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ సాదాసీదా మూస కథకు మల్లెమాల మార్క్ ట్రీట్‌మెంట్…

October 22, 2024 by M S R

సోగ్గాడు శోభనాద్రి లాంటి సినిమా ఈ నాయుడుబావ సినిమా . ప్రముఖ నిర్మాత , దర్శకుడు , కవి మల్లెమాల యం యస్ రెడ్డే 1978 లో వచ్చిన ఈ సినిమాకు నిర్మాత , దర్శకుడు , మాటల పాటల స్క్రీన్ ప్లే రచయిత . కధ రొటీనే అయినా ఆయన బాణీలో ఆయన తీసారు .

ఓ కోటీశ్వరుడయిన తాతగారు , ఆయనకో ముద్దుల మనమరాలు , ఆస్తి మీద హీరోయిన్ మీద కన్నేసిన ఓ విలన్ మామయ్య , తాతగారు అర్జెంటుగా పెళ్ళి చేసుకోవాలని మారాం చేయటం , దొంగ ప్రియుడుగా నాయుడుబావని ప్రవేశపెట్టడం , తర్వాత పెళ్ళి అవటం , నాయుడుబావ మరదలు బావ దగ్గరకు చేరటం , విలన్ అందరినీ ఆస్తి కోసం బంధించటం , నాయుడుబావ అందరినీ విలన్ని ఉతికే క్రమంలో తాతగారి మనుమరాలు చనిపోవటం , చనిపోతూ బావామరదళ్ళను కలిపి తన బిడ్డను అప్పచెప్పటం . ఇదీ కధ టూకీగా .

ఇలా దొంగ మొగుడ్స్ , దొంగ ప్రియులు ప్రవేశపెట్టబడటం చాలా సినిమాలలో చూసి ఉంటాం . యం యస్ రెడ్డి గారు సీతయ్య లాగా ఎవరి మాటా వినరు అని అంటారు . తన బాణీలో తాను తీసారు . శోభన్ బాబు అభిమానులను బాగా హుషారు పెట్టిందని గుర్తు . సోగ్గాడు సినిమాలాగా కనకం కురియలేదు .

Ads

శోభన్ బాబు , ఆయన మరదలుగా జయప్రద , తాతగారి మనుమరాలిగా జయసుధ , తాతగారిగా సత్యనారాయణ , విలన్ మామయ్యగా మోహన్ బాబు , విలన్ శకునిగా సాక్షి రంగారావు , ఇతర పాత్రల్లో రాజబాబు , నిర్మలమ్మ , మా గుంటూరు కళాకారుడు జయప్రకాష్ రెడ్డి , ప్రభృతులు నటించారు .

సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది మల్లెమాల మాటలు , పాటలు . శోభన్ బాబు నటించిన హిట్ సినిమా పేర్లతో ఒక పాట ఇంటరెస్టింగుగా ఉంటుంది . నా పేరే హడల్ అని పాట పాడుతూ క్లైమాక్సులో విలన్ గేంగుని చితగ్గొట్టడం వెరైటీగా ఉంటుంది . నెల్లూరి చేలలో పిల్లగాలికి ఊగే వరి వెన్నులాంటిది మల్లి సొగసు పాట సాహిత్యం , శోభన్ బాబు , జయప్రదల డాన్స్ అందంగా ఉంటాయి . ఇది మల్లెమాల మార్కు పాటే .

ఇలాంటిదే మరో మల్లెమాల మార్క్ పాట కూడా ఉంది . శోభన్ బాబు , జయమాలినిల మీద ఉంటుంది . ఎ బి సి డి ఎక్స్ అంటూ జయమాలిని మోడరన్ డాన్సుతో మొదలయి , శోభన్ బాబు మన తెలుగు నేల గొప్పతనాన్ని , మన సంస్కృతిని వివరించే పాటతో ముగుస్తుంది .

హీరోని హీరోయిన్ , హీరోయిన్ని హీరో టీజ్ చేసే ఢీ డిక్కుం ఢీ ఢీ పాట హుషారుగా ఉంటుంది . హరిహరి నారాయణ , పాలూ చక్కెర కలిసాయి ఆలూమగలై వెలిశాయి , దిక్కుల్లో మొదటిది తూరుపు దిక్కు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి .

జయసుధ ఓ కీచకుడితో కారుతో ఫైట్ చేయటం , శోభన్ బాబు సైకిలుతో ఫైట్ చేయటం , పాట పాడుతూ విలన్ని , అతని గేంగుని చితగ్గొట్టడం ఈ సినిమాలో ప్రత్యేకతలు . శోభన్ బాబుకి హడల్ అనే పేరుతో ఓ మారు వేషం కూడా ఉంటుంది . సినిమా యూట్యూబులో ఉంది . శోభన్ బాబు అభిమానులు చూడనివారు ఉంటే చూడవచ్చు . చూడబులే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు    (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • PhotonSync… మన డిజిటల్ సైంటిస్టుల ‘సూపర్ షీల్డ్’ ఆవిష్కరణ…
  • ‘కాశ్మీర్ ప్రిన్సెస్’… ఆకాశంలో మృత్యువు… ఫస్ట్ ఇండియన్ జేమ్స్ బాండ్…
  • ఓహ్…! ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు వెనుక అసలు కథ, కుట్రలు ఇవా..?!
  • ఎంజీఆర్..! ఇప్పటికీ ఆ పేరును ఎందుకు స్మరించుకోవాలంటే..!!
  • అన్ని న్యూస్ వీడియోల్లో ఆ మిస్సింగ్ కుర్రాడి జాడ వెతకడం ఎలా..?
  • సినిమా ఇండస్ట్రీకి ప్రమాద ఘంటికలు… బాగా పడిపోయిన వసూళ్లు…
  • అరుణారుణ జ్ఞాపకం హరితీకరణ..! ఆ స్థూపం ఆకుపచ్చబడింది..!
  • కేటీయార్ హుందా స్పందన… హరీష్ రావు ‘గంటె భాష’లో అక్కసు…
  • కలాం కావల్ – మమ్ముట్టి ‘నట మాయాజాలం’… మరో భిన్నపాత్రలో…
  • ‘ఆమెను’ చంపేసి… రెండు వారాల తరువాత మళ్లీ బతికించారట…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions